ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు నేడు #Tirumala వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మన నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు 🙏🏻
సమర్థ పాలనకు బలమైన వ్యవస్థలే పునాది
కూటమి ప్రభుత్వం గ్రామీణ పాలనలో నెలకొల్పుతున్న సుపరిపాలనకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్‌లోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు.
ఈ విశిష్ట ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను, ఇందుకు అంకితభావంతో కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందించారు.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీల్లో సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, దివ్యాంగులకు అనుకూలమైన వసతులు, సమాచార బోర్డులు, రికార్డుల డిజిటలైజేషన్, శాస్త్రీయ డాక్యుమెంట్ నిర్వహణ, కార్యాలయ పరిశుభ్రత, ఆస్తుల సమర్థ నిర్వహణ, అగ్నిమాపక భద్రత, అంతర్గత ఆడిట్లు, సిబ్బందికి నిరంతర శిక్షణ, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
ISO 9001:2015 సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, గ్రామ పంచాయతీల్లో ప్రజాకేంద్రిత, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనకు ప్రపంచ స్థాయి ప్రమాణమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
ఈ 23 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు స్ఫూర్తిగా నిలిచి, ప్రతి గ్రామంలో మరింత నాణ్యమైన సేవలు, సమర్థవంతమైన పరిపాలన అందించే కొత్త ప్రమాణాలకు నాంది పలకాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
- గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
కాలినడకన వైద్యం కోసం గర్భిణీలను, వృద్ధులను డోలీలతో మోసుకువెళ్లే పరిస్థితి నుండి ఎన్నో గిరిజన గ్రామాలకు అంబులెన్సులు వెళ్ళే సౌకర్యం. గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దృఢ సంకల్పంతో డోలీ రహిత గిరిజన జీవనం లక్ష్యంగా అడవితల్లి బాట.
#AdaviThalliBaata#PawanKalyanAneNenu #PawanKalyanMarkGovernance
సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించదు
• 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం
• కార్యకర్తల ఆవేదన, ఆకాంక్షలు అర్థం చేసుకున్నాం
• క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం
• ఎన్డీఏ గెలుపే ధ్యేయంగా సమాయత్తమవుతాం
• సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కూర్చుని చర్చించుకుంటాయి
• జిల్లా, పార్లమెంట్ పరిధిలో సమన్వయ కమిటీలు
• తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan చేసిన ప్రకటనకు కట్టుబడి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపును దృష్టిలో ఉంచుకుని త్యాగాలు చేశామని, అదే ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తిస్తుందనుకోవడం పొరపాటని తెలిపారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం చెంచుపేటలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది. నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు తగిన అవకాశాలు కల్పించేలా పార్టీ కార్యాచరణ ఉంటుంది. అదే సమయంలో కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం కొనసాగిస్తాం. ప్రజల మేలు కోసం ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపెడుతూ వచ్చిన వార్తలు సరికావు.
క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆవేదనలను పార్టీ నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుంది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతాం.
*కూటమి సమన్వయం కోసం కమిటీలు*
రెండు రోజుల క్రితమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. కూటమిలో ఎక్కడైనా చిన్నచిన్న లోపాలు, సమన్వయ లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాం. పార్టీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించిన కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా మూడు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తాయి. ఇది భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బాధ్యత. అదే విధంగా ప్రతి జిల్లాలో సమన్వయం మరింత సమర్థవంతంగా ఉండేందుకు పార్లమెంట్, జిల్లా పరిధిలో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వంటి అంశాలపై భాగస్వామ్య పార్టీల మధ్య పరస్పర చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకుంటాయ”న్నారు.
పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, విస్తృత మొక్కల పెంపకం, గ్రీన్ సొసైటీల ఏర్పాటుతో పచ్చని ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం.
#PawanKalyanAneNenu#PawanKalyanMarkGovernance
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు
గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల విధ్వంసం జరిగినప్పుడు, తిరుమల లో కల్తీ నెయ్యి వినియోగం జరిగినప్పుడు, ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు కూడా ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JSPProtectsSanatanDharma
సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించదు
•2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం
•కార్యకర్తల ఆవేదన, ఆకాంక్షలు అర్థం చేసుకున్నాం
•క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం
•ఎన్డీఏ గెలుపే ధ్యేయంగా సమాయత్తమవుతాం
•సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కూర్చుని చర్చించుకుంటాయి.
కాలినడకన వైద్యం కోసం గర్భిణీలను, వృద్ధులను డోలీలతో మోసుకువెళ్లే పరిస్థితి నుండి ఎన్నో గిరిజన గ్రామాలకు అంబులెన్సులు వెళ్ళే సౌకర్యం. గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దృఢ సంకల్పంతో డోలీ రహిత గిరిజన జీవనం లక్ష్యంగా అడవితల్లి బాట.
