ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమకూరిన 303 కోట్ల రూపాయలను సద్వినియోగం చేసుకుంటూ చేపట్టనున్న నాలాలు, డ్రైనేజీల పునరుద్ధరణ ఎలా చేపట్టాలో ఈరోజు HMWS, కంటోన్మెంట్ బోర్డు అధికారులతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని, వారి సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసి భవిష్యత్తు తరాల కోసం నవ కంటోన్మెంట్ నిర్మాణం చేద్దామని అధికారులకు చెప్పడం జరిగింది.
#mlasriganesh #Cantonment #SriGanesh #PrajaPalana #SecunderabadCantonment
కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా బోర్డుకు సమకూరిన ₹303 కోట్లతో భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను కోరడం జరిగింది.
#mlasriganesh#PrajaPalana#SriGanesh #Cantonment #Boardmeeting #Secunderabad #Development
కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా బోర్డుకు సమకూరిన 303 కోట్లతో భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు లేకుండా నాలాలు, డ్రైనేజీల అభివృద్ధి, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను తొలగించి మహిళా భవన్ లు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు చెప్పాను
అలాగే మడ్ ఫోర్డ్ ప్రాంతంలో ఉన్న గుడిసెలను అధికారులు తొలగిస్తారని భయబ్రాంతులకు గురైన వారికి నేను అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
#mlasriganesh #PrajaPalana #SriGanesh #Cantonment #Boardmeeting
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక మరియు ఇంధన శాఖల మంత్రివర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకొని, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 💐
#HappyBirthdayBhattiVikramarka#SriGaneshMLA#SecunderabadCantonment #SriGanesh
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”కార్యక్రమం జరిగిన తీరు, సాధించిన ఫలితాలు, విభాగాల వారిగా నిర్వహించిన కార్యక్రమాల పై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించాను.
99 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంతో ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయగలిగాం. విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను అధికార యంత్రాంగాన్ని అడిగి తెలుసుకున్నాను. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికల్లో చురుగ్గా పాల్గొన్న శాఖాధిపతులు, వారి సిబ్బందిని అభినందించాను.
క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాను. వారి నుండి వెంటనే వివరణ కోరి, చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.
#PrajaPalana
#PragatiPranalika
#99DaysOfProgress
#PeopleCentricGovernance
#PrajaPrabhutvam
#TelanganaDevelopment
వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల 'బ్రేక్‌ఫాస్ట్ & మిల్క్' పథకాన్ని బొల్లారం సదర్ బజార్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించి, పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకోవడం జరిగింది.
#BreakfastScheme #StudentWelfare #PrajaPalana #EducationForAll #SriGanesh #mlasriganesh #secunderabadcantonment
వైద్య చికిత్స కోసం LOC అందజేత, ఈరోజు నా కార్యాలయంలో నిమ్స్ హాస్పిటల్ చికిత్స కోసం ప్రభుత్వం నుండి మంజూరైన ₹ 1 లక్ష రూపాయల LOCను అందజేశాను. బోయిన్పల్లి చిన్న తోకట కి చెందిన శరత్ కుమార్ కు ఈ సహాయం అందించడం జరిగింది.
#mlasriganesh#secunderabadcantonment#sriganesh#RevanthReddy #CMReliefFund
సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని గుప్తా ఎన్క్లేవ్, ఆశ్విన్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన Hira Fertility Center ను గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.
#mlasriganesh#secunderabadcantonment#SriGanesh#gaddamprasadkumar #HiraFertilityCenter
కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతిరోజూ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కొరకు కృషి చేయడం జరుగుతోంది. ప్రజలు అందజేస్తున్న వినతులపై తక్షణమే స్పందిస్తూ, అధికారుల సమన్వయంతో వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాను.
#mlasriganesh #Cantonment #SriGanesh #PublicService #Secunderabad
ఈరోజు క్లాసిక్ గార్డెన్లో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ యాదవ్ గారు, సికింద్రాబాద్ DCC అధ్యక్షులు శ్రీ దీపక్ జాన్ గారు, సీనియర్ నాయకురాలు శ్రీమతి కాల్వ సుజాత గారు మరియు శ్రీ కైలాష్ గార్లతో కలిసి బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLAs) దిశా నిర్దేశం చేశాము. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఏజెంట్లకు సూచించాము.
#Secunderabad #VoterRevision #SIR2026 #CongressParty #SriGanesh
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మన ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. 'మహిళా శక్తి పథకం' లో భాగంగా, మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సుల నిర్వహణను TGSRTC కి అప్పగించే అద్భుతమైన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు.
#PrajaPalana#MahilaShakti #SecunderabadCantonment #SriGaneshMLA #WomenEmpowerment #TGSRTC #RevanthReddy
కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతిరోజూ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కొరకు కృషి చేయడం జరుగుతోంది. ప్రజలు అందజేస్తున్న వినతులపై తక్షణమే స్పందిస్తూ, అధికారుల సమన్వయంతో వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాను.
#mlasriganesh #Cantonment #SriGanesh #PublicService #Secunderabad
ఏఓసీ సెంటర్ (AOC Center) పరిధిలో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి ఏకంగా ₹960 కోట్ల భారీ నిధులను మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే దిశగా అడుగులు పడటం అత్యంత సంతోషకరం!
@TelanganaCMO@revanth_anumula
#mlasriganesh #Cantonment #SriGanesh #AOC #Roadsdevelopment
సికింద్రాబాద్ హర్యానా భవన్లో జరిగిన “EKALAVYA PRATHIBHA AWARDS 2026” కార్యక్రమంలో పాల్గొని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 60 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు అందజేయడం చాలా సంతోషంగా ఉంది.
కష్టపడి చదివి ప్రతిభ చాటిన ఈ విద్యార్థులందరూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు!
#Education #StudentAwards2026 #MLASriGanesh #SriGanesh #Cantonment
బొల్లారం రిసాలా బజార్‌లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చీరలు అందజేయడం జరిగింది...
ఆడపడుచుల ఆనందమే మన ప్రభుత్వ లక్ష్యం. మహిళల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం మన ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది.
#mlasriganesh#Cantonment#SriGanesh #Saree #telanganacmrevanthreddy