I was shocked & just stood there speechless after witnessing his dedication towards cinema & his love for his fans ❤️🔥🥹
Antha pain lo unna kuda, movie anukunna time ki release avvali ani nonstop ga shoot chesthunnaru…
Always proud to be a fan of NBK ♥️
Jai Balayya✊
#Dada
మూడు దశాబ్దాల ప్రజల కలను సాకారం చేస్తూ 'పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్' తొలి దశ అందుబాటులోకి రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం. NDA కూటమి ప్రభుత్వ సారథ్యంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి ప్రత్యేక శ్రద్ధతో కేవలం 48 రోజుల్లోనే 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. రూ.10,200 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ మహత్తర ప్రాజెక్టులో తొలి దశ ద్వారా నల్లమల సాగర��కు 10.70 టీఎంసీల నీటిని తరలించి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించబోతుండటం ఎంతో సంతోషకరం.
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి ఆశయాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన 'విబి జీరామ్జీ' (VB-G RAM G) ఉపాధి పథకం అమలులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. గత ఏడాది జులై నెలతో పోలిస్తే ఈ ఏడాది జులై నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కల్పనలో 49.1% క్షీణత నమోదైతే.. మన రాష్ట్రంలో మాత్రం ఏకంగా 52.2% గణనీయమైన వృద్ధి నమోదైంది. NDA కూటమి ప్���భుత్వం పేదల సంక్షేమానికి, గ్రామీణ శ్రామికుల భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ గణాంకాలే నిదర్శనం.
రైతు సంక్షేమమే లక్ష్యంగా.. సుస్థిర వ్యవసాయానికి సరికొత్త ప్రోత్సాహాన్ని అందిస్తూ, ప్రధాని శ్రీ @narendramodi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం - ఎండాడలో రూ. 3.02 కోట్ల వ్యయంతో 'బయో-ఫెర్టిలైజర్ ల్యాబ్' ఏర్పాటు చేయబోతోంది. ఈ ల్యాబ్ ద్వారా నాణ్యమైన జీవ ఎరువులు స్థానికంగానే అందుబాటులోకి వచ్చి, ఖరీదైన రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గడం ద్వారా సాగు ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు నేల సారం మెరుగుపడుతుంది. అంతేకాకుండా, ప్రత్యేక శిక్షణ మరియు ప్రదర్శనల ద్వారా మన రైతన్నలను ఆధునిక, పర్యావరణ అనుకూల సాగు పద్ధతుల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది.
ఈరోజు విజయవాడ పశ్చిమ ��ియోజకవర్గంలోని హెచ్బీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. పోలియో మహమ్మారి రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఈ రక్షణ కవచాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఐదేళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు భరోసానిస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
విజయవాడ పశ్చిమ నియోజక��ర్గ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకల్లో పాల్గొనడం సంతోషం కలిగించింది. నన్ను 47 వేల ఓట్లతో గెలిపించిన పశ్చిమ నియోజకవర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 'అభివృద్ధి ప్రయోగశాల' గా మారుస్తున్నాను. తాగునీటి పైప్లైన్లు, ప్రజల ఆరోగ్యం కోసం మొబైల్ మెడికల్ బస్సులు, ముందస్తు ఆరోగ్య పరీక్షలు, రూ.27 కోట్లతో లేబర్ కాలనీ ఇండోర్ స్టేడియం పనులు చేపట్టాం. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను, వ్యాపా�� వర్గాల నుండి దందాలను అరికట్టాం. ఇంకా ప్రజలకు చేయాల్సిన సేవ చేయాల్సింది కొండంత ఉందని, భవిష్యత్తులోనూ ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యంగా, కూటమి ఏకగ్రీవంగా గెలిచేలా అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చాను.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నదాతల ఆదాయాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. దేశంలోని ప్రతీ రైతన్నకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే లక్ష���యంతో ప్రారంభించిన 'పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి' లో భాగంగా, నేడు 23వ విడత కింద 9.44 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లకు పైగా నిధులను నేరుగా బదిలీ చేయడం ద్వారా రైతు సంక్షేమం పట్ల గౌరవ ప్రధానమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైంది.
ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వమైన జీవన తత్వం 'యోగా'. గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి కృషితో నేడు యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించి, కోట్లాది మంది మన సంస్కృతిని ఆచరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. శరీరం, మనసుల నడుమ సమతుల్యతను సాధించి, ప్రశాంతతను ఇచ్చే అద్భుత సాధన యోగా. ఆరోగ్యవంతమైన జీవనశైలితో సంతోషకరమైన కుటుంబాలను నిర్మించుకుంటూ, యోగాను జీవితంలో భాగం చేసి శక్తివంతమైన సమాజ నిర్మాణానికి పునాదులు వేద్దాం.
