A special presence at the Pre-Birthday Celebrations of Power Star Pawan Kalyan Garu! ❤️🔥
Panjaa producer Neelima Tirumalasetti Garu is joining us at Insomnia to celebrate the birthday of our beloved Power Star.
A celebration of the cult. A celebration of the legacy.
Book yours tickets now
Let’s make it unforgettable!
Book Tickets Here :- https://t.co/RJAWWqyf7O
#Panja4K
#Panjaa4K
You Asked Us
We Delivered
Vijayawada Sailaja 5/5 shows Confirmed 💥
Requesting Everyone to wait for 1 More day. Everything will be sorted and will have grand release on September 2nd 💖
#Panja4K#Panjaa4K
Heartiest congratulations, dear @NagaBabuOffl , on taking charge as Chairman of the AP Green Executive Committee. 💐
ప్రకృతి మీద నీకున్న ప్రేమకు, Mother Nature నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తున్నాను.
A proud and important responsibility to contribute towards a greener and better Andhra Pradesh. Wishing you great success in this new journey and many more accomplishments in the service of the people. 💚
ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌గా నియమితులై, క్యాబినెట్ ర్యాంక్ పొందిన నాగబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐❤️
మీ కొత్త బాధ్యతల్లో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
@NagaBabuOffl
#RakshaBandhan
సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..!
అక్కాచెల్లెళ్లతో అన్నదమ్ములకున్న ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినం సందర్భంగా సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాఖీ పౌర్ణమి భారతీయ కుటుంబ వ్యవస్థతో పెనవేసుకున్న బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలకు ఓ భావోద్వేగపూరిత సంకేతం. సోదర భావాన్ని, మహిళలకు గౌరవాన్ని, భరోసాని అందించే పండుగ.
రాఖీ పౌర్ణమి వేళ రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ముందుకు వెళ్తుందన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఇప్పటికే దీపం-2 ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. డోలీ రహిత గిరిజన గ్రామాల కల సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే 426 గిరిజన ఆవాసాలను రోడ్లతో అనుసంధానించడమైనది. అడవితల్లి బాట ఫేజ్-2 ద్వారా ఈ రోడ్లను మరింత విస్తరించే దిశగా చర్యలు చేపట్టాం.
గిరిజన మహిళల్లో కనిపించే జన్యుపరమైన వ్యాధి సికిల్ సెల్ అనీమియా నుంచి రక్షణ కల్పించేందుకు అరకులో ప్రత్యేక బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నాము. ఆడపడుచుల అభ్యున్నతి, సాధికారత దిశగా ముందుకు వెళ్తామని రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలియచేస్తున్నాము.
- Hon'ble Andhra Pradesh Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan
ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా శ్రీ @NagaBabuOffl బాధ్యతల స్వీకరణ
జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా శుక్రవారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు తన సతీమణి శ్రీమతి పద్మజ గారితో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీ నాగబాబు గారికి వేద ఆశీర్వచనం అందించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నాగబాబు గారికి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఆయనకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నాగబాబు గారిని పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ చీఫ్ శ్రీ రాహుల్ పాండే, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు శ్రీ వై. శ్రీనివాసరెడ్డి, పీసీసీఎఫ్ విజిలెన్స్ శ్రీమతి రేవతి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి , పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఉప ముఖ్యమంత్రి గారి ఓఎస్డీ శ్రీ వెంకటకృష్ణ, ఏపీ టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, తూర్పుకాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీమతి పాలవలస యశస్వి, పొల్యూషన్ కంట్రోట్ బోర్డు మెంబర్ శ్రీ పంచకర్ల సందీప్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Heartfelt congratulations and best wishes to Sri Konidela @NagaBabuOffl Garu on taking charge as the Chairman of the AP Green Executive Committee. 💐
Wishing you great success in this new responsibility and many more achievements in the service of the people of Andhra Pradesh. 🙏
#JanaSena
కృష్ణంపాలెం, పునరావాస కాలనీ ప్రజల విజ్ఞాపనపై స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ సంస్థలో పీసీబీ తనిఖీలు
•యంత్రపరికరాల ప్రీ కమిషనింగ్ సమయంలో ఉద్గారాలు విడుదలవుతున్నట్లు గుర్తింపు
•కాలుష్య నియంత్రణ పరికరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి కమిషనింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచన
•పీసీబీ నిబంధనల ప్రకారం శుద్ధి చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులో విడుదల చేయాలని ఆదేశం
•కాలుష్య నియంత్రణ వ్యవస్థలు పూర్తయ్యే వరకు కార్యకలాపాలకు తాత్కాలిక బ్రేక్
మా గ్రామస్తులను కాలుష్యం బారి నుంచి కాపాడండి అంటూ సామాజిక మాధ్యమాల్లో అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కృష్ణంపాలెం గ్రామస్తులు చేసిన విజ్ఞాప్తిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు తక్షణం స్పందించారు. విశాఖ నుంచి కాలుష్య నియంత్రణ మండలి అధికారులను పంపి, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ సంస్థలో తనిఖీలు చేపట్టారు. పరిశ్రమలో చేపట్టిన యంత్ర పరికరాల ట్రయల్ రన్ లో కలప వ్యర్ధాలను ఇంధనంగా ఉపయోగించడం కారణంగా బాయిలర్ నుంచి వెలువడుతున్న కాలుష్య వాయువులు ఎమర్జెన్సీ వెంట్ ద్వారా ఆర్ అండ్ ఆర్ కాలనీ, కృష్ణంపాలెం గ్రామం వైపు వ్యాపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
నిబంధనల ప్రకారం మల్టీసైక్లోన్ డస్ట్ కలెక్టర్ అనే వాయు కాలుష్య నియంత్రణ పరికరాన్ని బాయిలర్ పొగ గొట్టానికి అనుసంధానించి, శుద్ధి చేసిన ఉద్గారాలను తగిన ఎత్తు కలిగిన చిమ్నీ ద్వారా విడుదల చేయాల్సి ఉంది. యంత్రాల ప్రీ కమిషనింగ్ ప్రక్రియలో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ సంస్థ ఈ నిబంధనను పాటించడం లేదని గుర్తించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు పీసీబీ నిర్దేశించిన కాలుష్య నియంత్రణ పరికరాలు అమర్చిన అనంతరం కార్యకలాపాలు కొనసాగించుకోవాలని సదరు సంస్థ యాజమాన్యానికి పీసీబీ అధికారులు సూచనలు చేశారు. చిమ్నీ ఏర్పాటు పనులు పూర్తి చేసేందుకు సదరు సంస్థ 20 రోజుల గడవు కోరగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టిన అనంతరం కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభిందుకు అనుమతి ఇచ్చారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
రాఖీ పండుగకు పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ కానుక !!
పిఠాపురం నియోజకవర్గంలోని 2,300 మంది చెల్లెమ్మలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా చీరలను అందించి,
“అన్నగా నేను ఉన్నాను” అనే భరోసాను కల్పించిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు.
అది కేవలం చీర కాదు…ప్రేమ, గౌరవం, ఆత్మీయతతో అందించిన అన్నయ్య కానుక .
I can proudly say - పిఠాపురం MLA గారి తాలూకా .
Raksha Bandhan is a celebration of a beautiful bond of love, care, trust and protection that extends far beyond the ties of family. It reminds us to cherish those who stand by us, support us and protect us through every chapter of life.
May this sacred occasion bring happiness, peace, good health and prosperity to every home and strengthen the bonds that bring us closer.
My heartfelt wishes to all sisters and brothers, and to everyone celebrating Raksha Bandhan.
- @PawanKalyan
#HappyRakshaBandhan