కుప్పంలో 3 రోజుల నా పర్యటన ఎంతో ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగింది. ప్రశాంతమైన, స్వచ్ఛమైన కుప్పంలో పర్యటన కొత్త శక్తినిచ్చింది. దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాం. వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రూ.9322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. వ్యవసాయం, ఫౌల్ట్రీ, తయారీ రంగంలో అవకాశాలకు నాంది పలికాం. స్వర్ణ కుప్పం సాకారం చేయడానికి... సరికొత్త కుప్పాన్ని ఆవిష్కరించడానికి సమగ్రమైన విజన్ సిద్ధం చేస్తున్నాం. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పం... రానున్న రోజుల్లో దేశానికే మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది.
సత్యవేడు నియోజకవర్గం, పాలగుంట గ్రామం వద్ద ఉన్న స్పెర్రీ గ్రీన్ రీసైక్లింగ్ పాలిమర్ తయారీ సంస్థకి సంబందించి ఆ కంపెనీ ప్రతినిధులు మరియు స్థానిక టీపీడీ నాయకులతో కలిసి ముఖ్య అతిధిగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సత్యవేడు టీడీపీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్ది గారు.
రాయలసీమను రతనాల సీమగా మలుస్తున్న విజనరీ చంద్రబాబు
కరువు, ఫ్యాక్షన్ ముద్రను చెరిపి... పెట్టుబడులు, పరిశ్రమలు, నీరు, ఉద్యోగాలతో కొత్త చరిత్ర రాస్తున్న నాయకత్వం
ఒకప్పుడు "రాయలసీమ అంటే రాళ్లసీమ... కరువు సీమ... ఫ్యాక్షన్ సీమ" అనే ముద్ర ఉండేది. వర్షాభావం, సాగునీటి కొరత, వలసలు, నిరుద్యోగం, రాజకీయ హింస... ఇవే సీమకు గుర్తింపుగా మారాయి.
కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారుతోంది.
రాయలసీమ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాటలు స్టీల్ ప్లాంట్లు, స్పేస్ సిటీలు, డ్రోన్ సిటీలు, డిఫెన్స్ కారిడార్లు, గ్రీన్ ఎనర్జీ, భారీ పరిశ్రమలు, నీటి భద్రత, హార్టికల్చర్ హబ్, లక్షల ఉద్యోగాలు.
ఈ మార్పు వెనుక ఉన్న దార్శనికత ఒకటే... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎన్టీఆర్ ప్రారంభించిన మార్పు... చంద్రబాబు పూర్తి చేస్తున్న విజన్
రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బదులుగా అభివృద్ధి రాజకీయాలను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ.
ఎన్టీఆర్ ఆలోచనలకు కొనసాగింపుగా చంద్రబాబు గారు రాయలసీమ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, అవుకు టన్నెల్, పట్టిసీమ వంటి అనేక నీటి ప్రాజెక్టులను నిర్మించారు.
కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సీమకు తీసుకొచ్చి... "కరువు సీమ" అనే ముద్రను చెరిపేయడానికి పునాది వేశారు.
రెండేళ్లలో సాగునీటి విప్లవం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
రెండేళ్లలోనే సాగునీటి ప్రాజెక్టులకు ₹12,484 కోట్లు
2026-27 బడ్జెట్లో మరో ₹10,000 కోట్లు
హంద్రీ-నీవాకు ₹3,873 కోట్ల వ్యయం
ప్రభుత్వం వచ్చిన తొలి 100 రోజుల్లోనే హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణ, కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కాలువల లైనింగ్ పూర్తి
మల్యాల ఎత్తిపోతల ద్వారా రికార్డు స్థాయిలో 52 టీఎంసీల నీరు
రాయలసీమలో 530 జలాశయాలు నింపడం
మూలపల్లి, కళ్యాణి డ్యాంలకు నీరు అందించేందుకు ₹126 కోట్లు
మడకశిర బ్రాంచ్ కాలువ విస్తరణకు ₹790 కోట్లు
గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర తదితర ప్రాజెక్టుల మరమ్మతులకు ₹610 కోట్లు
దీంతో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీటి భద్రత లభిస్తోంది.