ఈరోజు విజయవాడ పర్యటనలో ���న్న గౌరవ కేంద్రమంత్రి శ్రీ @JoshiPralhad గారు తాడిగడపలోని నా క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా వారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో ఆత్మీయ స్వాగతం పలికి, విందు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం, శ్రీ @narendramodi గారు 12 ఏళ్ల విజయవంతమైన సుపరిపాలనను పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు శ్రీ @MadhavBJP గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు మరియు పలువురు సీనియర్ నాయకులతో కలిసి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించాము.
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు రూ.2,700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన వెస్ట్ బైపాస్ ను కేంద్రమంత్రి @JoshiPralhad గారు, బీజేపీ రాష్ట అధ్యక్షుడు @MadhavBJP గార్లతో కలిసి పరిశీలించాను. విశాఖపట్నం, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా రాజధాని అమరావతి, గుంటూరు నగరాలను చేరుకోవచ్చని, ఈ ��ొత్త మార్గంతో విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ రద్దీ నుండి ఉపశమనం లభించిందని తెలియచేసాము.
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి, గౌరవనీయులు శ్రీ @JoshiPralhad గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @MadhavBJP గారితో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఆలయ ప్రధాన అర్చకులు, పాలకమండలి ఛైర్మన్ గారు, ఈవో శీనానాయక్ గారు గౌరవ మంత్రివర్యులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలి���ి, వేదాశీర్వచనం అందజేశారు.
విజయవాడ, రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ను గౌరవ కేంద్ర మంత్రి శ్రీ @JoshiPralhad గారు, బిజెపి నేతలతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ, గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలో 'వికసిత భారత్' విజన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకుపోతోందని క��నియాడారు; ఇందులో భాగంగా రాయనపాడు స్టేషన్ ఆధునీకరణకు రూ. 35 కోట్లు, 2026-27 బడ్జెట్లో ఏపీ రైల్వే మౌలిక వసతుల కోసం రూ. 10,144 కోట్లు భారీగా కేటాయించామని, అలాగే రాష్ట్రంలో 178 అమృత్ స్టేషన్ల అభివృద్ధి, విశాఖ రైల్వే జోన్, అమరావతి రైల్వే కనెక్టివిటీ మరియు భవిష్యత్ బుల్లెట్ ట్రైన్ ప్రణాళికలతో రాష్ట్ర రైల్వే వ్యవస్థ సరికొత్త వృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు.
కేంద్ర మంత్రివర్యులు శ్రీ @JoshiPralhad గారు విజయవాడ పర్యటనలో అమరావతి ప్రగతిపై చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలు. 2019-24 మధ్య తీవ్ర ఒ���ిదుడుకులకు లోనైన అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత కల్పించి సంపూర్ణంగా ఆదుకున్నారు గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు. బడ్జెట్లో రూ.15,000 కోట్ల నిధులతో పాటు, HUDCO ద్వారా మరో రూ.11,000 కోట్ల ఆర్థిక సాయం, కొత్త రైల్వే లైన్, జాతీయ రహదారుల అనుసంధానం మరియు పలు జాతీయ సంస్థల ఏర్పాటుతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తోంది
ఏపీలో రహదారుల మహర్దశ. రాష్ట్రంలో 4,551 కి.మీ జాతీయ రహదారులు, 3,273 కి.మీ గ్రామీణ రహదారుల నిర్మాణం పూర్తి. విజయవాడ-మచిలీపట్నం 6 వరుసల హైవే కోసం ₹573 కోట్లు మంజూరు. #2YrsOfTrustDevelopmentWelfare
ఆడబిడ్డల విద్యకు అండగా కేంద్రం. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మరియు కేంద్ర మద్దతుతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు. మహిళా సా��ికారతే లక్ష్యం! #2YrsOfTrustDevelopmentWelfare
గౌరవనీయ ప్రధాని శ్రీ @narendramodi నాయకత్వంలో AP రైల్వే మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2024-2025 నుంచి ఇప్పటి వరకు రూ.28,000 కోట్లకు పైగా రైల్వే నిధులు బడ్జెట్ లో కేటాయించడమే కాకుండా, విశాఖపట్నం కేంద్రంగా 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్' కార్యకలాపాలు ప్రారంభం కావడం రాష్ట్రానికి చారిత్రాత్మక ఘట్టం.
#2YrsOfTrustDevelopmentWelfare