Being able to hold a Kavya that you've composed in your hands is a feeling akin to holding your child for the very first time, they say. Now experiencing what they meant.
Humbly presenting my published metrical Telugu poem, "హృదయావి" (हृदयावी/Good-hearted). Please DM for copies.
@TeluguJambuDwip ఈ పద్యం పొన్నికంటి తెలగనార్యుడి కృతి యయాతిచరిత్రము లోనిది. యయాతిచరిత్రము తెలుగులో వెలివడిన మొట్టమొదటి పూర్తి అచ్చతెనుగు కావ్యమని పెద్దలు చెబుతారు. అయితే ఈ పద్యం పాల్కురికి సోమన్న పై చెప్పినది కాదు. తెలగన్నను గూర్చే మఱింగంటి అప్పన్న గారు చెప్పినది. అదే అవతారికలో చోటుచేసుకున్నది.
@ravitejaneti చాలా బాగుందండీ. ఇది చతుర్మాత్రాబద్ధమైన హరిగతిరగడ గతిలో ఉంది. భరతుడి నాట్యశాస్త్రంలో రెండు గురువులు-నాలుగు లఘువులు-మళ్ళీ రెండు గురువులు గతిలో ఒక తాళం కూడా ఉన్నది.
@santhoo9 తెలంగాణ చారిత్రకాస్తిత్వం గొప్పది. అది ఉండనే ఉంది. ఎవరో లేదంటే పోదు.
నేను అన్నది మౌలిక సాహిత్య-సాంస్కృతిక-జీవ-భాషా పరమైన ఐక్యత. నాకు అది ఎప్పుడూ ఉంటుంది. చంచలాలైన రాజకీయ ఐక్యతానైక్యతలు దానిని చెడగొట్టకూడదని కోరుకుంటాను. ఈ విషయంలో అటువంటి రాజకీయాలకు వ్యక్తిగతంగా విలువనివ్వను.
@TeluguJambuDwip All I said was when we talk about poets like Pothanna or Annamayya or Ramadasu - their poetry, their tapas, their sAdhana, their pure brilliance etc all of these things should take importance. Not their location. That could make them political stock as we cannot control that.
@TeluguJambuDwip Traditional sankalpa is not inanimate pinpointing. Its describing of the greater natural spiritual forces around. With great rivers, mountains, punyakshetras the performer gets energy. Those are all living beings and we worship them.
@TeluguJambuDwip This problem solely belongs to modern history which is heavily influenced by western principles. Some of which, are of value and some are destructive, IMO.
Indian classical artistic schools of thought, Indian traditional lens of history do not dwell on these problems at all.
@TeluguJambuDwip అవునండి. చరిత్ర, సంస్కృతులలో ఇప్పటికీ ఏమీ ప్రత్యేక భేదం లేదు. కవి కాల- స్థల- చరిత్రలు చిన్ననాటి నుండి మేము చదువుకున్నాము. మా ఇంటిలో, మా గురువుల దగ్గర, మా దేవాలయాలలో పోతన మావాడు. రుద్రమదేవి మా యింటి ఆడపడుచు. వారు తెలంగాణా వారైనా అలా మేము ఎప్పుడూ అనుకోలేదు. ఆ పేరు ఇప్పుడే వేరైనది.
@TeluguJambuDwip ఇవన్నీ భారతీయసంప్రదాయమూలాలున్న అమోఘసాహిత్యనిధి కావటం మూలాన తెలుగువారున్న ప్రతీ చోటుకూ వెళ్లడం గొప్ప సంగతి. ఇప్పటి ఆంధ్రలో చాలా మందికి (నాకు కూడా) పోతన్న, రామదాసే కాదు పై కవులందరూ మా వారే. అన్యప్రాంతం వారుగా చూడము. పోతనపై ఎంతో పరిశోధన ఆంధ్రనుండీ జరిగింది.