హైదరాబాద్లో నేడు కనిపిస్తున్న అద్దాల మేడల వెనుక సెంట్రింగ్ కార్మికుల చెమట, కష్టం ఎంతో ఉంది. అటువంటి సెంట్రింగ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తక్షణమే వారిని చర్చలకు పిలిచి, వారి సమస్యలను పరిష్కరించాలి.
ఇందిరాపార్క్ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి మద్దతునిచ్చిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
🔹సెంట్రింగ్ కార్మికులతో సాయంత్రం లోపు చర్చలు జరపాలి
🔹రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే వాళ్లతో పాటు నేను ధర్నాలో కూర్చుంట
🔹గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆగమావుతున్నాయి
🔹అందుకే గుంపు మేస్త్రీ హఠావో....తెలంగాణ బచావో అంటున్నా
🔹సెంట్రింగ్ కార్మికుల డిమాండ్లను పట్టించుకోకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టటం ఖాయం
🔹ఇందిరాపార్క్ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలిపిన కవిత
ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ..
🔹హైదరాబాద్ లో అద్దాల మేడలు కనిపిస్తున్నాయంటే దానిలో సెంట్రింగ్ కార్మికుల కృషి ఎంతో ఉంది.
🔹తాళ్లు కట్టుకొని ప్రాణాలు పణంగా పెట్టి గాలిలో వేలాడుతూ మీరు పనిచేస్తున్నారు.
🔹సెంట్రింగ్ కార్మికులు లేకుంటే అద్దాల మేడాలు ఉండవు కానీ బిల్డింగ్ లు నిర్మించే అగ్రిమెంట్ లో మాత్రం మీ పేరు పెట్టటం లేదు.
🔹2 లక్షల రూపాయల పనికోసం మీరు వెళ్తున్నప్పటికీ మీతో పాటు 15 లక్షల రూపాయల మెటీరియల్ తీసుకెళ్తున్నారు.
🔹కానీ మీ మెటీరియల్ కు కనీసం రక్షణ లేని పరిస్థితి ఉంది.
🔹ఈ గుంపు మేస్త్రీ వచ్చాక తెలంగాణ అందరి పరిస్థితి ఆగమవుతోంది.
🔹అందుకే గుంపు మేస్త్రీ హఠావో...తెలంగాణ బచావో అంటున్నా.
🔹హైడ్రా వచ్చిన తర్వాత నోటీసులు లేకుండా ఇళ్లు కూలగొడుతున్నారు.
🔹దీంతో సెంట్రింగ్ పనిచేస్తున్న మీకు ఆ ఇళ్లు కూల్చే సమయంలో మీ మెటీరియల్ నష్టపోతున్నారు.
🔹దీనికి ఇంటి యాజమాని గానీ ప్రభుత్వం గానీ మీకు పరిహారం ఇవ్వటం లేదు.
🔹86 చోట్ల సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు పదిరోజులుగా పని బంద్ చేశారు.
🔹కానీ మీ దగ్గర ఉన్న కూలీలను మీరు సాధుతున్నారు.
🔹మీరు చూపిస్తున్న మానవత్వాన్ని ఈ ప్రభుత్వం కూడా చూపించాలి.
🔹మీరు చూపించే మానవత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా.
🔹ఈ సాయంత్రం వరకు సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవాలి.
🔹వాళ్లు అడుగుతున్న వాటిలో గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు.
🔹12 అంశాలతో చాలా చిన్న విషయాలే అడుగుతున్నారు.
🔹వారికి ఈఎస్ఐ కార్డులు, స్క్వేర్ మీటర్ కు 51 రూపాయలు, కార్మికులు చనిపోతే ఇచ్చే డబ్బులు పది నుంచి 20 లక్షలు అడుగుతున్నారు.
🔹వాళ్లు అడిగే అన్ని డిమాండ్లు కూడా సహేతుకమైనవే. వాటికి మేము మద్దతు తెలుపుతున్నాం.
