@NTVJustIn Enni acres varaki limit anedi cheppandi mundu !! Enduku 2acres varaku matramey icharu last term ? Rythu bharosa scheme ni flop chesaru present government dhini valla chala effect untadi next elections ki ...@TelanganaCMO@revanth_anumula
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్ కు ఏం సంబంధం...?
పవన్ ను హైదరాబాద్ లో తిరగనివ్వం... అన్ని కోట్లు పెట్టి అమరావతి కట్టుకుంటూ, హైదరాబాద్ లో ఎందుకు ఉండాలని ఎలా అంటారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో పురుడు పోసుకున్న జనసేనను అడ్డుకోగలరా... ఆర్కే సాగర్ ఘాటు రిప్లై!
#PawanKalyan #RKSagar #Janasena
2018-2023
హుజురాబాద్ దుబాకా మునుగోడు
మునుగోడు లో కమ్యూనిస్టులు తో పొత్తు
కెసిఆర్ సభలు.. 84 MLA లు, 16 మంత్రులు
శ్రమించారు
దుబాకా లో హరీష్ రావు ఒక నెల తిష్ట యేశాడు..
కెసిఆర్ మీటింగ్ జరిగింది.
హుజురాబాద్ కోసం దళిత బంధు ప్రవేశపెట్టారు
3 స్థానాలకు 400 కోట్లు ప్రత్యక మేనిఫెస్టోలు
30 ఏళ్ల నుంచి పులివెందుల జెడ్పీటీసీ ఏకగ్రీవం , అంటే ఎన్నికలు జరగకుండా వైఎస్సార్ ఫ్యామిలీ వాళ్ళు పెట్టిన మనిషే జెడ్పీటీసీ.
తొలిసారి ఎన్నికలు జరిగాయి నిన్న.. ఫలితం:
టిడిపి 6,718 ఓట్లు
వైసీపీ 683 ఓట్లు
డిపాజిట్ కోల్పోయిన వైసిపి
జగన్ సొంత ఊర్లో డిపాజిట్ పోవడం వైసిపి ని కుంగదీయడం ఖాయం
#PulivendulaZPTCElection
ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారు జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. @Rahulsipligunj గారికి ప్రభుత్వం ఇటీవల 1 కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.