తిరుపతి, విశాఖ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
• ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో నిర్వహణ
• పరిశుభ్రమైన జూ పరిసరాలు – ఆరోగ్యవంతమైన వన్యప్రాణులు లక్ష్యం
• జూలలో జంతువుల దత్తతకు ముందుకు రావాలని శ్రీ @PawanKalyan గారి పిలుపు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం జూ అధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూ ప్రాంగణాలను మరింత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడం, జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచనలు చేశారు.
కార్యక్రమంలో భాగంగా జంతువుల ఆవాస ప్రాంతాలు, సందర్శకుల మార్గాలు, ఉద్యానవనాలు, నీటి వనరులు, విశ్రాంతి ప్రాంతాలు, ఆహార పంపిణీ కేంద్రాలు, వ్యర్థాల సేకరణ ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు. జూ పరిసరాల్లో వ్యర్థాల వర్గీకరణ, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పచ్చదనం సంరక్షణ, పారిశుధ్య ప్రమాణాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలు మాత్రమే కాకుండా, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్ర బిందువులుగా నిలవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. క్రమం తప్పకుండా జూల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
విశాఖ జూలో అధునాతన ఇంక్యూబేషన్ పద్ధతిలో ఇటీవల 128 కొత్త జీవాలకు జన్మనిచ్చిన నేపథ్యంలో జీవ వైవిధ్య పరిరక్షణ చర్యలకు మద్దతుగా విశాఖతోపాటు తిరుపతి జూల్లో జంతువులను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వన్యప్రాణుల సంరక్షణను ప్రతి పౌరుడు బాధ్యతగా స్వీకరించాలని కోరారు.
– ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం
అపర చాణక్య టీమ్ సర్వే 💥
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల నమ్మకం ఎలా ఉందో తెలుసుకునేందుకు మా 'అపర చాణక్య టీమ్' నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి సర్వే వివరాలను ఇక్కడ వెల్లడిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్లో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుందనే దానిపై ప్రస్తుతం ప్రజల్లో మరియు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికలలో లభించిన భారీ ప్రజా తీర్పు తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలన, అలాగే విపక్షాల వ్యూహాల ఆధారంగా ప్రజల స్పందన ప్రధానంగా మూడు కోణాల్లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుత నాయకుల పనితీరుపై ప్రజా స్పందన మరియు భవిష్యత్తు అంచనాల విశ్లేషణ కింద ఇవ్వబడింది:
ఎవరికి ఎంత శాతం మద్దతు?
🔴 జనసేన - పవన్ కళ్యాణ్: 39%
🟡 టీడీపీ - నారా చంద్రబాబు నాయుడు: 29%
🔵 వైసీపీ - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: 28%
🟠 బీజేపీ - రామ్ మాధవ్: 3%
🟢 కాంగ్రెస్ - వైఎస్ షర్మిల: 1%
సర్వే కాలం: ఆగస్టు 15 నుండి ఆగస్టు 25, 2024 వరకు
శాంపిల్ సైజ్: ఏపీ వ్యాప్తంగా 12,850+ మంది ఓటర్ల అభిప్రాయాల సేకరణ
విధానం: స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్, డేటా అనలిటిక్స్ మరియు ఒపీనియన్ ట్రాకింగ్ టూల్స్ కలయికతో ఈ ఫలితాలను విశ్లేషించాం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో ఈ ఫలితాలు రాజకీయ నాయకుల పనితీరుకు నిలువుటద్దం కానున్నాయి.
#APPolitics #AndhraPradesh #PawanKalyan #ChandrababuNaidu #YSJagan #RamMadhav #YSSharmila #ChanakyaSurvey #APNextCM
Theatre owners cults ki bayapadi theatres ivamani chepthe...
Kurnool cults 1L security deposit chesi fan show plan chesaru🙏🏻🔥
Kontha mandhi laga matal thengala ..
#Panja4K
పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
2,400 మంది వితంతు మహిళలకు రాఖీ పండుగ కానుకగా చీరలు పంపించారు. రాఖీ కానుకతో ఆనందం వ్యక్తం చేసిన పిఠాపురం ఆడపడుచులు
@PawanKalyan@APDeputyCMO