🔹ఇప్పుడు మేస్త్రీలు స్వ్కేర్ ఫీట్ కు 4 వందలు అడుగుతున్నారని చెబుతున్నారు.
🔹దానిలో సెంట్రింగ్ కార్మికుల వాటా ఎంతో కూడా చెప్పాలి?
🔹మేస్త్రీలో చేతిలో ఎట్టి పరిస్థితుల్లో మీ జుట్టు ఉండకూడదు.
🔹తెలంగాణ రక్షణసేన అధికారంలో వచ్చిన తర్వాత మీ అన్నిడిమాండ్లను తీరుస్తాం.
🔹186 చోట్ల వెయ్యి నుంచి 2 వేల గజాల స్థలం మీకు ఇస్తాం.
🔹ప్రతి మండలంలో సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉంది.
🔹హైదరాబాద్ నిర్మాణంలో మీరు పాత్ర కీలకం. మీ అడుగులో అడుగునవుతా...
🔹రెండు రోజుల్లో మీ సమస్యలతో పరిష్కారం చూపకపోతే నేను కూడా మీతో పాటు వచ్చి ధర్నాలో కూర్చుంటా..
🔹ఎన్ని రోజులైనా సరే మీ సమస్య తీరే వరకు ప్రభుత్వం ఒత్తిడి పెంచుతా...
🔹సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోకపోతే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చివాత పెడతారు.
#TRS
మాజీ మంత్రి, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎల్. రమణ గారి కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు.
చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలి
ప్రాచీన చారిత్రక వారసత్వ సంపద అయిన బొమ్మలమ్మగుట్టను జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు సందర్శించాను
ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్నుబడింది.. తమ సొంత ఖజానా నింపుకోవడానికి చారిత్రాక గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు.. భవిష్యత్ తరాల కోసం బొమ్మలమ్మగుట్టను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది
బొమ్మలమ్మగుట్టను రక్షించుకోవడానికి చేసే ఉద్యమంలో తెలంగాణ జాగృతి ముందువరుసలో ఉంటుందని మాట ఇస్తున్నాను
కానుకుర్తి గ్రామంలో కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం
తమ సమస్యలను ఎమ్మెల్సీ కవితకు వివరించిన భూనిర్వాసితులు
భూనిర్వాసితుల డిమాండ్లకు సంపూర్ణ మద్ధతిచ్చిన ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ...
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కనపెట్టారు
కేసీఆర్ దిగిపోయే నాటికి 95 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి
ఏనుగెళ్లింది తోకచిక్కిందన్నట్లు పరిస్థితి తయారైంది
పాలమూరు బిడ్డ అని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరిస్తున్నారు
ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ యే గుర్తుకొస్తారన్న ఉద్ధేశంతో రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనులు పక్కనబెట్టారు
పాలమూరు రంగారెడ్డిలో భాగంగా కరివేన ప్యాకేజీని రద్దు చేసి కొత్తగా కొడంగల్ లిఫ్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడుతున్నారు
దాంతో కొడంగల్, నారాయణపేటలో 1.8 లక్షల ఎకరాల ఆయకట్టు నుంచి లక్ష ఎకరాలకు తగ్గింది
వాస్తవానికి కొడంగల్ ప్రాజెక్టుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోవాల్సింది భూత్పూర్ లింక్ కు ముడిపెట్టారు
బీమా ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుంటే మక్తల్ ప్రాంతానికి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది
కొడంగల్ ప్రాజెక్టు వల్ల మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతున్నది తప్ప లాభం జరగడం లేదు
రూ 2900 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసింది
ఒక స్పూన్ మట్టి కూడా తీయకుండానే, పనులు మొదలుకాకుండానే ప్రాజెక్టు వ్యయం రూ 4500 కోట్లకు పెరిగింది
అంచనా వ్యయం రూ 1500 ఎందుకు పెరిగింది ? ఎవరి కోసం పెరిగింది ?
