ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు భారతరత్న పీవీ నరసింహారావు గారు.
గడ్డు కాలంలో దేశాన్ని భారీ సంక్షోభం నుండి గట్టెక్కించిన నరసింహారావు గారు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణం.
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది.. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ గారి పేరు పెట్టింది.. నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టడమే కాకుండా.. పీవీ గారి అజరామర కీర్తిని చాటిచెప్పే విధంగా వారి ఎత్తయిన విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 💐
(File Photo)
రేవంత్ రెడ్డికి హరీష్ అన్న సవాల్
దమ్ముంటే అసెంబ్లీ పెట్టు నీ సింగరేణి కుంభకోణం బయట పెడతా
సింగరేణి టెండర్ కూడా పూర్తి కాలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు
టెండర్ జరిగింది నిజం, ఆ టెండర్ శోధా సంస్థకు ఇచ్చింది నిజం, ఆ సంస్థ యజమాని నీ బావమరిది అనేది కూడా నిజం
ఎక్కడ చర్చలు చేద్దామో చెప్పు, నీ బండారం బయట పెడతా
@BRSHarish
25 సంవత్సరాల పాటు ఐపిఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్ధుల విద్యకు ఎన్నో సేవలందించిన @RSPraveenSwaero గారి భద్రత తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యే.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది.
ఇప్పటికే పలుమార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నాలు జరిగాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వెల్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉంది.
ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను మానుకుని, మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను.
ఊసరవెల్లి కూడా మంత్రి జూపల్లిని చూసి సిగ్గుపడుతుంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రెండున్నరేళ్లుగా పడావు పెట్టిన కాంగ్రెస్ వాళ్లా..
బీఆర్ఎస్ నాయకులను ప్రాజెక్టుల విషయంలో విమర్శించేది?
మరి ఆనాడు కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేసి, ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమే.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో జూపల్లిని మించిన వారు ఎవరూ లేరు.
- మాజీ ఎమ్మెల్యే @BeeramHarshaBRS
అసలు మెట్రో విషయంలో ఐఆర్ఎఫ్సీ ఒప్పందం రద్దయిందా లేదా?
మెట్రో ఆదాయం మొత్తం నిర్వహణ కోసమే వాడాలి, తర్వాతే అప్పులు కట్టాలి అని
మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వాళ్లు చెప్పారు కాబట్టి,
మాకు నిర్వహణ అవసరం లేదు, అప్పులే కట్టుకుంటాం అంటూ రేవంత్ రెడ్డి మోకాలడ్డు పెట్టాడు.
ఆర్థిక శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పర్మిషన్ లేకుండా..
ఐఆర్ఎఫ్సీకి రేవంత్ రెడ్డి సంతకం ఎలా పెట్టాడు?
- ఎమ్మెల్సీ @sravandasoju
రేవంత్ రెడ్డికి మాటలే ఎక్కువ… చేతలు తక్కువ.
తన దగ్గరే పెట్టుకున్న హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ - అన్ని శాఖల్లో ఫెయిల్.
ఢిల్లీకి సంచులు మోసి, కుర్చీ కాపాడుకోవడంలో మాత్రం సక్సెస్.
@BRSHarish
❇️ కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు సునామీ ఖాయం
❇️ ఎప్పుడు ఎన్నికలు జరిగిన అన్ని స్థానాల్లో కారు గుర్తుదే గెలుపు
❇️ కరీంనగర్ జిల్లా అనాదిగా బీఆర్ఎస్కి కోట
❇️ ఈరోజు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలోనే హైదరాబాద్ నివాసంలో ఉమ్మడి జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమావేశం
❇️ హాజరైన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. పార్టీ క్షేత్రస్థాయి బలోపేతంతో పాటు సమకాలీన రాజకీయాలపైన దిశానిర్దేశం
❇️ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎండగట్టేందుకు మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోవాలని సూచన 👇
🎯 కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపైన కదం తొక్కాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
🎯 ఈరోజు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి నివాసంలో జరిగిన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు పార్టీ కార్యక్రమాల పైన సమకాలీన రాజకీయ అంశాల పైన దిశానిర్దేశం చేశారు.
🎯 ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ మొదటి నుంచి భారత రాష్ట్ర సమితికి ఒక కోట మాదిరిగా అండగా నిలబడిందని కేటీఆర్ గుర్తు చేశారు.
🎯 దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు మోసాల వలన కొంత కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని కేటీఆర్ అన్నారు.
🎯 అయితే కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల విఫల పరిపాలన తర్వాత తిరిగి ప్రజలంతా భారత రాష్ట్ర సమితి వైపు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ గారి వైపు చూస్తున్నారన్నారు.
🎯 పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతుందని కేటీఆర్ అన్నారు.
🎯 ఈరోజు జరిగిన సమావేశంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యే నుంచి నియోజకవర్గాల వారిగా పార్టీ తాలూకు క్షేత్రస్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
🎯 వీటితోపాటు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పైన జరుగుతున్న కార్యక్రమాలను వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
🎯 ఇక పార్టీ బలోపేతానికి సంబంధించి కెటిఆర్ పలు అంశాల పైన దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లాలో అత్యంత కీలకమైన సింగరేణిపైన అటు బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను, అవినీతిని ఎక్కడికక్కడ ప్రజల ముందుకు, సింగరేణి కార్మికుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.
🎯 కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న అరాచకాలను, అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని సూచించారు.
🎯 ఇక పార్టీ నిర్మాణానికి సంబంధించి బూత్‌ల వారీగా ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలన్నారు.
🎯 కేవలం గ్రామస్థాయి పార్టీ కార్యాచరణ కాకుండా బూత్‌ల వారీగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు.
