మూసీ నదిని కాలుష్యం చేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్
ప్రతిరోజూ వేల లీటర్ల డెయిరీ వ్యర్థాన్ని రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి నదిలోకి వదుల్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ సంస్థ
శామీర్‌పేటలోని జగన్ గూడలో ఉన్న ప్లాంట్ నుంచి స్కిమ్డ్ వెయ్‌ను ట్యాంకర్లలో తరలించి నాగోల్ లోని శ్రీ సహదేవ్సంగ్ నగర్ కాలనీ వద్ద మూసీలో కలుపుతున్న సంస్థ
స్కిమ్డ్ వెయ్ అనేదాన్ని పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాలి కానీ.. ఈ హానికారక డెయిరీ వ్యర్థాన్ని దాదాపు 50 కిలోమీటర్లు ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి మూసీలో పారబోస్తున్న సంస్థ
ఒక్కో ట్యాంకర్లో 18 వేల లీటర్ల చొప్పున రోజుకు కనీసం మూడు ట్యాంకర్లలో అంటే 50 వేల లీటర్లకు పైగా స్కిమ్డ్ వెయ్‌ను తీసుకువచ్చి మూసీలో పారబోస్తున్న హెరిటేజ్ సిబ్బంది
అయితే ఆగ్రహం చెంది మూసీలో పొసి తిరిగి వస్తున్న ఓ ట్యాంకర్‌ను అడ్డుకుని నిలదీసిన స్థానికులు.. అంతలో పోలీసులు వచ్చి డ్రైవర్‌ను మందలించి అక్కడ నుండి పంపించేసిన పోలీసులు
దీంతో దీనిపై సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న స్థానికులు
మహాలక్ష్మి.. మాకేది ?
రామన్నపేట మండలంలో ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాలెన్నో
'పల్లె వెలుగు ' లు రాని ప్రాంతాలెన్నో
ఉచిత ప్రయాణానికి దూరమవుతున్న మహిళలు
రోడ్లున్నా పట్టి��చుకోని అధికారులు
తమ గ్రామాలకు బస్సులు నడపాలని వేడుకోలు
ఆటోలను ఆశ్రయిస్తున్న గ్రామస్తులు
@TGSRTCHQ @RMnlgtsrtc
వాహనం నడుపుతూ ఫోన్ వాడటం ప్రమాదకరం. డ్రైవింగ్ చేస్తూ రీల్స్ చూడటం, వీడియోలు తీయడం చాలా రిస్క్ అని గుర్తుంచుకోండి. మీ అజాగ్రత్తతో ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టొద్దు. మీ కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దు.
#telanganapolice#ArriveAlive
హెల్మెట్ మీ రక్షణ కవచం అని గుర్తుంచుకోండి. తలపై హెల్మెట్ ధరించడాన్ని బరువుగా కాకుండా..బాధ్యతగా భావించండి. ప్రమాదాల బారిన పడకుండా మిమ���మల్ని మీరు కాపాడుకోండి.
#telanganapolice #ArriveAlive
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు
60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి
అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించవద్దు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జన���్
నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.
ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీసీలో జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన, ఐఏఎస్, అదనపు సీపీ శ్రీ తప్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ శ్రీమతి శ్వేత, ఐపీఎస్ మరియు సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకుల�� చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు.
తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు.
ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ��ాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
#AdminPost
100 నెంబర్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు
108 నెంబర్‌కి 20 సార్లు ఫోన్ చేస్తే, లాస్ట్‌లో ఫోన్ ఎత్తారు.. అప్పటికే బస్సు అంతా కాలిపోయింది
మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంపై బాధితుల ఆవేదన
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూనే, ఒక పౌరుడిగా బాధ్యతలను విస్మరించకూడదు.
క్రమశిక్షణ, అంకితభావం కలిగిన పౌరులే దేశానికి అసలైన బలం. దేశాభివృద్ధిలో మనమందరం భాగస్వాములవుదాం
నా rapido కష్టాలు ..! 🥲
ఈరోజు కాస్త హెల్త్ బాగోలేక నా స్కూటీ ఇంట్లో పెట్టి , rapido book చేసుకున్నాను . నా కర్మకొద్దీ ఇతను వచ్చాడు , అతనికి హెల్మెట్ లేదు , care లేదు , rash driving, ఫోన్ మాట్లాడుతూ చూడండి ఎలా వెళ్తున్నాడో .. wrong Route లో వెళ్ళకండి , u turn చేస్కోండి అంటే క���పం తో ఇంకా speed గా వెళ్లాడు ... 😡😒
మీరు ఎప్పుడైనా ఇలాంటి rapido service ని Face చేసారా ?
@rapidobikeapp
@rapidobikeapp
#Radido
తీరా బిల్లు కోసం అడిగితే ఇల్లు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యే దిక్కు' అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతకు ముందే గోడకు తల బాదుకుని ఆత్మహత్యాయత్నానికి పాలుగారు.
ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రాలేదని పీట్ల రాజు అనే వ్యక్తి సూసైడ్ 'అధికారులు ఇల్లు మంజూరైందని చెప్తే పని ప్రారంభించా. ఓ విడత డబ్బులు జమయ్యాయి. అప్పు చేసి, భార్య నగలు తాకట్టు పెట్టి ఇల్లు కట్టా. తీరా బిల్లు కోసం అడిగితే ఇల్లు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు.
#TelanganaPolitics