రెండవ భాగం
పంచభూతాలు కలిపితే ఒకే క్షేత్రం. ఆ క్షేత్రంలో ఎవడు లీనమైయున్నాడో అతనిని తెలుసుకోగలిగితే పంచభూతలింగాలను దర్శించినట్లే. ముందు లింగం అనే శబ్దం గురించి తెలుసుకొని తరువాత పంచభూతలింగం గురించి తెలుసుకొందాం. లింగం అనే శబ్దానికి సాధారణ అర్థాల్ని వదిలేద్దాం.
మన హిందూమతంలో బాధాకరమైన అంశం ఏమిటంటే స్పష్టమైన జ్ఞానం హిందువుల్లో ఎక్కువ శాతం మందికి లేదు. వాళ్ళు వినికిడి మీద ఏదైతే ఉందో ఆ అభిప్రాయానికి స్థిరపడిపోతారు. ఇతరులకి శాస్త్రార్థాలు తెలియక పోవడం వల్ల మనకున్న సామాన్య అభిప్రాయాన్ని తీసుకొని ఇతరులు కువిమర్శ చేస్తారు. మనకి ఏదీ తెలియదు కనుక అది నిజమనుకొని దాని వల్ల కొంత భ్రాంతికి కూడా లోనవుతూ ఉంటాం. అలా శాస్త్రజ్ఞానం లేకుండా ఇష్టానుసారం అర్థం చెప్పిన శబ్దం లింగం. లింగమనే శబ్దానికి అర్థం చూస్తే సర్వజగత్తు యందు ఏది లీనమై ఉందో, సర్వజగత్తు దేని యందు లీనమై ఉందో అది లింగం. అన్నీ దేనియందు లీనమై ఉన్నాయో, ఏది అన్నిటియందు లీనమై ఉందో అది లింగం. 'లయనాత్ లింగముచ్యతే', 'లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేహిలీయతే' అని చెప్పారు. ఈ సర్వజగత్తు బ్రహ్మము నందే లీనమై ఉంది. మరి బ్రహ్మము ఎక్కడున్నాడంటే సర్వజగత్తు యందు ఉన్నాడు. మనం చూస్తున్న ప్రతి ఉపాధి ఈశ్వరచైతన్యాన్ని ఆధారం చేసుకొని ఉంది. ప్రతి ఉపాధిలోనూ ఈశ్వర చైతన్యం ఉంది. మన చుట్టూ ఉన్నది ఈశ్వరుడే. మనలో ఉన్నదీ ఈశ్వరుడే. ఆయన ఎలా ఉన్నాడంటే ప్రపంచంలో ఏదో ఒక మూల దాక్కొని లేడు. మన శరీరంలో కూడ ఏదో ఒక మూల చూసుకొని కూర్చోలేదు. ఆయన అంతటా లీనమై ఉన్నాడు. లీనమైపోయాడంటే వ్యాపించిపోయాడని అర్థం. అలా లీనమై ఉన్నవాడు కనపడడు.
పాలల్లో ప్రతి అణువులో వెన్న లీనమై ఉంటుంది. కనబడదు. కాస్త తెలివి ఉంటే పాలలో వెన్న కనపడకపోయినా ఉందని తెలుసుకొంటాం. లీనమై ఉన్నదాన్ని వెలికితీసుకోవడానికి ఎవరి సాధనలు వాళ్ళు చెయ్యాల్సిందే. ఎలాగైతే పాలల్లో ప్రతి అణువులోను లీనమై ఉన్న వెన్న మన మామూలు నేత్రానికి గోచరం కాదో, అదేవిధంగా ప్రపంచంలో ప్రత్యణువులో పరమాత్మ లీనమై ఉన్నాడు. ప్రతి ఉపాధిలోనూ కూడా ఆయనే లీనమై ఉన్నాడు. ఆ లీనమై ఉన్నవాడే అసలు శక్తిప్రదాత. ఆ లీనమైన వాడే శక్తి. కనపడట్లేదే అంటే శక్తి కనపడదు కదా!
శక్తి లక్షణమే మామూలు నేత్రానికి గోచరించకపోవడం. అది చిచ్ఛక్తి. అలాంటి చిచ్ఛక్తి ప్రతి ఉపాధి యందు లీనమై ఉంది. ఇప్పుడు మనలో ఉన్న ప్రకృతి మన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి కొంచెం ఆలోచించాలి.