ఆ పెరిగిన రూ 1500 కోట్లు పెద్ద వాళ్ల చేతికి వెళ్తున్నాయి
తట్ట మట్టి తీయకున్నా ఇద్దరు కాంట్రాక్టర్లకు ముందే రూ 600 కోట్ల చొప్పున అడ్వాన్స్ ఇచ్చారు
అడ్వాన్స్ ఇచ్చి ఏడాదిన్నర పూర్తయినా ఇంకా పనులు మొదలుకాలేదు
నిజంగా సీఎం పాలమూరు బిడ్డనే అయితే తక్షణమే పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయాలి
మరిన్ని ప్రాంతాలకు నీళ్లిందించే విధంగా కొడంగల్ ప్రాజెక్టును రూపకల్పన చేయాలి
భూనిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
భూమి విలువ ఎక్కువగా ఉన్నందున ఎకరానికి రూ 35 – 40 లక్షలు పరిహారం చెల్లించాలి
నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీలను నిర్మించడమే కాకుండా భూమి కోల్పోయే వారికి ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
సీఎం మాట అంటే జీవో లాంటింది... కానీ సీఎం ఎకరానికి 20 లక్షలు ఇస్తామంటే... రూ 14 లక్షలే ఇస్తామని అనడానికి అధికారికి ఎంత దమ్ముండాలి
ముఖ్యమంత్రి ఒక మాట... అధికారి ఒక మాట ఎలా చెబుతారు ?
ముఖ్యమంత్రి మాటకు విలువ ఉందా లేదా అన్నది ఆలోచించాలి
వరికి బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంది రైతులక ఎగవేసింది
రైతు రుణమాఫీ 60 శాతం మందికి ఇంకా రానేలేదు
@RaoKavitha@KTRBRS It is an honor to extend my deepest regards on this special day.
Happy Birthday to the most amazing person #KTR garu.!!💐🙏
Your leadership inspire us with your profound insights and thoughtful viewpoints.
I wish you a very delighted and joyous birthday
సింగరేణిలో మారు పేర్ల (అలియాస్ నేమ్స్) తో కార్మికులుగా పని చేసి డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు @RaoKavitha డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో సింగరేణి జాగృతి నాయకులు, అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారితో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, సంస్థలో 30 ఏళ్లకు పైగా సేవ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడం అన్యాయమన్నారు. తండ్రులు అలియాస్ నేమ్స్ తో పని చేస్తే వారసులకు రెండు ఇంటి పేర్లు ఉన్నాయనే కారణంతో ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని విజిలెన్స్ విభాగం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని అన్నారు. సింగరేణిలో అలియాస్ నేమ్స్ తో డిపెండెంట్ ఉద్యోగాల కోసం వందలాది మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. యాజమాన్యం మానవత దృక్పథంతో వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలు లేబర్ కమిషనర్ వద్ద చేసుకున్న ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు సింగరేణి జాగృతి నాయకులు సంస్థ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ సుభాని గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ములుగు జిల్లా రామానుజపురంలో
ఎరుకల కులస్తుల ఆరాధ్య దైవమైన నాంచారమ్మ జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆత్మీయ స్వాగతం పలికిన ఆదివాసీ ఎరుకల సంఘం సోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
నాంచారమ్మ ఆలయ నిర్మాణానికి మా వంతు సహకారం అందిస్తాం అని తెలియజేస్తున్నాను.
జై కుర్రు - జై జై కుర్రు
జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలు 50 మంది మాజీ మంత్రి @BRSHarish గారి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
జహీరాబాద్ న్యాలకల్ మండల్ రత్నపూర్ గ్రామం నుండి 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లో ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీశ్ రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీజేపీకి నుండి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీటీసీ దేశీటి పటేల్, రవి కుమార్, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు తుకారాం, భాస్వరం, సంగశీటి, సంజీవ్, అమృత్ బీఆర్ఎస్లో చేరారు. వారిని హరీష్ రావు గారు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ..
తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. తెలంగాణకు అన్యాయం తప్ప ఏం చేయలేదు.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.
బీఆర్ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు ను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది.
జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ.
సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోంది.
సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సాగు నీటితో సస్య శ్యామలం అవుతుంది.
బసవేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయడానికి బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
తాగు, సాగు నీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బీఆర్ఎస్ ఉన్నపుడు వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావడం లేదు.
పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్షం ప్రజలకు శాపంగా మారింది. ప్రజలకు కాంగ్రెస్ మోసం తెలిసిపోయింది.
మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం అవుతుంది.
From 1 voice to millions, from 1 dream to a revolution, 25 years of @BRSparty is the story of Telangana’s aspiration and pride!
Amazed and thankful for this historic outpour of love and support! The grand success of the BRS Silver Jubilee Rally is a mirror to Telangana’s heartbeat -with KCR garu, with BRS, today and in the future.
Jai Telangana ✊🏻 ✊🏻
Jai KCR ✊🏻 ✊🏻
The blood of our fellow countrymen was shed in Pahalgam and we will not stay silent. Innocent lives taken away in a heartless act of terror.
Today in Godavarikhani, we marched with fire in our hearts and purpose in our steps.
We condemn terror. We resist fear. We stand united—for India, for peace, for our martyrs and for justice.
India will not bow to terror.
హైదరాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్ లో జరిగిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి కూతురి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ @RaoKavitha
సిద్దిపేట జిల్లా, నాచారం గుట్టలోని ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన హనుమత్ మూల మంత్ర యజ్ఞంలో పాలుపంచుకోవడం, శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామిజీ వారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉంది.
తెలంగాణ ప్రజలందరిపై మహారుద్ర హనుమాన్ చల్లని చూపు ఎళ్లవేళలా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాను.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన సుహాసిని పూజలో (వాసవి మాత పూజ) పాల్గొన్న మాజీ మంత్రి @BRSHarish గారు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర నాయకులు.
ఖమ్మంలో తెలంగాణ జాగృతి నాయకురాలు గట్టు అరుణ గారి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరవడం జరిగింది. నూతన దంపతులు సాయి వివేక్ - పావని గార్లకు వివాహ శుభాకాంక్షలు.
• మనసు కదిలించింది... కన్నీటి పర్యంతం...!!
• తన్నీరు కళ్ళలో కన్నీరు.....!!
• చిన్నారి ఆవేదన మాటలకు చలించిన హరీష్ రావు గారు ....!!
• చిన్నారిని ఓదారుస్తూ కంటతడపెట్టిన హరీష్ రావు గారు ...!!
మాజీమంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు గారి ఆధ్వర్యంలో సిద్దిపేటలో విద్యార్థుల కోసం భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలన్న అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఓ చిన్నారి తన ఆవేదనను చెబుతూ అందరికీ కంటతడి పెట్టించింది.తండ్రి చనిపోయాడు తన బాధ్యతలన్నీ తల్లి ఎంతో కష్టపడి చూసుకుంటుందని చిన్నారి సాత్విక అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. దీంతో అక్కడే ఉన్న హరీష్ రావు చిన్నారిని అక్కున చేర్చుకుని ఆ అమ్మాయిని ఓదార్చడంతో పాటు కంటతడి పెట్టుకున్నారు. ఆవేదనకు లోను కావద్దని తాను అన్ని విధాల అండగా ఉంటానని చిన్నారి సాత్వికకు హరీష్ రావు గారు భరోసానిచ్చారు. కార్యక్రమం పూర్తయ్యేంతవరకు ఆ చిన్నారిని పక్కనే కూర్చోపెట్టుకొని ఎంతో మనోధైర్యాన్ని కల్పించారు