Minister for Law & Justice & Minority Welfare,Andhra Pradesh,MLA Nandyal constituency,Telugu Desham Party Ex Polit Beuro Member,Ex MLC, Ex.Chairman-APLC
ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను.
రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సంక్షేమమే @JaiTDP మరియు కూటమి ప్రభుత్వ లక్ష్యం.
#AndhraPradesh#CabinetMeeting
రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కీలక నిర్ణయాలు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై క్యాబినెట్లో చర్చించాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేస్తున్నాం.
#ChandrababuNaidu #CabinetMeeting #AndhraPradesh
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రాప్తాడు చేరుకున్న నాకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు, ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రాప్తాడు సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నాను. వారి నుంచి అర్జీలు స్వీకరించాను.
అనంతపురం జిల్లా రాప్తాడు కూడలిలో ఏర్పాటుచేసిన స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి విగ్రహాలను ఆవిష్కరించాను. ముందుగా భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించాను. మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం..జగన్ రెడ్డి సిద్ధమా అని సవాల్ చేశాను. నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకు పోరాడిన వ్యక్తి పరిటాల రవి గారు. పాదయాత్రలో నాతో నడిచిన వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94శాతం కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రాప్తాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించాను. శాప్ కార్యాలయం వద్ద విద్య నేర్పే గురువులపై గొడ్డలిపార్టీ రౌడీమూకలు విచక్షణారహితంగా గుడ్లతో దాడిచేశారు. ఈ దాడిలో పాల్గొన్న రౌడీ బ్యాచ్ లో ఏ ఒక్కరినీ వదలిపెట్టం. జగన్ రెడ్డి గారు టెన్త్ క్లాస్ తప్పారు. అందువల్లే టీచర్లపై కక్ష పెంచుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే మేం భయపడలేదు, ఇప్పుడు భయపడతామా? నీతి, నిజాయితీగా బతికిన కుటుంబం మాది అని చెప్పాను.
ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. పరిష్కారమే లక్ష్యం.
మంగళగిరిలోని @JaiTDP పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను ఓర్పుగా విన్నాను. ప్రతి అర్జీపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించాను.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా స్పందిస్తాను. #GrievanceDay #Mangalagiri #TDP
#AndhraPradesh
జూనియర్ డాక్టర్ల సమస్యకు పరిష్కారం.. స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు.
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను నా దృష్టికి తీసుకురాగా, వారి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, మంత్రి శ్రీ @naralokesh గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చర్చించాను. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపుపై https://t.co/jKP8qEc9pk.141 ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం.
వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమస్యను నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి పరిష్కారానికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రులకు జూనియర్ డాక్టర్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#Nandyal #AndhraPradesh
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. ఉమ్మడి ఏపీలో మహిళా కబడ్డీలో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొదటి అమ్మాయిని. ఏషియన్ మహిళా కబడ్డీలో గోల్డ్ మెడలిస్ట్ ని.. అలాంటి నన్ను ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం.
- శ్వేత
#SportsTeachersFightFakes
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#AndhraPradesh
కుల మతాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా టీమ్ స్పిరిట్ తో కలిసికట్టుగా రాష్ట్రం, దేశం కోసం ఆడేదే స్పోర్ట్స్. క్రీడల వల్లనే మనందరం ఒక్కటవుతుంటాం. మెడల్ సాధిస్తే ప్రౌడ్ గా ఫీలవుతాం. అలాంటి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై రాజకీయం చేయడం, బురదచల్లడం, చిన్నచూపు చూడడం దారుణం. వైసీపీ దుష్ప్రచారం వల్ల క్రీడా కోటాలో ఉద్యోగం వచ్చిందని గర్వంగా చెప్పుకోలేకపోతున్నాం. ఈ దుష్ప్రచారాన్ని క్రీడాకారులంతా కలిసికట్టుగా తిప్పికొట్టాలి.
#SportsTeachersFightFakes
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#AndhraPradesh
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమే. నేను ఎనిమిదేళ్లు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశా. పోస్టల్ శాఖలోనూ ఉద్యోగం వచ్చింది. టీచర్ అవ్వాలనేది ప్యాషన్. నాకు గత ప్రభుత్వంలోనూ ఉద్యోగం వచ్చింది. మరి వాళ్ళనూ ఫేక్ అంటారా. నేను జెన్యూన్ గా ఆడి జెన్యూన్ గా ఉద్యోగం సాధించుకున్నా.
#SportsTeachersFightFakes
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#AndhraPradesh
కేంద్ర ప్రభుత్వమే నా క్రీడా ప్రతిభను గుర్తించి రైల్వేలో, ఇన్ కం టాక్స్ లో ఉద్యోగం ఇచ్చింది జగన్. నన్నే ఫేక్ అంటావా..? ఎందుకు నీకీ వక్రబుద్ధి. మమ్మల్ని అవమానిస్తే తగిన గుణపాఠం చెబుతాం.
- శివనాగిరెడ్డి
#SportsTeachersFightFakes#DSCFakesByYCP#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#PaidFakeNews
#AndhraPradesh
#SportsTeachersFightFakes
.@ysjagan నీలాగా దొంగ మాటలు మాట్లాడడం మాకు రాదు. మాకు తెలిసిందల్లా ఆటలే. క్రీడలను రాజకీయాల్లోకి లాగుతావెందుకు..? పెద అప్పలరాజు అంటే శ్రీకాకుళంలో తెలియనివారు లేరు. అలాంటి నాపైనే దుష్ప్రచారం చేస్తున్న ఈ గొడ్డలి బ్యాచ్ మిగిలిన వాళ్లపై ఇంకెంత దుష్ప్రచారం చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి.
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#AndhraPradesh
జగన్ చూడవయ్యా చూడు నా టెట్ సర్టిఫికెట్. నీ నెంబర్ చెబితే వాట్సాప్ చేస్తా. నువ్వెవడయ్యా మా మీద దుష్ప్రచారం చేయడానికి. మా పరువు తీసే హక్కు నీకెవరిచ్చారు. చెల్లిని, తల్లిని గెంటేసిన నీకేం తెలుసు మా తల్లిదండ్రులు ఎంత బాధపడతారో.
#SportsTeachersFightFakes#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#PaidFakeNews
#AndhraPradesh
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవినేని రమణ గారి జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరిస్తూ, నివాళులు అర్పిస్తున్నాను. నిబద్ధతతో కూడిన రాజకీయాలకు చిరునామా రమణ గారు. నిస్వార్ధంగా పనిచేసి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిన దేవినేని రమణగారు ధన్యజీవి.
రైతుల పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు.
నంద్యాల క్యాంపు కార్యాలయంలో గోస్పాడు మండలం యాలూరు గ్రామానికి చెందిన రైతులు కలిసి, కేసీ కెనాల్ ఆయకట్టుకు అక్టోబర్ నెలాఖరు వరకు సాగునీరు కొనసాగించాలని వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సాగులో ఉన్న మినుము, జొన్న తదితర పంటలకు మరో రెండు తడుల నీరు అవసరమని వారు వివరించారు.
రైతుల సమస్యలను సావధానంగా విని, నీటి లభ్యత, ఎలినో ప్రభావంతో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాను. రైతుల పంటలకు అవసరమైన సాగునీరు అందించేందుకు కృషి చేస్తాను.
#Nandyal #AndhraPradesh
కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో విద్యార్థులు త్యాగధనులైన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అబ్దుల్ కలామ్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, తరిగొండ వెంగమాంబ, డొక్కా సీతమ్మ, సచిన్ టెండూల్కర్ పాత్రలతో దేశభక్తిపై ఇచ్చిన సందేశాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించాను.