విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్న జీవీఎంసీ సహాయక చర్యలు
మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను శరవేగంగా సాగిస్తున్నారని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ ఐఎఎస్ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
విజయవాడ 64వ వార్డులో వరద ముంపు ప్రాంతాల్లో ఆహార పొట్లాలు, మంచినీరు పంపిణీ కార్యక్రమం నిర్వహణను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఉత్తర్వులు మేరకు విజయవాడ 64 వార్డులో గల కుందావారి కండ్రిక, ఎన్.ఎస్.సి బోస్ నగర్, బి.వి. సుబ్బారెడ్డి స్కూల్ ఏరియా, ప్రజాశక్తి నగర్, విద్యాసాగర్ ఎన్జీవోస్ కాలనీ, MIG యూ డి ఏ కాలనీ లలో పారిశుధ్య పనులను, వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్ ను జివీఎంసీ ఉద్యోగులతో పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు విజయవాడలో గల 20వ వార్డు నుండి 64వ వార్డు వరకు పలుచోట్ల పారిశుద్ధ్య పనులు నిర్వహణ, ప్రజలకు అందించే సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నారని, తనతో పాటు చైల్డ్ వెల్ఫేర్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా వరద ముంపు ప్రాంతాల్లో ఆహార పొట్లాలు, మంచినీరు పంపిణీ , పారి శుధ్య నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్నారని కమిషనర్ తెలిపారు.
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #ISupportEcoVizag
@AndhraPradeshCM@sampathpommala@SwachhBharatGov@SwachhaAndhra@SwachSurvekshan@swachhbharat@MoHUA_India@MoHFW_INDIA@pibvijayawada
अद्भुत!
@GVMC_VISAKHA में स्वच्छता व पर्यावरण संरक्षण सुनिश्चित करने के लिए Eco-Vizag कार्यक्रम के तहत 5 प्रमुख सिद्धांत पर काम सराहनीय है।
इसमें साउथ सुपरस्टार @TheDeverakonda का समर्थन कार्यक्रम में रंग भरने के साथ ही लोगों को जागरुक करने में सहायक है।
#SwachhSurvekshan2023