శాస్త్రాలు తెలుకోవడం కంటే ముందుగా బుద్ధికి పని పెట్టాలి.
మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ, మనలో ఉన్న ప్రకృతిలో ఉన్నవి ఐదే ఐదు వస్తువులు. అంతకు మించి ఇంకొకటి లేవు. వాటిని ఒక్క మాటలో చెప్పాలంటే పంచభూతాలు అని అంటారు. ఆ పంచభూతాలే మనలోనూ, మన చుట్టూ ఉన్నవి. మనకి కలిగే సుఖదుఃఖాలు కూడా పంచభూతాల యొక్క ప్రకోపాలు బట్టి ఏర్పడుతూ ఉంటాయి. పంచభూతాలలో ఏ భూతం యొక్క ప్రకోపం ఎక్కువైనా మనం తట్టుకోలేం. అన్ని సరిగ్గా మనకి అనుకూలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం.
మనకి అనగానే కేవలం మానవజాతికే కాదు. ఇతర జంతు జాతులకి కూడా వాటి అనుకూలత వాటికి కావాలి. మనకి ఉన్నట్టే వాటికి ఉండాలని లేదు. భగవంతుడు మనకోసమే సృష్టి చెయ్యలేదు. అన్నింటికోసం చేశాడు.
ఎందుకీ బురద? ఎందుకీ వాన అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ బురద దానిలో బ్రతికే వానపాముకి అవసరమే. కనుక భగవంతుడికి మనమెంతో వానపాము కూడా అంతే అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి.
భగవానుని సృష్టిలో ఒక జీవి అగ్నియొక్క ప్రకోపాన్ని, వేడిని తట్టుకోగలదు. మరొక జీవి తట్టుకోలేదు. ఒక జీవి జలము యొక్క ప్రకోపాన్ని తట్టుకోగలదు. మరొక జీవి తట్టుకోలేదు. అలాగే వాయుప్రకోపాలు కూడా అంతే. మానవుల్లో కూడా ఒకడు తట్టుకోగలిగింది కూడా వేరొకడు తట్టుకోలేడు. కనుక మానవుల్లోనే భేదాలు కనపడుతున్నట్లుగా ఇతర జంతుజాతుల్లో కూడా కనపడుతున్నాయి.
ఈ పంచభూతప్రకృతి కూడా తనకి అనుకూలంగా ఉండాలని ప్రతిజీవి అనుకొంటుంది. అయితే మనకు అనుకూలం అయినది ఇంకొకరికి ప్రమాదం.
ఒకాయన వర్షాకాలంలో పెళ్ళి తల పెట్టాడు. తరువాత చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాడు కాని వర్షాలు పడకుండా ఉంటే బాగుండునని కోరుకున్నాడు. నిజంగా వాడి కోసం వర్షాలు పడకుండా కూర్చుంటే పంటలు ఎలా పండుతాయి? మనం మన కోణంలో ఆలోచిస్తాం కానీ భగవంతుడు మనలా ఆలోచించాలి అనుకోవడం మనం చేస్తున్న పెద్ద పొరపాటుల్లో అతి పెద్ద పొరపాటు.
భగవంతుడు పంచభూతాలను ఎలా నడపాలో అలా నడుపుతాడు. పత్రివారు కోరుకునేది ఏమిటంటే ఎలా నడిపినా ఫర్వాలేదు కానీ వారికి మాత్రం అనుకూలంగా ఉండాలి.
బయట పంచభూతాలు మనకు అనుకూలించాలని కోరు కుంటున్నాం, కాని అనుకూలించడం లేదు అది మన చేతిలో లేదని తెలిసింది. పోనీ బయట వదిలివేద్దాం. మన శరీరం మనది. మన ఇష్టానుసారం వెళ్ళవచ్చు అని ప్రతీవాడు అంటాడు. కదా. మన శరీరంలో ఏ ఒక్కటి మన మాట వినడం లేదు. అది అందరికీ స్వానుభవమే.
మన కాలు చెయ్యీ కూడా మన మాట వినవు. అది నడుస్తున్నంత సేపే మనం నడుస్తున్నాం. మనం నడుస్తున్నాం అనుకుంటున్నాం అది మొరాయించింది అనుకోండి ఒక్క అడుగు బయట పడదు. అప్పుడు అంటాం భగవంతుడా ఎందుకు అన్యాయం చేశావని. నడక పాడైనప్పుడు భగవంతుడు గుర్తుకు వచ్చాడు, నడిచినప్పుడు నడిపించాడు అనిపించలేదు.