'జలధార - జలహారతి'తో భూగర్భ జలాల పునర్జన్మ
నీటి నిర్వహణలో కూటమి ప్రభుత్వం చేపట్టిన జలధార - జలహారతి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.
అన్నమయ్య జిల్లాలోనే
భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరిగాయి
ఎండిపోయిన 20 వేల బోర్లు తిరిగి జీవం పొందాయి
వ్యవసాయ విద్యుత్ వినియోగంలో ₹96 కోట్ల ఆదా
ప్రతి చెరువులో 25-50% నీటి నిల్వ
ఉద్యాన పంటలు మరో 20 వేల హెక్టార్లకు విస్తరణ
ఐదు లక్షల ఎకరాల్లో పశుగ్రాసం
రోజుకు అదనంగా లక్ష లీటర్ల పాల ఉత్పత్తి
ఇదే నమూనాను రాయలసీమలోని 20 వేల చెరువులకు విస్తరించారు.
వ్యవసాయంలో కొత్త దిశ
రాయలసీమను దేశంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
"రాయలసీమ మిషన్"కు లక్ష కోట్ల రూపాయల ప్రణాళిక
90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్
63% పంటలు మైక్రో ఇరిగేషన్ కింద
దేశంలోనే నంబర్-1 మైక్రో ఇరిగేషన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
నీటి ఆదా... దిగుబడి పెరుగుదల... రైతు ఆదాయం పెంపు... ఇదే లక్ష్యం.
పరిశ్రమలతో సీమ ముఖచిత్రం మారుతోంది
ఒకప్పుడు ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సి వచ్చేది.
ఇప్పుడు పరిశ్రమలే రాయలసీమకు వస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం
₹4.63 లక్షల కోట్ల పెట్టుబడులు
239 పరిశ్రమలు
4.11 లక్షల ఉద్యోగాలు
లక్ష్యంగా ముందుకెళ్తోంది.
స్పేస్ సిటీ... డ్రోన్ సిటీ... డిఫెన్స్ సిటీ
దేశంలోనే మొదటిసారిగా
స్పేస్ సిటీ
డ్రోన్ సిటీ
డిఫెన్స్ తయారీ కేంద్రాలు
రాయలసీమలో ఏర్పడుతున్నాయి.
డ్రోన్ సిటీ
కర్నూలు, అనంతపురంలో 600 ఎకరాల్లో
Algobotics
Drogo
Latrics
Sensel Maze
JDK Fly
Sarla Aviation
Spacefields
వంటి సంస్థలు ఇప్పటికే అడుగుపెట్టాయి.
సత్యసాయి జిల్లా... ఏరోస్పేస్ హబ్
రూ.15,800 కోట్లతో
Aircraft Integration & Flight Testing Centre
ఇక్కడే ఏర్పాటు అవుతోంది.
ఇక్కడే
AMCA యుద్ధ విమానాల తయారీ
డిఫెన్స్ ఎకోసిస్టమ్
డ్రోన్ పరిశ్రమలు
అభివృద్ధి చెందనున్నాయి.
దీని చుట్టూ మరో ₹1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
అదే జిల్లాలో
భారత్ ఎలక్ట్రానిక్స్
HFCL
KSSL
JK Mini Aerospace
Astrobase Space
వంటి అనేక సంస్థలు వస్తున్నాయి.
స్పేస్ సిటీగా తిరుపతి
తిరుపతిలో
Ethereal Exploration
Skyroot Aerospace
వంటి సంస్థలు రాకెట్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.
సోలార్ శక్తికి కేంద్రంగా రాయలసీమ
మూడేళ్లలో 50 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
అందులో భాగంగా
Premier Energies
Websol
Voltsun Labs
Agastya Energy
Gridon
SAEL
వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.
స్టీల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులు
రాయలసీమలో ఇప్పటికే లేదా నిర్మాణంలో ఉన్న ముఖ్య ప్రాజెక్టులు:
JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ – ₹16,350 కోట్లు
JSW సోలార్ క్యాప్టివ్ పవర్ – ₹20,350 కోట్లు
Hero MotoCorp Global Parts Centre
Royal Enfield
Apollo Tyres విస్తరణ
Carrier Global
LG Electronics
Greenko
IndiChip Semiconductors
Chinta Green Energy
Adani Green Energy
వంటి ప్రాజెక్టులు వేలాది ఉద్యోగాలను తీసుకువస్తున్నాయి.
