A classic example of Leadership vs Dictatorship!
How a true leader like @PawanKalyan can put the same public funds to meaningful use that were once spent on mere snacks during dictatorship..
#PawanKalyanAneNenu#EndofYCP
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా "జల్ జీవన్ " పనులు మరింత వేగవంతం
"జల్ జీవన్ " మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షించారు.
#AmarajeeviJaladhara
39 Medals. One Tricolour. Countless Dreams.
The Commonwealth Games 2026 conclude with India securing an impressive tally of 39 medals, a remarkable achievement that reflects the unwavering determination, discipline and fighting spirit of our athletes.
Every medal earned is the culmination of years of sacrifice, relentless training and an unshakable belief in the dream of representing Bharat with honour. Behind every podium finish stand dedicated coaches, unwavering families, tireless support staff and countless unseen efforts that transformed aspirations into achievements.
From the opening event to the final contest, Team India displayed extraordinary resilience, sportsmanship and excellence. Every athlete who carried the Tricolour onto the global stage represented the hopes and aspirations of 140+ crore Indians, reminding the world that India’s greatest strength lies in the courage and character of its people.
As our athletes continue to scale new heights across disciplines, they are shaping a new era for Indian sports. Their achievements inspire millions of young Indians to dream fearlessly, embrace hard work and believe that dedication can turn every challenge into an opportunity and every aspiration into history.
Heartiest congratulations to every medal winner, every participant, every coach, every support staff member and every family whose sacrifices made this inspiring journey possible. Your achievements have filled every Indian heart with pride and strengthened our collective belief that the best of Indian sport is yet to come.
May this remarkable campaign serve as a stepping stone towards even greater triumphs on the world stage, inspiring generations to wear the Tricolour with pride and strive for excellence in every arena.
Jai Hind!
- @PawanKalyan
#CWG2026 #TeamIndia #Cheer4India
A Schedule-I Sambar Deer (Rusa unicolor), classified as Vulnerable by the IUCN, was swiftly rescued by the HANUMAN team after it accidentally fell into the HNSS Canal while searching for water. Responding within 20 minutes, the Forest Department safely rescued the deer and shifted it to the Karuna Society Wildlife Rehabilitation Centre for treatment.
Rapid response. Scientific care. Protecting every life.
#HANUMAN #WildlifeRescue #APForestDepartment
శ్రీ ప్రదీప్ రావత్ గారు ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖనటుడు శ్రీ ప్రదీప్ రావత్ గారు మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన శ్రీ ప్రదీప్ రావత్ గారు ప్రతినాయకుడిగాను, పలు భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. నేను నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాలలో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ ప్రదీప్ రావత్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
Congratulations to the amazing team at @SkyrootA on this incredible journey and the success of Vikram-1.
Keep making India proud. Wishing you all many more milestones ahead!
@PawanKChandana@bharathdaka
#PawanKalyanAneNenu
There are orthodox leaders who make election promises and forget them overnight once they come to power..
And then there is #PawanKalyan garu, who became the voice for countless public issues through #JanaVaani & is now turning those assurances into action through his Governance.
The sanction of funds for the Eluru Degree College is yet another example of #PawanKalyan garu's commitment to resolving issues!
• జిల్లాలవారీగా నిర్దేశిత లక్ష్యాలు
గ్రేట్ గ్రీన్ వాల్ కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది 48 హెక్టార్లలో పరిహార అటవీకరణ చేపట్టాం. ఇది చాలా వరకు పూర్తి కావచ్చింది. అత్యధికంగా 5 వేల హెక్టార్లలో తాటి వనాలు నాటుతున్నాం. గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద మరో 1,993 హెక్టార్లను దేశీయ మొక్కలతో నింపేయనున్నాం. 727 హెక్టార్లలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు లక్ష్యాలుగా నిర్దేశించాం. వీటిలో మడ అడవులు, తాటి వనాలు మినహా మిగిలిన అటవీకరణ అంచెల వారీగా చేపట్టాలి. తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలు, క్షీణించిన భూభాగాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీబీ జీ రాం జీ ద్వారా తీర ప్రాంతం వెంబడి నాటేందుకు వీలుగా మరో 70 లక్షల మొక్కలు సిద్ధం చేస్తున్నాం. సుమారు 2,500 హెక్టార్లలో ఈ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. అందులో ఒక్క రాజమహేంద్రవరం సర్కిల్లోనే 3,243 హెక్టార్లలో కలప ఉత్పత్తి, దేశీయ మొక్కలు నాటనున్నాం. గుంటూరు సర్కిల్లో 1,832 హెక్టార్లు, విశాఖ సర్కిల్లో 1,764 హెక్టార్లు లక్ష్యంగా పెట్టుకున్నాం.
గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం కింద 5 కిలోమీటర్ల వెడల్పుతో తీరానికి మూడంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. అందులో మొదటి రక్షణ వలయంలో తీరపు అంచుల్లో మడ అడవుల పునరుద్ధరణ, షెల్టర్ బెల్ట్‌ల మొక్కల పెంపకం, రెండు, మూడు వలయాలను కమ్యూనిటీ బఫర్ జోన్లుగా గుర్తించి గ్రామ వనాలు, సామాజిక వనాలు, వ్యవసాయ వనాల పెంపకాన్ని ప్రజలు, వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నాం. స్థానిక పర్యావరణ పరిస్థితులు, వర్షపాతం, భౌగోళిక స్వభావాలను పరిగణనలోకి తీసుకుని వీటి అమలు చేపట్టాలి. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోంది. ప్రాజెక్టు పురోగతిపై నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే ఏపీ గ్రీనింగ్ అండ్ క్లైమెట్ ఛేంజ్ మిటిగేషన్ సొసైటీ ద్వారా గ్రీన్ వాల్ లక్ష్య సాధన దిశగా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామ”న్నారు.
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచండి
•2026–27 లక్ష్యాలు రెండు నెలల్లో పూర్తి కావాలి
•గత రెండేళ్లలో మడ అడవుల విస్తరణలో దేశంలో ద్వితీయ స్థానం సాధించాం
•ఈ ఏడాది మరింత బాధ్యతగా మడ అడవుల పెంపకం చేపట్టాలి
•తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజా భాగస్వామ్యం పెరగాలి
•రాష్ట్రవ్యాప్తంగా 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక
•వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు మరో 70 లక్షల మొక్కలు
•గ్రేట్ గ్రీన్ వాల్ పనుల్లో పురోగతిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, కోతల నివారణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం మరింత పెరగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను వాతావరణ అనుకూలతల అనుగుణంగా వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనలో భాగంగా గడచిన రెండేళ్ల కాలంలో సాధించిన పురోగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిన అంశాన్ని గుర్తు చేశారు. మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం సాధించేందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.
సోమవారం మధ్యాహ్నం గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డివిజన్లవారీగా నిర్దేశించిన లక్ష్యాలు ఎంత వరకు పూర్తి చేశారు? ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? ఈ ఏడాది మడ అడవులు ఎంత విస్తీర్ణంలో నాటనున్నారు? తదితర వివరాలను అంశాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇవి గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనకు అదనపు బలం కానున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న తీర ప్రాంత జిల్లాలకు విపత్తుల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల నుంచి మన తీరాన్ని రక్షించుకోవడంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించనుంది. అందుకే కూటమి ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్‌ను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న 1,053 కి.మీ. తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చదనంతో కూడిన గోడను ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. మొదటి అర్ధభాగంలో వాతావరణ అనుకూలతల ఆధారంగా కొంత మేర మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయ్యింది. ద్వితీయార్థంలో తాటి విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వీటి సేకరణ, నాటే ప్రక్రియను పూర్తి చేయాలి. దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాల ఏర్పాటును ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలువ గట్లు, చెరువులు, తీర ప్రాంతాల్లో తాటి చెట్లు గాలి నిరోధక వ్యవస్థగా నిలుస్తాయి. తాటివనాలు, సామాజికవనాల ఏర్పాటు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.
*మడ అడవుల విస్తరణలో పురోగతి*
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గడచిన రెండేళ్లలో మడ అడవుల పెంపకంలో చక్కటి పురోగతి సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 740 హెక్టార్లు, 2025-26లో 1,930 హెక్టార్ల మేర మడ అడవుల విస్తరణ చేపట్టాం. తద్వారా మడ ఫారెస్టింగ్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాం.ఈ అద్భుత ఘనత సాధనకు కృషి చేసిన సిబ్బందికి, సహాయ సహకారాలు అందించిన పర్యావరణ నిపుణులకు హృదయపూర్వక అభినందనలు. సాధారణంగా మడ అడవుల స్థాపనకు అక్టోబర్ నుంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఏడాది మరింత బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో మిష్టి–II (MISHTI-II) కింద 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. తీర ప్రాంత రక్షణ కవచం అయిన మడ అడవుల ప్రాధాన్యతను గ్రహించి, నిర్ణీత సమయంలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేయాలి.
(1/2)
కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాల్తి అఖిలేష్, కెనడాకు చెందిన ఫెంటాస్టిక్ ఏఐ సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజినీర్‌గా ఎంపికై, ₹1.06 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ సాధించడం గర్వకారణం.
టైలర్ గా జీవనం సాగిస్తున్న శ్రీ వెంకట గంగాధర్ కుమారుడైన అఖిలేష్ - పట్టుదల, కృషికి తోడు నిరంతర అభ్యాసంతో ఈ అద్భుత విజయాన్ని అందుకున్నారు. ప్రతిభకు పట్టుదల తోడైతే ఏ లక్ష్యమూ దూరం కాదని ఆయన ప్రయాణం నిరూపించింది. ఆయన సాధించిన ఘనత పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. అఖిలేష్ విజయానికి అండగా నిలిచిన ఆయన తల్లిదండ్రులు శ్రీ వెంకట గంగాధర్, శ్రీమతి దేవి, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ వేదికపై యువ భారత్ సత్తాను చాటుతూ ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
Warm birthday wishes to Hon’ble Chief Minister of Puducherry, Shri N. Rangasamy Avargal.
May you be blessed with good health, happiness, and continued strength to serve the people with dedication. Wishing you a wonderful year ahead filled with success and prosperity.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
HANUMAN Wildlife Rescue | A Safe Return to the Wild
Swift action under the #HANUMAN Initiative helped rescue an injured Rock Eagle Owl, a Schedule I protected species, from Sri Sathya Sai district. After timely veterinary care, it recovered and was safely released into the Nelakota Reserve Forest.
#WildlifeRescue
Warm birthday wishes to Hon’ble Union Minister of State for Steel and Heavy Industries, Shri @BjpVarma Garu.
May you be blessed with good health, happiness, and a long life filled with continued success. Wishing you many more years of dedicated service to the nation and the people.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
(2/2)
•ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో నిరంతర పర్యవేక్షణ
కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యి నత్తనడకన నడుస్తున్న పనులపై దృష్టి సారించాలి. ముఖ్యంగా పైపు లైన్ల నిర్మాణానికి సంబంధించి ఇతర శాఖల అనుమతులు పెండింగ్ లో ఉంటే ఆ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. ఆర్ అండ్ బి, జాతీయ రహదారి అథారిటీ, పంచాయతీరాజ్ శాఖలు, అవసరం ఉన్న చోట అటవీశాఖలతో సమన్వయం చేసుకుంటూ, పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ల ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో పనుల వేగం పెంచాలి. అదే సమయంలో నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడవద్దు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతా. నిర్మాణ పనులకు సంబంధించి నాణ్యతాపరమైన తనిఖీలు స్వయంగా నిర్వహిస్తాం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామ”న్నారు.
నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలి
• తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భద్రత
• లక్ష్యం దిశగా అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు
• రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో
• కీలక నిర్మాణాలు వేగవంతం.. 400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
• నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తా
• ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో జల్ జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చే బలమైన సంకల్పాన్ని ఈ ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లతోపాటు పైప్లైన్ల నిర్మాణం వంటి కీలక పనుల పురోగతికి సంబంధించిన వివరాలపై ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుండడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
• పనుల పురోగతి వివరాలు
ఈ సమీక్షలో పనుల వివరాలను అధికారులు తెలియజేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాన్ని 10 నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు ఇంటేక్ వెల్స్, యాక్సెస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 111 MLD, 75 MLD సామర్థ్యాలతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల్లో ఒకటి నిర్మాణ దశలో ఉన్నట్టు వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.151 కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించగా, 182 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో రూ.1,400 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా సుమారు 13.50 లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి. దీనికి సంబంధించి ఇంటేక్ వెల్, యాక్సెస్ బ్రిడ్జి, 155 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. రెండు పథకాల కింద సుమారు 400 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో గత ఏడాది డిసెంబర్లో పశ్చిమ గోదావరి జిల్లా పెరవలిలో రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టాం. రెండు మెగా వాటర్ గ్రిడ్ పథకాల నిర్మాణంలో కీలకమైన ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. పనులన్నీ నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయంతో పని చేయాలి.
(1/2)
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @pawankalyan గారిని భారతీయ జనతా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ శివ్ ప్రకాష్ @shivprakashbjp గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ @MadhavBJP గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ శ్రీ మధుకర్ @BJPMadhukarAP గారు పాల్గొన్నారు.