🎯 అధికారం ఉన్నా లేకున్నా మన వెంట నాయకుల వెంట నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలని కార్యకర్తలతోనే పార్టీ బలంగా నిలబడింది అన్న విషయాన్ని గ్రహించి ముందుకు పోవాలని సూచించారు.
🎯 ఇందుకోసం పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా బూత్‌ల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని కోరారు.
🎯 ఇక కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజలకి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
🎯 కరువు వచ్చినప్పుడే కాలేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుందని మనం గతంలో చెప్పిన విషయం ముమ్మాటికి నిజమవుతున్నదని ఇప్పటికే దాదాపు రెండు వారాలు దాటిపోయినా వర్షాలు పడని ఈ పరిస్థితిలోనూ పుష్కలంగా నీరు కాళేశ్వరంలో ప్రాజెక్టులో పారుతున్నదని కేటీఆర్ అన్నారు.
🎯 అయినా అక్కడి నుంచి పదివేల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎత్తిపోసి రైతన్నల నారుమడులకు అందించాలన్న కనీస సోయి కూడా లేకపోవడం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు అద్దం పడుతుందన్నారు.
🎯 ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు అందిన కాడికి దోచుకుంటున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలన్నారు.
🎯 ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు స్థానికంగా చేస్తున్న అరాచకాలు, అవినీతిని గమనిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
🎯 పార్టీ నేతలంతా మారుతున్న ప్రస్తుత కాలానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల శక్తిని అర్థం చేసుకొని, వాటి ద్వారా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం కూడా చేయాలని సూచించారు.
🎯 ఇందుకోసం సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ రోజు గోదావరిఖని పట్టణంలోని రాజీవ్ నగర్, అడ్డగుంటపల్లి లక్ష్మీ శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ లో సానగొండ లక్ష్మి రాజు గార్ల ఏకైక పుత్రిక డాక్టర్ సుష్మ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వ్యాల్ల హరీష్ రెడ్డి( బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు )..
నేను సాఫ్ట్వేర్ మాత్రమే కాదు.. హార్డ్‌వేర్ కూడా!
ఎప్పుడు మాట్లాడాలో.. ఎప్పుడు గేర్ మార్చాలో కూడా నాకు తెలుసు.
నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు..
బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కాంగ్రెసోళ్లు ఎక్కడికి పారిపోయినా..
సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే ఎవరినీ వదిలిపెట్టను.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంటే.. ఖమ్మం మంత్రుల ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది.
వెలుగుమట్లలో వేలాది మంది పేదల ఇండ్లను నేలమట్టం చేశారు.
పొంగులేటి, తుమ్మల రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డం వస్తుందని, పేదల ఇండ్లు కూల్చి, వారిని రోడ్డు పాలు చేశారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కేసీఆర్ గారు అశ్వారావుపేటకు గోదావరి జలాలను తీసుకురావాలని తపన పడ్డారు.
కానీ కాంగ్రెస్ వచ్చాక దోపిడీ రాజ్యం నడుస్తోంది,
దండుపాళ్యం ముఠా ఆదాయం పెరగడం తప్ప జరిగిందేమీ లేదు.
గోదావరి జలాలు అశ్వారావుపేటకు మళ్లీ రావాలంటే.. కేసీఆర్ గారు సీఎం అవ్వాల్సిందే.
అందుకే మొట్టమొదట గులాబీ జెండా ఎగరాల్సింది అశ్వారావుపేటలోనే!
- మాజీ మంత్రి @puvvada_ajay
The difference is clear guys - First time MLAs Track Record ante BRS di eyy
మొదటిసారి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు :
గాదరి కిషోర్ (తుంగతుర్తి) – ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-II ద్వారా సాగునీటిని అందించి వేలాది ఎకరాల రైతు భూములకు శాశ్వత నీటి భద్రత కల్పించారు.
కల్వకుంట్ల సంజయ్ కుమార్ (కోరుట్ల) – ఉచిత సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర స్థాయిలో ఉద్యమించి మహిళల ఆరోగ్య రక్షణకు మార్గం సుగమం చేశారు.
బాల్క సుమన్ (చెన్నూర్) – దశాబ్దాల నాటి ప్రజల డిమాండ్‌ను నెరవేర్చి చెన్నూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయించారు.
పాడి కౌశిక్ రెడ్డి (హుజూరాబాద్) – 500 ఎకరాల డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ప్రజా ఉద్యమంతో అడ్డుకుని రైతుల భూములను కాపాడారు.
జాధవ్ అనిల్ కుమార్ (బోథ్) – బుద్దికొండ–తేజాపూర్ ప్రాంతాలకు కీలక బీటీ రోడ్లకు నిధులు సాధించి గ్రామీణ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచారు.
మొదటిసారి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు:
మామిడాల యశశ్వినీ రెడ్డి - రీల్స్ స్టార్
కుందూరు జయవీర్ రెడ్డి - రీల్స్ స్టార్
మైనంపల్లి రోహిత్ - రీల్స్ స్టార్
చిట్టెం పర్ణికారెడ్డి - రీల్స్ స్టార్
*ఇసుక మాఫియా అక్రమాలకు బలైన నిండు ప్రాణం*
అంబులెన్స్‌కు సైతం దారి ఇవ్వకుండా రహదారిపై అడ్డంగా నిలిపిన లారీలు
భుజంపై రోగిని మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు మండలం సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు రహదారిపై అడ్డంగా నిలిపిన ఇసుక లారీలు
అదే మార్గంలో మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామంలో పురుగుల మందు తాగిన వంశీ(35) అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా, కనీసం అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని ఇసుక లారీలు
భుజంపై మోసుకుని వెళ్ళే సరికి ప్రాణాలు కోల్పోయిన వంశీ
ఇసుక లారీలు రోడ్డును బ్లాక్ చేయడంతోనే వంశీ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు