రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం.
ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారు.
రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరం.
ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ���రద్ధ, పట���టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదు.
పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజల సమస్యల���ు జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.?
ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలన.?
కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్నిప్రశ్నించలేని పరిస్థితి. ఇలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తాం.
#CongressFailedTelangana
మా కరువులకు కన్నీళ్ల కు
శాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!
తెలంగాణ తెర్లై పోతే సంకలు
గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు
ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన
మా వరప్రదాయిని కాళేశ్వరం!
తలాపున గోదారి గలగల పారుతున్న
తనువంతా ఎడారై ఎండిన శాపానికి
విమోచనం కాళేశ్వరం!
సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న
మా చేను చెలకలు నదీ జలాలతో
తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం..!
దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన
గోదారి జలాల ��ాధన
పోరాటాలకు సమాధానం కాళేశ్వరం!
శిథిల శివాలయంగా పాడుబడిపోయిన
శ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవమిచ్చిన
పుణ్య వరం కాళేశ్వరం!
నీళ్లు రాక..ఒట్టిపోయిన నిజాంసాగర్ కు
నిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం!
మండుటెండల్లో చెరువులను మత్తళ్లు
దూకించిన మహత్యం కాళేశ్వరం!
మా తపనకు..ఆలోచనకు ..అన్వేషణకు
జలదౌత్యానికి... నిదర్శనం కాళేశ్వరం..!
కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదని
తెలియని మీ అజ్ఞానం!
ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం
సరిదిద్దుకోగలం...!
రాజకీయ కుళ్ళు కుతంత్రాలను
దిష్టి చూపులను తట్టుకోగలం..!
మీ ఏడుపే మా ఎదుగుదల..!
#KaleshwaramProject
Telangana state In Domalapally village of Nallagonda district, when the paddy was being dried at the IKP center, due to untimely rain, the students of the nearby government school came together and congratulated the students of the farmers by covering the rice paddies with rails.