Glad to participate in the Telangana Formation Day Celebrations 2026 organized by the Malaysia Telangana Association and BRS Malaysia.
It was wonderful to witness the energy and enthusiasm of the NRIs in Kuala Lumpur, whose presence made the event a grand success.
My heartfelt thanks to all the organizers and attendees for coming together to celebrate the spirit and culture of Telangana in Malaysia.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.. అనంతరం జాతీయ జెండా ఎగురవేసిన కేటీఆర్ గారు
#TelanganaFormationDay
తెలంగాణ భవన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 🎉
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు.
అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పలువురు తెలంగాణ కళాకారులకు సన్మానం చేసి, కేసీఆర్ గారిపై, తెలంగాణపై రూపొందించిన పలు పాటలను ఆవిష్కరించిన కేటీఆర్.
#TelanganaFormationDay
సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని
అనుకుంటే దేశానికి వచ్చేదా స్వతంత్రం?
రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది
ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది.
ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి
✍️నాడు కేసీఆర్ గారు రాసిన పాటను గుర్తు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
#TelanganaFormationDay
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు ✨
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
తెలంగాణ ప్రజల మీద దశాబ్దాల పాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.
ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురై, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామని, పరిపాలన చేతగాదు అని విమర్శించిన నోళ్లు మూతపడేలా ప్రగతి పాలనను అందించామని కేసీఆర్ అన్నారు.
నూతన రాష్ట్రంగా ఏర్పాటైన పదేండ్ల అనతికాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని వివరించారు.
సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను, నేడు కోటి ఎకరాల మాగాణంగా మార్చి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత నాటి పదేండ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కేసీఆర్ తెలిపారు.
ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు. ప్రతీప శక్తుల నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ కు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
స్వరాష్ట్ర సాధనలోనూ, ఆ తర్వాతి పదేండ్ల పునర్నిర్మాణంలోనూ చూపిన స్పూర్థిని నిరంతరం కొనసాగించాలనీ, అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మరింత గుణాత్మకంగా పెరిగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకోవాలనీ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ, వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణ రైతన్న సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించకూడదని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని, పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆకాంక్షించారు.
రైతాంగం, శ్రమజీవులు, సబ్బండ వర్గాలు,సకల జనుల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కేసీఆర్ ఈ సందర్భంగా కోరుకున్నారు.
#TelanganaFormationDay
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
25 years with @BRSparty
25 years of Service, unwavering passion & commitment
25 years of respect, love and admiration to One & Only Shri. KCR Garu
25 years of inspiration to many across the globe
Congratulations @Anil_trs for 25 years of relentless service & steadfast commitment
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీతో 25 సంవత్సరాల
నిర్విరామ ప్రయాణం పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్న
నికాసైన తెలంగాణ ముద్దు బిడ్డ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు
"లండన్ కెసిఆర్" అనిల్ కూర్మాచలం అన్నకు శుభాకాంక్షలు
May 17th 2001 - May 17th 2026
@Anil_trs@KTRBRS@BRSHarish@BRSparty
#May17th2001#TRS#BRS#SimhaGarjana#25years
మే 17 2001
(బీ.ఆర్.యస్) టీ.ఆర్.యస్ పార్టీ తో కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ (SRR College) నుండి ప్రారంభమైన నా ప్రయాణం ....నేటికీ 25 సంవత్సరాలు పూర్తి ✊️🙏
అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన కెసిఆర్ గారికి, ప్రోత్సహించిన నాయకులందరికీ నా కృతజ్ఞతలు.
జై కెసిఆర్
జై జై కెసిఆర్
#ThankYouKCRSir 🙏🙏
ఇదేనా బీజేపీ సిద్ధాంతం ???
మీ ఇంటి మైనర్ అమ్మాయి పై అత్యాచారం చేస్తాం !
నిలదీసి, ప్రశ్నించి, ఎదిరిస్తే...
"జై శ్రీరామ్" అని తప్పించుకుంటాం !
ఇదేనా "బండి సంజయ్" హిందుత్వమంటే ??
@KTRBRS@bandisanjay_bjp@BJP4Telangana@BRSparty@BRSHarish
#BandiSanjay#POCSO#ArrestBandiSanjaySon#ArrestBandiBhagheerath#NRIBRSUK#DemandArrest#London
బీజేపీ ఎంపీ,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుని వెంటనే అరెస్ట్ చెయ్యాలి
- అమరేశ్వరి, ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకురాలు
లండన్ : ఓ బాలిక పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ లైంగిక దాడి యత్నం చేయడమే కాకుండా, ఇటీవల బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు తెలియజేసిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలాగా ఉన్నాయని, సభ్య సమాజం తల దించుకొనేలా ఉన్నాయని, చాలా బాధ కలిగిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకురాలు అమరేశ్వరి తెలిపారు.
ఈ ఘటనలో బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదయినప్పటికీ, అరెస్ట్ చెయ్యకపోవడం అత్యంత దారుణమని, వెంటనే అరెస్ట్ చెయ్యాలని ఎన్నారైల పక్షాన అమరేశ్వరి డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు మీడియా ద్వారా అందిన సమాచారం మేరకు, బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని బెదిరించాడని, అలాగే పోలీసులు కూడా తమ విధులని సక్రమంగా నిర్వహించలేదనేది స్పష్టం అవుతుందని, కాబట్టి నిష్పక్షపాత విచారణ జరిపి బండి సంజయ్ తో పాటు పోలీసుల పై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందని, కాబట్టి కోర్టులు దీన్ని సూమోటాగా స్వీకరించి బాధిత కుటుంబానికి, ముఖ్యంగా మైనర్ బాలికకు న్యాయం జరిగేలా అన్ని వ్యవస్థలు, పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, మీడియా సంస్థలు సంఘటితంగా కృషి చెయ్యాలని, ఇలాంటి పరిస్థితి రేపు ఎవరికీ రాకుండా చూసుకోవాలని, ఒక మహిళగా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుందని,అమరేశ్వరి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ కి కొనసాగే అర్హత లేదని , ప్రధాన మంత్రి మోదీ గారు వెంటనే చర్యలు తీసుకొని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేసారు .
ఇంకా ప్రభుత్వం బండి సంజయ్ కి కొమ్ము కాస్తూ కాపాడాలనే ప్రయత్నం చేస్తే పోరాటం ఉదృతం చేస్తామని, ఎన్నారై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కూర్మాచలం, నవీన్ రెడ్డి, అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, మహిళా కమీషన్లకు, ఇతర బాధ్యతగా సంఘాలకు లేఖలు రాస్తామని అమరేశ్వరి హెచ్చరించారు.