దీనిని బట్టి చూస్తుంటే బయట పంచభూతాల్లో, లోపల పంచభూతముల్లో కూడా లీనమై ఒకాయన నడిపిస్తున్నాడు.
ఇప్పుడు పంచభూత క్షేత్రము కానిది ఏది?
పంచభూతాలలో లీనమై నడిపే ఒకే ఈశ్వరుడే వాటి యందు 'లింగాలు'గా లీనమై ఉన్నాడు.
ప్రపంచమంతా పంచభూత క్షేత్రమే అనే ఈ మనిషి కూడా పంచభూతక్షేత్రమే.
పాంచ భౌతిక ప్రవృత్తే కదా వాడి శరీరం.
ఇవన్నీ ఉండడానికి అవకాశం ఇచ్చేది ఆకాశం, కనుక ఈ ఐదు ప్రకృతులు మనలో, బయటా ఉన్నాయి. ఐదు ప్రకృతులకు ఒక శక్తి ఉంది అనేది ప్రతీవారు ఒప్పుకుంటున్నారు.
మనలో అగ్ని చైతన్యం తగ్గితే మనల్ని అగ్నికి ఇచ్చేస్తారు. అది ఉన్నంతసేపే వెచ్చగా హాయిగా ఉంటుంది. వెచ్చదనం తగ్గిపోతే ఎన్నెన్ని ఎక్కించాలో మీకు తెలుసు.
ఇక భూ ప్రకృతి మనలో ఉన్న చర్మము గానీ, ఎముక గానీ, వాటి యొక్క వాసన గానీ ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆ భూ ప్రకృతి లేకపోయినా మనం లేము.
అన్నింటికి మించి ఆకాశం. అది కనపడదు అంటే కనపడదు కాబట్టి అది గొప్పది.
ఆ శక్తి వాటికి దేని వల్ల వచ్చిందంటే వాటి యందు ఎవడు లీనమై ఉన్నాడో, వాడి వల్ల ఆ శక్తులు వస్తున్నాయి. అది ఎలా అంటే శబ్దం చేసే పరికరం, వెలుగునిచ్చే పరికరం, గాలినిచ్చే పరికరాలు మీ చుట్టూ కనపడుతున్నాయి.
ఒక పరికరం చేసే పని ఇంకొక పరికరం చెయ్యదు. ఏ పరికరం పని దానిదే అయినప్పటికీ, వీటియందు లీనమైన విద్యుచ్ఛక్తి ఒక్కటే. దానితోనే అన్నీ పని చేస్తున్నాయి. అలా పంచభూతాలలో దేని పని దానిదే. అయినప్పటికీ పంచ భూతాలలో, లీనమైన ఈశ్వరుడున్నాడు. అతడికి ఈ పంచభూత వికారాలు లేవు. ఆయన లేకపోతే ఈ పంచ భూతములు లేవు అని తెలుసుకోగలిగితే చాలు.
మొదటి భాగం
పంచభూతలింగాల క్షేత్రాల గురించి చాలామందికి ఒక అవగాహన ఉంది. అలాంటి వాటిని ఇక్కడ ఒక సారభూతంగా, సంక్షేపంగా, గాఢంగా తెలుసుకోబోతున్నాం. పంచభూతలింగాలు అంటే ఐదు క్షేత్రాలు అని అందరికీ తెలుసు.
పంచభూతక్షేత్రముల యందు లింగాలా! పంచభూతాలే లింగాలా! పంచభూతలింగాలు అనగానే శివుని గురించి చెప్తారని అనుకోవచ్చు. పంచభూతలింగాలు అన్నామే గానీ పంచభూతక్షేత్రలింగాలు అని చెప్పలేదు. పంచభూతాలలో శివుడు లేదా పంచభూతాలుగా శివుడు. అది ఇందులో చెప్పుకోబోతున్న ప్రధాన అంశం.
ప్రధానంగా క్షేత్రయాత్రలో వచ్చే పంచలింగ క్షేత్రాలలో నాలుగు క్షేత్రాలు తమిళనాడులోను, ఒకటి ఆంధ్రప్రదేశ్ లోను ఉన్నాయి. పృథ్వీలింగం కాంచీపురం, జలలింగం తిరుచానాపల్లి దగ్గర ఉన్న జంబుకేశ్వరం, అగ్నిలింగం అరుణాచలం, వాయులింగం శ్రీకాళహస్తి. అటుపై చిదంబరం ఆకాశలింగం.
క్షేత్రం అని దేనిని అనాలి?
వ్యవహారంలో పొలాలను క్షేత్రం అని అంటారు. నిజానికి క్షేత్రం అంటే ఎనర్జీ ఫీల్డ్. ఎక్కడ దైవశక్తి కేంద్రీకృతం అవుతుందో దానిని మనం క్షేత్రం అంటాము. అటువంటి దైవశక్తి ఆ క్షేత్రంద్వారా ఎన్నో విధాలుగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మనం భగవంతుని ఒక్క రూపంతో మాత్రమే ఆరాధించడం లేదు. ఒకే భగవంతుడు అనేక రూపాలుగా ఉన్నాడని దర్శిస్తున్నాం. అదే హిందూమతం లో ఉన్న గొప్పతనం. భగవంతుని ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విధంగా చూడగలిగే అద్భుతమైన లక్షణం హిందూ ధర్మంలోనే ఉంది. కనుకనే ఎక్కడికక్కడ అనేకరకాల క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రం ద్వారా దైవశక్తి ఒక్కొక్క విధంగా కనబడుతోంది.
అనేకత్వం భగవంతునిదా? లేదా మనదా?
అంటే ప్రకృతి అనేకంగానే ఉంటుంది. పరమేశ్వరుడు ఏకం. ఏకమైన పరమేశ్వరుడు అనేకమైన ప్రకృతి ద్వారా తన చిచ్ఛక్తిని అనేకంగా చూపిస్తాడు. మనకి అనేకం కూడా అవసరమే. అనేకంగా కనబడుతున్న పరమాత్మని ఆరాధిస్తూనే ఆయన ఏకస్వరూపుడనే స్పృహతో ఉంటాం.
హిందూమతంలో కాస్త అవగాహన ఉన్నవారు ఎవరైనా భగవంతుడు ఒక్కడే గాని అనేకరూపాలతో అనుగ్రహిస్తాడని తెలుసుకుంటూ ఉంటారు. ఎలాగైతే ఆయన స్వరూపాలు అనేకంగా ఉంటాయో, క్షేత్రాలు కూడా అనేకంగా ఉంటాయి. ఒక క్షేత్రాన్ని మనం తలచుకున్నప్పుడు ఒకరకమైన భావన మనకి కలుగుతుంది. ఒక క్షేత్రం ఆరోగ్యానికి ప్రధానం. మరొక క్షేత్రం ధనానికి ప్రధానం. ఇంకో క్షేత్రం మరికొన్ని ఇబ్బందుల్ని తొలగించడానికైతే, మరికొన్ని క్షేత్రాలు గ్రహదోషాలు తొలగించడానికి. అలాగే కొన్ని క్షేత్రాలు తత్త్వప్రధాన క్షేత్రాలు. ఇలా ఒక్కో క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.
కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూరు ఆరోగ్యప్రధాన క్షేత్రం. వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. వైద్యనాథ క్షేత్రం తమిళనాడులోని చిదంబరం సమీపంలో ఉంది. వైద్యనాథుడు అంటే ఎవరో ఆ క్షేత్రం పేరులోనే తెలుస్తోంది. శ్రీకాళహస్తీశ్వరుడంటే జ్ఞానప్రధానంగా కనబడతాడు. కాశీవిశ్వనాథుడు తత్త్వప్రధానక్షేత్రం. ఇలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రాధాన్యం కనబడుతోంది.
అలాగే శక్తి ఆలయాలలో, విష్ణ్వాలయాలలో, కూడా ప్రత్యేకత కనిపిస్తోంది. దేవతలలో కూడా సౌమ్య, తీవ్ర అనే రెండు తత్త్వాలు కలిగిన దేవతా ప్రకృతుల్ని చూస్తూ ఉంటాం. కాళీ, చండీ, భైరవి అని పేర్లు వింటూనే తీవ్ర ప్రకృతి స్ఫురిస్తుంది. గౌరీ, లక్ష్మీ, కాత్యాయనీ, సరస్వతీ అనగానే సౌమ్య ప్రకృతి కనబడుతుంది.
శివుని రూపాలలో కూడా వీరభద్ర, భైరవ, శరభ మొదలైన మాటలు వినగానే ఉగ్రమూర్తులు గోచరిస్తారు. పార్వతీసమేతంగా ఉన్నవాదు, నటరాజ స్వామి, కైలాసపతి అనగానే ప్రశాంతంగా తన కుటుంబంతో సహా భావనలోకి వస్తాడు. తపస్సులో ఉన్న శివరూపం, దక్షిణామూర్తిరూపం అని చెప్పినప్పుడు కేవల జ్ఞానప్రధానంగా కనిపిస్తాడు.
భగవంతుడు ఒకడే అయినప్పటికీ అనేక రకాలు అలవాటైన మన చిత్తవృత్తికి అనేకాలుగా కనబడుతూ తాను ఏకమని చెప్పడంకోసం ఆయన అన్నివిధాలుగా తనని తాను ప్రకటించుకున్నాడు. దేవతా మూర్తులలో ఎలాగైతే భేదాలు ఉంటాయో క్షేత్రాలలో కూడా భేదాలు ఉంటాయి.
భగవంతుని అనుగ్రహం వల్ల క్షేత్రం ఏర్పడుతుంది. శాస్త్రం ప్రకారంగా తత్త్వదృష్టితో చూస్తే భగవంతుడు, క్షేత్రం కానిది లేదు. కానీ అది పొందేవరకూ మనకి అంతటా భగవంతుని చూడగలిగే శక్తి లేదు గనుక విశ్వమంతా భగవంతుని క్షేత్రమైనప్పటికీ తాను తనని ప్రకటించుకొనే కొన్నిచోట్లు ప్రత్యేకించి ఉంటాయి. వాటిని ‘వ్యక్తమయ్యే చోటు’ అంటుంటారు.
అవ్యక్తంగా అంతటా ఉన్నప్పటికీ కొన్ని క్షేత్రముల యందు తనని తాను వ్యక్తపరచుకుంటూ ఉంటాడు. దీన్నే ఇంగ్లీషులో మేనిఫెస్టేషన్ అంటారు. అన్ మేనిఫెస్టెడ్ ఫారమ్ అంటే వ్యక్తంగాని కేవల స్వరూపంతో ఆయన సర్వవ్యాపకుడే. ఆయన కానిది ప్రపంచంలో ఏముంది?
అలాంటిది కొన్ని క్షేత్రాలలో తనని తాను ప్రకటించుకొన్నప్పుడు అక్కడికి వెళ్ళిన మనం ధన్యులం అవుతాం.
క్షేత్రం ఆవిర్భవించడానికి ప్రధాన కారణాలు రెండు. ఒక మహాతపస్వి లేదా కొందరు మహర్షులు లేదా కొందరు దేవతలు ఒక మహాప్రయోజనం కోసం అక్కడ భగవత్ స్వరూపాన్ని ఉపాసిస్తారు. కఠోరమైన తపస్సుని ఆచరిస్తారు. వారు బహుకాలం చేసిన తపస్సుకి సంతోషించి వారు ఏ భావంతో భగవానుని ఆరాధించారో ఆ భావంతో ఆయన వ్యక్తమై వారిని అనుగ్రహిస్తాడు. అప్పుడు వారు ఎక్కడ తపస్సు చేశారో అక్కడ రెండు శక్తులు ప్రోది చేసుకుంటాయి.
ఒకటి అంతవరకూ వారు చేసిన తపస్సుయొక్క శక్తి, రెండవది వారి ముందు ప్రత్యక్షమై అనుగ్రహించిన భగవంతుని యొక్క శక్తి. ఈ రెండు అక్కడ కేంద్రీకరింపబడి ఉంటాయి. తరువాత వారి తపస్సు పూర్తవుతుంది. భగవంతుని అనుగ్రహం వారికి లభిస్తుంది. కానీ వారిద్దరి శక్తి అక్కడ మిగిలిపోతుంది. అలా ఋషుల/దేవతల/భక్తుల యొక్క తపశ్శక్తి, ఆవిర్భవించిన భగవానుని శక్తి – ఈ రెండు శక్తులు కేంద్రీకృతమై ఉన్న ఆ చోటు క్షేత్రం అవుతుంది. తపశ్శక్తి, దైవశక్తి కలిసిన చోటు పేరు క్షేత్రం. అటువంటి క్షేత్రానికి వెడితే ఆ తపశ్శక్తి ప్రభావం చేత, ఆ దైవానుగ్రహప్రభావం చేత ముందు మామూలుగా వెడితే మనలో ఉన్న పాపసంస్కారాలు తొలగుతాయి. పాపసంస్కారాలు తొలగితే చిత్తం శుద్ధమై మంచి సంస్కారాలు, వాసనలు వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడ వాసనలు అంటే శాస్త్రీయమైన అర్థం – అనేక జన్మల నుండి చిత్తానికి పట్టిన కర్మానుభవాలు. కొంచెం క్షేత్రం గురించి తెలుసుకొని భక్తిశ్రద్ధలతో వెళ్తే అది కేవలం పాపనాశనానికి మాత్రమే కాకుండా ఈశ్వరానుగ్రహం మరింత అందుకోవడానికి, క్రమంగా మనలోని ఐహిక, ఆముష్మిక ఫలాలు మాత్రమే కాకుండా చిత్తశుద్ధి, వివేకవైరాగ్యాలు, విచారణ, జ్ఞానం, వైపుకి కూడా పరిణమించదానికి అవకాశం ఉంది. ఇది వారియొక్క సాధనా తీవ్రతని బట్టి కనిపిస్తూ ఉంటుంది.
క్షేత్రానికి ఎవరు ఏ ఉద్దేశంతో వెళ్తారో వారికి తగ్గ ఫలితం ఇస్తుంది. మామూలుగా నిత్యజీవితంలో కూడా ఎవరు ఏ ఉద్దేశంతో ఎక్కడికి వెళ్తారో అదే పొందుతారనేది అనుభవమే.
అక్కడే ఒక అద్భుతం ఉంటుంది. కానీ దానిని పట్టించుకోకుండా మరొక ప్రయోజనం కోసం వెళ్తూ ఉంటారు. అలాగే వెళ్ళే సాధకుడు ఒక అవగాహన పొంది, ఆ క్షేత్రానికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ క్షేత్రం యొక్క శక్తి వారు పొందగలరు.
కాబట్టి క్షేత్రాల యొక్క ప్రత్యేకతని, ప్రశస్తిని చెప్పుకోబోతున్నాం.
ఈ ప్రశస్తి తెలుసుకోవడం వల్ల క్షేత్రంపై శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధ వల్ల ఆ క్షేత్రం గొప్పది. దానివల్ల నేను తరిస్తాను అనే భావం ఏర్పడుతుంది. అలాంటి భావంతో, శ్రద్ధతో సేవిస్తే తప్పకుండా దేవత సంతోషిస్తుంది. దేవతానుగ్రహానికి హేతువు శ్రద్ధ మాత్రమే. అలాంటి శ్రద్ధని ఉత్పాదనం చేయడం కోసమే శాస్త్రాన్ని తెలుసుకోవడం. అందువల్ల ఆ క్షేత్రం అంత గొప్పదా! అదేదో సామాన్యమైన ఒక భూభాగం అనుకున్నాను. దానిని ఇంత మహిమ ఉందా! అనే ఒక భావం కలుగుతుంది. మెరిసే రాయి ఒకదాన్ని తీసుకుంటే అది మన దృష్టిలో రంగురాయి. అదే రత్నశాస్త్ర పరీక్షకుడైతే అది మామూలు రాయి కాదు, దాని విలువ చాలా గొప్పదని చెప్తాడు.
అతను చెప్పిన తరువాత అంతవరకూ మన చేతిలో పెట్టుకున్న రాయే మనకి మరింత విశేషంగా కనబడుతుంది. దాని అసలు విలువ తెలిశాక దానిపై మనకి ఉన్న అనుబంధం గాని, దానితో మనం పొందగలిగే ఫలితాలు గాని అధికంగానే ఉంటాయి.
అదేవిధంగా ఆ క్షేత్రాలు ఇలాంటి రత్నాలు వంటివి. అవి మామూలు భూఖండములు కావు అని మనం చెప్పడానికి శాస్త్రాలు ప్రమాణంగా తీసుకుంటున్నాం. అలాంటి శాస్రప్రమాణంతో పంచభూతలింగ క్షేత్రమహాత్మ్యాన్ని చెప్పుకోబోతున్నాం.
పంచభూతలింగ క్షేత్రాలు అంటే అయిదేనా? పంచభూత లింగాలు లేదా పంచభూతాలు కలిపితే ఒకే క్షేత్రం. ఆ క్షేత్రంలో ఎవరు లీనమైయున్నాడో అతనిని తెలుసుకోగలిగితే పంచభూతలింగాలను దర్శించినట్లే. ముందు లింగం అనే శబ్దం గురించి తెలుసుకొని తరువాత పంచభూతలింగాల గురించి తెలుసుకుందాం.
Ramodantam - one of our most popular courses, is open for registration. A 'must' For those of you who have a basic knowledge of Samskrtam, but would like to develop it further.
The Ramodantam is a beautiful work which summarizes the entire Valmiki Ramayanam in 200 verses, these verses are written in very simple. easy to understand very poetic verses. We were made to recite the entire work when we were in school.
The course is taught by a fabulous teacher Smt. Visalakshi Sankaran. The course includes references to Amarakosa in every shloka, so you can fully understand each word. The cost is only Rs. 2,000.
30 videos Link to join - https://t.co/NXjpWMLOTM……………………………
A unique opportunity awaits āstikas to delve into the profound teachings of the Prakarana Grantha – Prabodhasudhakara. During Navaratri at Sringeri, one may benefit from insightful discourses by young scholars deeply rooted in traditional wisdom.
Further details & registration: https://t.co/2dGaTyzZaZ
*-*-*
Follow us on Telegram: https://t.co/oKi6KRJd0B
#Spirituality #SanatanaDharma #Shankaracharya #Sringeri #Vedanta #Philosophy #Advaita
"In the Mahabharatha, when Drona sought help from Drupada, the latter insulted him. So, after training the Kauravas and the Pandavas, Drona got Arjuna to capture Drupada and took possession of half of Drupada's kingdom. Drupada, for his part, performed a sacrifice and obtained a son who would slay Drona. Dhristadyumna killed Drona during the Mahabharatha war when the latter lay down arms on being told by Yudhishthira that Ashwatthama had died. Later, Ashwatthama avenged his father's death by slaying Dhristadyumna. What a chain of reactions!"
From the book Edifying Parables – A compilation drawn from public discourses and personal conversations of Jagadguru Sri Abhinava Vidyatheertha Mahaswamiji. https://t.co/vYZALtXncp
*-*-*
Join our Official WhatsApp Channel: https://t.co/UQh64hvab5
#Spirituality #SanatanaDharma #Shankaracharya #Devotion #Aradhana #JyeshtaMahasannidhanam #Sringeri
Jagadguru Shankaracharya Sri Sri Bharati Tirtha Mahaswamiji on What constitutes True Worship:
Worshipping Ishwara with devotion is the greatest virtue. The word 'devotion' in the above statement is very significant. Our worship should not be for the sake of showing others that we are devoted. It must be remembered that we engage ourselves in divine worship in our interest alone. Generally, people are concerned with publicity whenever they perform any noble deed. This is not the right attitude. One must be satisfied that Ishwara knows what one has done and must not long for publicity. Some are very keen on the Sankalpa portion of any Puja. Prayers for the fulfilment of many of their desires find a place in the Sankalpa. Is that necessary? Does Ishwara not know what we require? Do we not believe that He is the all-knowing One? However, some are not content with this and they pester their Purohits (priests) to add more words to the Sankalpa to cover all their longings! All of this is unnecessary, as Ishwara knows what is best for us. If He is pleased with us, there is nothing else to be accomplished by us. Kuchela, when he approached Bhagawan Krishna, did not express any of his needs. He merely offered a handful of puffed rice to the Bhagawan, with the sole intention of pleasing Him. Bhagawan consumed it with love- Kuchela turned into Kubera in a trice. Does this incident not provide proof for our belief that nothing needs to be asked of Ishwara? Hence, all our good deeds must be aimed at pleasing Ishwara and not at getting publicity. That is why Sri Bheeshma said, "If you chant the names of the Bhagawan with devotion, that itself is a great deed." Even if we were to spend ten minutes chanting the names of Bhagawan with devotion, that would amount to a great virtuous deed. Some allow their minds to wander in all directions when they perform their Puja or Sandhyavandanam. "I have to receive such-and-such an amount from this person; I have to file a case against that person" Such are the kinds of thoughts entertained by some during worship. This is not correct. When you sit for Puja, however brief it may be, set aside all worldly thoughts and focus solely on Ishwara, even if it's just for those ten minutes. - From the book Inspiring Saint published by Sri Vidyatheertha Foundation Chennai
📢Vedanta Retreat Registration: (Bengaluru-Chennai-Mysuru-Hyderabad-Sringeri): https://t.co/OjZWpmc5Mg
Join our WhatsApp Channel (content differs): https://t.co/5a7WIiFthA
#vedanta #Shankaracharyas #sanatandharma #sringeri #shringeri #Jagadguru #Sadhguru #Guru #Hinduism #spirituality #philosophy #Bhakthi #advaita #philosophy
My brother Mohan Nagaswamy is in the process of digitizing this path breaking book "Mirror of Tamil and Sanskrit" (#MOTS) authored by our father Dr. #Nagaswamy. We will make the PDF/EPUB available soon in our website 🙏.
