Direct National Politics Loki Digesaadu🥵💥
Niku Unna Guts Ki Salaam Ayya @PawanKalyan 💯🔥
My Cofans be ready.. for everything ..
Evadu vachi em peekuthado chuddham 🤙🏻🔥
#PawanKalyanForSanatanaDharma
ఏఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజల్ని అప్రమత్తం చేయండి
•వాగులు పొంగుతున్న వేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించండి
•అవసరం ఉన్న చోట తక్షణం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలి
•జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌తోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వివరించారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం, జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ఆ ప్రాంతంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు.
వర్షాలు తగ్గే వరకు ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట తక్షణమే పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, అత్యవసర సేవల సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ప్రజలు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేశారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
#AadarshaKutumbam Is Here 🧸♥️
All My Favourite People Coming Together Making A blockbuster One Again ♥️🫠
See U all in Theatres 🎭 This DUSSEHRA ❤️🔥🔥
https://t.co/7O3nNw5bUV
Congratulations to our Blockbuster Director @dirbobby garu on completing 12 Glorious Years in TFI ❤️🔥
As he steps into his 13th Year, get ready for a MEGA MASSIFIED EXPERIENCE with #KAAKA 💥
Lets set the BLOODY BENCHMARK on January 13th, 2027🔥
#12YearsofBobbyKolli
గురువాయూరప్పను దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
•వేకువజామున పవిత్ర నిర్మాల్య సేవ
•తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకం సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
కేరళం రాష్ట్రం, త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు. ముందురోజు చేసిన అలంకరణతో స్వామిని చేసుకునే తొలి దర్శనాన్ని నిర్మాల్య సేవగా పిలుస్తారు. ఈ సేవ కోసం శనివారం ఉదయం వేకువజామున 3 గంటలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువాయూర్ ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 30 నిమిషాలపాటు ఈ విశిష్ట సేవలో పాల్గొని తరించారు. అంతకు ముందు గురువాయూర్ చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. దక్షిణ ముఖద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించిన ఆయన, స్వామి నిర్మాల్య దర్శనం చేసుకున్నారు. గర్భాలయంలో మూలవిరాట్టుకి నిర్వహించే ప్రత్యేక కైంకర్యాలు అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించారు.
•స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
నిర్మాల్య దర్శనానంతరం సంప్రదాయం ప్రకారం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తారు. శంభాభిషేకం, వాకచార్థు సేవలు నిర్వహిస్తారు. స్వామి వారికి ముందు రోజు అలంకరించిన గంధాన్ని తొలగించి అభ్యంగన స్నానం చేయించే అద్భుత సేవ గురించి ఆలయ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నైరుతిలో ఉన్న వినాయకుడిని దర్శించుకుని, ఆలయ ఆచారాలను అనుసరిస్తూ గుడి వెనుక భాగంలో సాష్టాంగం చేశారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయ ప్రదక్షణలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గురువాయూర్ మేల్ శాంతితోపాటు ఇతర ప్రధాన అర్చకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి, స్వామివారి కళభం, తదితర ప్రసాదాలు అందజేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆయుర్వేద థెరపీ చేసిన వైద్యులు ఆయనతోపాటు గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.