My Heartfelt Birthday wishes to the Hon’ble Prime Minister Shri @narendramodi Ji.
Wishing you good health, happiness and strength always sir.
Your leadership and vision for a Viksit Bharat continue to inspire millions across the country.
Moved by your tireless hardwork and selfless service to the nation, I'm joining the Seva Sankalp Abhiyan.
As my contribution to this initiative, I pledge to provide skill development to 1000 women in the coming months.
అందరికి నమస్కారం
నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతని తిరుపతి పార్లమెంట్లో జరుగుతున్న లోకల్ బాడీ ఎలక్షన్ లో మరియు తిరుపతి మేయర్ ఎలక్షన్స్ నన్ను నియమించినందుకు మా అధినేత మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలుపార్టీ నామీద ఉంచిన నమ్మకాన్ని 100% రాబోయే ఎన్నికల్లో జనసేన బలం జనసేన సత్తా చూపుతానని చెప్పి కూడా @PawanKalyan గారికి పార్టీ అగ్రనేతలందరూ కూడా మనస్పూర్తిగా ప్రమాణం చేస్తున్నాను...కిరణ్ రాయల్
అన్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
హరితాంధ్ర సారథికి జన్మదిన శుభాకాంక్షలు !!
అటవీ, పర్యావరణ పరిరక్షణలో వినూత్న ఆలోచనలకు కార్యరూపమిస్తూ, 2047 నాటికి 50% గ్రీన్ కవర్ లక్ష్యంతో హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి దార్శనిక నాయకత్వం అందిస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
మీ నాయకత్వంలో ప్రకృతి–ప్రగతి సమతుల్యతతో మరింత పచ్చని, సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నాం.
#HappyBirthdayPawanKalyan
#PawanKalyan #APForestDepartment
As part of Sena Prasthan –For the National Integrity ( Sena Prasthanam - Desha Samagratha Kosam) ,
I stood at the National War Memorial with profound humility and reverence, paying tribute to the brave men and women of our Armed Forces who made the ultimate sacrifice in service of Bharat.
Every name etched there reflected extraordinary courage, selfless devotion, and unwavering commitment to the nation. Their sacrifice has safeguarded our freedom, protected our sovereignty, and strengthened the unity and integrity of India.
Standing before that sacred memorial, I was reminded that the strength of Bharat lies not only in its achievements, but also in the valor of those who placed the nation above self and duty above all else.
With deep gratitude, I bowed to our fallen heroes and drew inspiration from their legacy. May their courage continue to guide us, their sacrifice continue to unite us, and their spirit continue to strengthen our resolve to build a strong, secure, and united Bharat.
Jai Hind.
@PMOIndia@HMOIndia@DefenceMinIndia@salute2soldier
@JSPShatagniTeam@PawanKalyan డీకే బాలాజీ గారి ఆదేశాల మేరకు జిల్లా ట్రైని సబ్ కలెక్టర్ గారు స్వయంగా మాజేరు సొసైటీ సందర్శించి వెళ్లారు. అయినా వైసీపీ, సాక్షి వాళ్ళు విష ప్రచారం చేసి ఆనందించారు.
వైసీపీ, సాక్షి దినపత్రిక ఫేక్ ప్రచారం మరోసారి ఆధారాలతో బయట పడింది. చల్లపల్లి మండలం కొత్తమాజేరు సొసైటీ దగ్గర యూరియా కోసం వచ్చిన రైతు వేముల నాగేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోయినట్లు ఈరోజు సాక్షి దినపత్రిక మెయిన్ పేజీల్లో వార్త రాశారు. తీరా చూస్తే సొసైటీ ఎదురుగా గ్రామ సచివాలయం అరుగు మీద
@JSPShatagniTeam@PawanKalyan మీద కూర్చొని ఉన్న సదరు రైతును కొందరు "ఒక్కసారి పడుకో ఫోటో తీసి మీడియాకు పంపాలి" అని నడిచి వెళుతున్న రైతును ఆపి ఫోటో తీసి సాక్షి దినపత్రిక వారికి పంపి తద్వారా యూరియా సరఫరాపై విష ప్రచారం చేయించారు. వాస్తవానికి మాజేరు సొసైటీలో యూరియా విక్రయాలు సజావుగా జరిగాయి. కృష్ణాజిల్లా కలెక్టర్
My dear brother @PawanKalyan
జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష
జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.
ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో
నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు ! 💐
మీ నాన్నని అడ్డు పెట్టుకుని నువ్వు నాయకుడిగా ఎదిగావ్ @ysjagan..
మా నాయకుడు @PawanKalyan గారు స్వశక్తితో నాయకుడు అయ్యాడు..
- జనసేన నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు.
#JanaSenaJayaKethanam
ఏడుకొండలవాడా..! క్షమించు
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.
లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను.
22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను.
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది.
వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.
ధర్మో రక్షతి రక్షితః