Reflect, rectify, and revive! The transformation begins within each of us - Golden words from an Anugraha Bhashanam by Jagadguru Sri Sri Bharati Tirtha Mahaswamiji made 30 years ago which needs to be framed in all houses!
"Old values have changed; virtue is being abandoned; good religious practices are neglected. Often people ask me for a way out from this mess. They do not realise that this mess is the creation of the parents, who are primarily responsible for neglecting to shape their offspring at a very young age. If there is proper initiation, there is no possibility of those young ones going astray later. The tradition of initiating the child's education with ओं, न, मः, शि, वा, यः has been devised by our fore-fathers with a view to inculcate faith in God even at that tender age. What a magnificent device to inject God and virtue into our lives! What advanced culture! When the child assimilates such noble culture, he will never deviate from that path. courtesy ahambrahmaasmi. org
In the name of modernity, these practices are being discarded by today's parents and the disastrous consequences are there, for all to see. If the child is not introduced to good manners, faith in God and practice of Dharma, his course of life takes an improper turn and enters into an improper environment. That is why, just recall how much foresight our ancient seers had, to lay down that the child's education should commence with "Om Namah Shivaya". We often praise them, but do not honour them by following the precepts handed down to us by them. We do not introspect and realise our mistakes. We preach but do not practice. This is the bane of our society. Everyone lectures but does not himself practice. Everyone cries "Sanatana Dharma is on the decline," and repeats it endlessly, but does not stop, to have an introspection into his own conduct. He, who does not set an example himself, but goes on blaming others for the decline of dharma, is the greatest enemy of Dharma. If everyone were to perform his own duty to protect, preserve and practice Dharma, how can there be any decline of that Dharma? Everyone should search his own heart. He need not offer any explanation to anybody. If he realises his own failure, that is the greatest service he can do to God. Let everyone question his conscience, whether I am doing the right things or not. If "yes" it is O.K., otherwise, correct yourself. You need not offer an explanation to anyone.
प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः ।
किं नु मे पशुभिस्तुल्यं किं नु सत्पुरुषैरिति ॥
Everyone should perform this acid test of verifying and convincing his own conscience. He should not rest till his conscience assures him that he is on the right path. This is so because no one can lie to his own self. No one will act against his conscience if he is truthful. Even the worst offender is warned by his conscience, about his wrong-doing. It is said, therefore, that if a man is virtuous and of dharmic character, he need not perform holy pilgrimages or do penance. The Dharmic path leads one to salvation. Nothing else needs to be done. यमो वैवस्वतो देवो यस्तवैष हृदि स्थितः ।
तेन चेदविवादस्ते मा गङ्गां मा कुरून्गमः ।
If you are able to convince that your are virtuous, you need not go for a bath in the Ganga or put a lakh of rupees in the Hundi of Lord Venkateswara. But the crux of the problem is you are not clear to your conscience and to suppress that, you are searching for escape routes, like a bath in the River Ganga etc. Better set right your conduct, lead a virtuous life, a life of dharma, and do not cheat your own conscience. Then your living will become glorious.
#sanatandharma #Sanatanadharma #Hinduism #Practical #spirituality #Sringeri #Shankaracharya #vedanta #Dharma
A senior mask maker of Majuli-a vaishnav island, demonstrating hasta mudras. This particular chatra was established in 1660's , was kept active ever since. Mask making needs awareness of diverse skill sets like dance , iconography etc.
It is known that one can achieve success in any endeavor only with proper thoughts. The Shastras state that Ishwara graces a person by inducing appropriate thoughts in his or her mind. Hence it is essential to earn the grace of Ishwara. - Sri Sri Bharati Tirtha Mahaswamigal