Official Twitter handle of the SHO, Mirdoddi Police Station, Siddipet Police Commissionerate, Telanagana State Police.
Emergency please contact Dial 100.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది చెరువులో దూకిన వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. మిరుదొడ్డికి చెందిన చింతమడక లచ్చవ్వ (70) స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న బ్లూ కోల్ట్స్ పోలీసులు రాజు, బాబు నీటిలోకి దికి ఆమెను ఒడ్డుకు చేర్చారు.
సిద్దిపేట పోలీస్ ఉద్యోగమిత్ర! 📢
సిద్దిపేట పోలీస్ ఆధ్వర్యంలో భారీ 'మెగా జాబ్ మేళా'.
✅ 50+ ప్రముఖ కంపెనీలు
✅ ఏప్రిల్ నెలలో నిర్వహణ
వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి: 👇
🔗 https://t.co/rzJmv4n7Ca
#Siddipet#JobMela#Employment#PoliceUdyogaMitra
పండుగ ఆఫర్లు, గ్రీటింగ్స్ పేరిట వచ్చే లింక్స్‌తో జాగ్రత్త. తక్కువ ధరకే వస్తువులు వస్తాయనే ప్రకటలను చూసి మోసపోవద్దు. న్యూఇయర్ ఆఫర్ల వలలో చిక్కొద్దు. సైబర్ మోసగాళ్లు పంపే లింక్స్ క్లిక్ చేసి మీ అకౌంట్ ఖాళీ చేసుకోవద్దు.
#TelanganaPolice#NewYearScams#cyberfraud
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రాష్ట్రవ్యాప్తంగా ప్రతి త్రైమాసికంలో ఉత్తమ పనితీరు కనబరిచిన సైబర్ వారియర్లను ప్రోత్సహిస్తూ ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది.
మూడో మరియు నాల్గో త్రైమాసికాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన సైబర్ వారియర్లు, TGCSB ప్రధాన కార్యాలయ సిబ్బంది మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని NCRP పిటిషన్ల పరిష్కారం, రిఫండ్ ఆదేశాల అమలు, సైబర్ అవగాహన కార్యక్రమాలు, PT వారంట్ల అమలు, సైబర్ నేరాల దర్యాప్తు, డేటా విశ్లేషణ మరియు 1930 కాల్ సెంటర్ సేవలలో చేసిన విశిష్ట కృషికి గాను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్, డీజీపీ, తెలంగాణ చేతుల మీదుగా సైబర్ వారియర్లకు గౌరవ పురస్కారాలు అందజేయగా, శిఖా గోయల్, ఐపీఎస్, డైరెక్టర్, TGCSB; హర్షవర్ధన్, ఐపీఎస్, ఎస్పీ (CS&A), TGCSB మరియు సాయి శ్రీ, ఎస్పీ (CC), TGCSB ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సైబర్ నేరాలపై పోరాటంలో ముందుండి పనిచేస్తున్న అధికారుల కృషిని గుర్తించడం, సాంకేతిక నైపుణ్యం, వేగం మరియు సమన్వయంతో కూడిన ఆధునిక పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడం ఈ సన్మాన కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.
#TGCSB #CyberWarriors
#TelanganaPolice
సోషల్ మీడియా స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. తెలియని వారి మాటలను నమ్మి పెట్టుబడులు అస్సలు పెట్టొద్దు. ఎవరినీ నమ్మి మీ ఫోటోలు, వీడియోలను పంపించొద్దు. తియ్యని మాటల వెనుక మోసం ఉండొచ్చు. ఆన్లైన్ స్నేహాలకు పరిమితులు విధించుకోవడం మంచిది.
#telanganapolice
VPN వాడే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. తెలియని, అపరిచిత వెబ్సైట్ల నుంచి VPN యాప్స్ డౌన్లోడ్ చేయొద్దు. మీ మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
#telanganapolice
Online impersonation and fake ID scams are rising fast.
Verify every profile, avoid sharing private details, and never send money to strangers.
Awareness is your best protection.
#FakeIDFraud#CyberAwareness#TelanganaPolice
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ కమిషనర్ S.M విజయ్ కుమార్ IPS గారి ఆదేశానుసారం , Addl.DCP (Admin) CH. కుషాల్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
*Today, a Cyber Awareness Program was conducted at Government Degree College, Siddipet, by ACP Srinivas Sir, Cyber Crime Police Station, Siddipet.* @TGCyberBureau@Shikhagoel_IPS