మీడియా ప్రకటన
తేదీ:14-02-2024
జన్వాడ, హైదరాబాద్
👉 జన్వాడలో మతపరమైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
👉 జన్వాడలో ఆర్ఎస్పీ పర్యటన ఉద్రిక్తత.
👉 మైనారిటీలకు,దళితులకు రక్షణ కల్పించాలి.
👉 పాలన చేతకాకపోతే దిగిపోండి... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిక
👉 నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్
హైదరాబాద్ నగర్ శివారులోని జన్వాడలో ఆర్ఎస్ఎస్,బిజెపి, కాంగ్రెస్ గుండాలు మెథడిస్ట్ చర్చిని ధ్వంసం చేసి,అడ్డుకున్న దళితులపై ఇనుప రాడ్లు,కర్రలతో పాశవికంగా దాడులకు పాల్పడిన నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం రాత్రి జన్వాడలో ఆర్ఎస్ఎస్, బిజెపి,కాంగ్రెస్ గూండాల దాడుల్లో గాయపడిన బాధితులకు మద్దతుగా బుధవారం జన్వాడ బయలుదేరిన ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెథడిస్టు చర్చ్ పై దాడి చేసి దళితులను తీవ్రంగా గాయపరచడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.దాడులకు పాల్పడిన నిందితులపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య,లౌకిక దేశంలో కుల, మతపరమైన దాడులు క్షమించరాని నేరంగా పరిగణించాలన్నారు.రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కులకు కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. మత మైనారిటీలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఒక వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూనే, మరోవైపు కాంగ్రెస్ హాయాంలోని తెలంగాణలో చర్చిలను ధ్వంసం చేసి, దళితుల హత్యకు ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
ముఖ్యమంత్రికి పాలన చేతకాకపోతే దళితులకు రక్షణ కల్పించకపోతే ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు,మత మైనారిటీలకు ఆయుధాలు ఇస్తే తమను తాము రక్షించుకుంటామని ఘాటుగా వ్యాఖ్యానించారు.
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero@BITCELL_BSP