రోడ్లు... విమానాశ్రయాలు... కనెక్టివిటీ
రాయలసీమ అభివృద్ధికి మౌలిక వసతులే బలమని భావించిన ప్రభుత్వం
₹39,058 కోట్లతో 48 జాతీయ రహదారులు
1,441 కి.మీ. రహదారి నిర్మాణం
రెండేళ్లలోనే 504 కి.మీ. పూర్తి
అమరావతి–అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పునఃప్రారంభం
కడప, కర్నూలు విమానాశ్రయాల అభివృద్ధి
కుప్పం విమానాశ్రయానికి సన్నాహాలు
కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగం
వంటి చర్యలు చేపట్టింది.
సంక్షేమం కూడా సమాన ప్రాధాన్యం
అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కొనసాగుతోంది.
తల్లికి వందనం
16.46 లక్షల మంది విద్యార్థుల కోసం
₹2,867.54 కోట్లు
అన్నదాత సుఖీభవ
17.35 లక్షల మంది రైతులకు
₹3,241 కోట్లు
ఆటో డ్రైవర్ల సేవలో
74 వేల మంది డ్రైవర్లకు
₹111.3 కోట్లు
మత్స్యకారుల సేవలో
3,157 కుటుంబాలకు
₹12.01 కోట్లు
రాయలసీమ ఇక వలసల ప్రాంతం కాదు... అవకాశాల ప్రాంతం
ఒకప్పుడు
నీటి కోసం పోరాటం
ఉద్యోగాల కోసం వలసలు
పరిశ్రమల లేమి
కరువు
ఫ్యాక్షన్
అనే మాటలు వినిపించేవి.
ఈరోజు
స్పేస్ సిటీ
డ్రోన్ సిటీ
స్టీల్ ప్లాంట్
సెమీకండక్టర్
గ్రీన్ ఎనర్జీ
ఏరోస్పేస్
డిఫెన్స్
హార్టికల్చర్ హబ్
భారీ జాతీయ రహదారులు
నీటి భద్రత
లక్షల ఉద్యోగాలు
అనే పదాలు వినిపిస్తున్నాయి.
రాయలసీమ అభివృద్ధి ఒక్క ప్రాజెక్టుతో సాధ్యమయ్యేది కాదు. నీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, సంక్షేమం - ఈ అన్ని రంగాలను ఒకేసారి ముందుకు తీసుకెళ్లే సమగ్ర దృష్టి అవసరం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోందని ఈ ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యక్రమాలు సూచిస్తున్నాయి.
"రాళ్లసీమ"గా ముద్రపడిన ప్రాంతాన్ని "రతనాల సీమ"గా, కరువు గుర్తింపును అవకాశాల గుర్తింపుగా మార్చాలనే విజన్‌తో సాగుతున్న ఈ ప్రయాణం, రాయలసీమ భవిష్యత్తును కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నంగా నిలుస్తోంది.
@ncbn@naralokesh
#RayalaseemaRising
#ChandrababuNaidu
#NaraLokesh
#Rayalaseema
స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ గారు ఓర్వలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టాం. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు జగన్ గారు? పేదలు బాగుపడితే చూడలేరా?
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ గారు ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ గారు ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ గారు?
@ysjagan
It was a privilege to clap the first shot and launch the shoot of #NBK112 in #Amaravati.
This is more than the beginning of a film - it is another step towards making Amaravati a vibrant hub for the creative economy. Under the leadership of Hon'ble CM Shri @ncbn garu, we are committed to creating world-class infrastructure that enables the film industry and creators to thrive in Andhra Pradesh.
My best wishes to Bala Mavayya, the entire cast and crew for a blockbuster success. Looking forward to seeing many more films begin their journey from Andhra Pradesh.
భవిష్యత్ తరాల కోసం బలమైన రాష్ట్ర నిర్మాణానికి పునాది వేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి రెండేళ్లు. రెండేళ్లు పాలనలో అభివృద్ధికి స్పష్టమైన పునాది పడింది.
#Narachandrababunaidu#kurapatisankarreddy
#2YrsOfTrustDevelopmentWelfare
ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్!
@narendramodi@PawanKalyan
#EDArrestsJaganAide
జగన్ హయాంలో ఏపీలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో విచారణ వేగవంతం చేసిన ఈడీ, జగన్ సన్నిహితుడు ఈ కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తీగ గట్టిగా లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదిలేలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
అంతులేని విషాదంలో మునిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కార్మిక సంఘాల నేతలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోమని, వారికి అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని మంత్రి లోకేష్ ప్రకటించారు. మాట ఇచ్చినట్టే తక్షణ పరిహారంగా రూ. 25 లక్షలు చెక్‌లను అందజేశారు.
#VizagSteelPlant
#NaraLokesh
#AndhraPradesh
నమ్మకానికి నిలువెత్తు రూపం.. రెండేళ్ల ప్రగతి ప్రస్థానం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన 'రెండేళ్ల నమ్మకం' ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తోంది. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 20 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాల సృష్టితో యువతకు భరోసానిచ్చింది. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీ శక్తి వంటి విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, సుపరిపాలనే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం రేపటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న చంద్రబాబు, లోకేష్ ల నాయకత్వానికి ఇవే ఘన అభినందనలు!
#MSMEwaveInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#VisakhaUkkuAndhrulaHakku
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును రెండు సార్లు కాపాడిన చరిత్ర మాది. విశాఖ ఉక్కును విధ్వంసం చేసి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసింది జగన్ మోహన్ రెడ్డి గారు. స్టీల్ ప్లాంట్ వలన కాలుష్యం అంటూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూసిన మీరు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు...కానీ స్టీల్ ప్లాంట్ లేకుండా చెయ్యాలని కుట్ర పన్నిన మీరు అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు వెళ్ళండి @ysjagan గారు.
బాధలో ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లింది రాజకీయాల కోసం కాదు... బాధను పంచుకోవడానికి
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్రంగా గాయపడటం ప్రతి ఒక్కరినీ బాధించింది.
అలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ గారు కేజీహెచ్‌కు, అనంతరం స్టీల్ ప్లాంట్‌కు వెళ్లింది రాజకీయాలు చేయడానికి కాదు... బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడానికి. కన్నీటి పర్యంతమైన కుటుంబాలను ఓదార్చడానికి. వారి చేతిని పట్టుకుని ప్రభుత్వం మీతోనే ఉందని భరోసా ఇవ్వడానికి.
కానీ దురదృష్టవశాత్తూ, అక్కడ కూడా కొందరు రాజకీయ నినాదాలతో వాతావరణాన్ని ఉద్రిక్తం చేయడానికి ప్రయత్నించారు.
అయినా లోకేష్ గారు సహనం కోల్పోలేదు.
“సార్... ప్లీజ్. కుటుంబాలతో మాట్లాడనివ్వండి. ఇప్పుడు రాజకీయాలు వద్దు... ప్లీజ్” అని పదేపదే విజ్ఞప్తి చేశారు.
నినాదాలు కొనసాగినా, ఆయన వెనక్కి తగ్గలేదు. బాధిత కుటుంబాల వద్ద కూర్చొన్నారు. వారి ఆవేదనను విన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నాయకత్వం అంటే మైక్ ముందు మాట్లాడటం కాదు... బాధలో ఉన్న వారి పక్కన కూర్చోవడం.
నాయకత్వం అంటే నినాదాలు చేయడం కాదు... కన్నీరు తుడవడం.
నాయకత్వం అంటే రాజకీయ ప్రదర్శన కాదు... మానవత్వాన్ని చూపించడం.
ఆ రోజు బాధిత కుటుంబాలకు ఒక మంత్రి మాత్రమే కనిపించలేదు... ఒక అన్నయ్య కనిపించాడు.
కొంతమందికి రాజకీయాలు కనిపించి ఉండొచ్చు. కానీ బాధలో ఉన్న కుటుంబాలకు మాత్రం అండగా నిలిచిన మనిషి కనిపించాడు.
చరిత్ర ఎప్పుడూ నినాదాలను గుర్తుంచుకోదు.
బాధలో ఉన్న వారి పక్కన నిలిచిన వారినే గుర్తుంచుకుంటుంది.
#VizagSteelMartyrs #NaraLokesh #VizagSteelPlant
విశాఖ కేజీహెచ్ లో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చాను. సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించాను. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నాను. కార్మికులతో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.