#AdaviThalliBaata#PawanKalyanAneNenu
పలమనేరు సమీపంలో ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేస్తున్న అడవి ఏనుగు పట్టివేత
•ఏనుగును పట్టుకునేందుకు నెల రోజులపాటు ప్రత్యేక ఆపరేషన్
•ఆపరేషన్ కోసం అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సర్ కెమెరాల వినియోగం
•తుది అంకంలో పాల్గొన్న ఐదు కుంకీ ఏనుగులు, అటవీ సిబ్బంది, పశువైద్య నిపుణులు
•గతంలో అటవీ సెక్షన్ అధికారి శ్రీ సుకుమార్ పై దాడి చేసి గాయపర్చిన ఏనుగు
•గాయాల నుంచి కోలుకుని ఆపరేషన్ లో పాల్గొన్న శ్రీ సుకుమార్
•ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన అటవీ సిబ్బిందికి శ్రీ @PawanKalyan గారి అభినందనలు
•సెక్షన్ ఆఫీసర్ శ్రీ సుకుమార్ ధైర్యాన్ని మెచ్చుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు
•ఏనుగును కుంకీగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచన
గత కొంత కాలంగా పలమనేరు పరిసరాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తూ, సమీప గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ విజయవంతంగా బంధించింది. ఈ ఏనుగును బంధించేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది నెల రోజులకుపైగా చెమటోడ్చాల్సి వచ్చింది. సుమారు 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన ఈ ఏనుగును వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు లోబడి, పశు వైద్య నిపుణులు, అటవీశాఖ ఫీల్డ్ సిబ్బంది పర్యవేక్షణలో బంధించారు. బుధవారం నిర్వహించిన తుది ఆపరేషన్‌లో ముసలమడుగు క్యాంపు నుంచి వచ్చిన ఐదు కుంకీ ఏనుగులు కూడా పాల్గొని, ఏనుగుని బంధించడంలో కీలకపాత్ర పోషించాయి. గతంలో ఈ ఏనుగు దాడిలో గాయపడిన అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీ సుకుమార్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొనడం గమనార్హం. అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసిన పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సిబ్బందిని, అనంతపురం సర్కిల్ కన్జర్వేటర్ శ్రీమతి యశోదా బాయ్, చిత్తూరు జిల్లా అటవీ అధికారితో పాటు పశువైద్య నిపుణులు, ట్రాకర్లు, మహౌత్ లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. గతంలో ఏనుగు దాడిలో గాయపడినప్పటికీ, కోలుకుని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న శ్రీ సుకుమార్ ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ప్రజల భద్రత, వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అటవీశాఖ చేపట్టిన ఆపరేషన్ ను ప్రశంసించారు. పట్టుకున్న ఈ ఏనుగును ముసలమడుగు క్యాంపుకి తరలిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలుపగా, కుంకీగా శిక్షణ ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
ఈ ఏనుగు పలమనేరు సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ పదే పదే పంటలను ధ్వంసం చేయడంతోపాటు పరిసర గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. పలుమార్లు జనావాసాల మధ్యకు రాగా, గతంలో చేపట్టిన మళ్లింపు చర్యల్లో పలమనేరు అటవీ విభాగానికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ సుకుమార్ పై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. పంటలకు నష్టం కలిగించడం, ప్రజల భద్రత దృష్ట్యా ఈ ఒంటరి మగ ఏనుగును బంధించాల్సి వచ్చింది. అందుకోసం సుదీర్ఘకాలం ఏనుగు కదలికలను క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది, ట్రాకర్ల సాయంతో పర్యవేక్షించారు. అప్పట్లో అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసినా తర్వాత ఏనుగు ప్రవర్తనలో మార్పు రావడాన్ని గుర్తించారు. అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సార్ కెమెరాల సాయంతో నెల రోజులుగా ఏనుగు కదలికలను ట్రాక్ చేశారు. గతంలో ఏనుగు దాడి చేసిన సెక్షన్ లోనే జాతీయ రహదారికి సమీపంలో పట్టుకున్నారు.
వన్యప్రాణి నిర్వహణ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పీసీసీఎఫ్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఏనుగుకు మత్తుమందు ఇచ్చే ప్రక్రియను డాక్టర్ నవీన్, అరుణ్ లు సమన్వయం చేయగా, విశ్రాంత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ రఘునాథ్ ఆపరేషన్ అనంతర కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు. అనంత సర్కిల్ కన్జర్వేటర్ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షిస్తూ కీలక సూచనలు ఇచ్చారు.
ఉపముఖ్యమంత్రివర్యుల సూచన మేరకు పట్టుకున్న ఏనుగును ముసలమడుగు కుంకీ శిబిరానికి తరలించారు. అక్కడ పశువైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, ఏనుగు ప్రవర్తనను కొంతకాలం పర్యవేక్షిస్తారు. మనుషులతో మెలిగే అంశంలో సానుకూల దృక్పథం కనబరిస్తే ప్రత్యేక శిక్షణ ఇచ్చి కుంకీగా తీర్చిదిద్దుతారు.
#HANUMAN #AndhraPradesh
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామసభలు, పల్లెపండుగ, అడవితల్లిబాట వంటి కార్యక్రమాలతో, మునుపెన్నడూ లేనిరీతిలో ప్రగతి పథంలో గ్రామాలను నడిపిస్తూ, గ్రామ స్వరాజ్యం సాకారం దిశగా ఆంధ్రప్రదేశ్.
#PawanKalyanAneNenu#PawanKalyanMarkGovernance
Sri @PawanKalyan Garu has always stood with women, supporting their aspirations and working tirelessly for their empowerment and well-being.
#JSPStandsWithWomen
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు.
ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.
"A cleaner future is built not by a few extraordinary actions, but by millions of responsible choices."
I am delighted that Swachha Ratham has achieved the remarkable milestone of 1 crore dry waste collection transactions across Andhra Pradesh, bringing recyclable dry waste worth nearly ₹16 crore into the circular economy. This achievement reflects the growing environmental consciousness and collective commitment of our people towards a cleaner and more sustainable future.
My heartfelt appreciation to every Swachha Ratham Operator, Swachha Bandhu, Green Ambassador, Gram Panchayat, field functionary, and every citizen who has contributed to making this initiative a people's movement. Your dedication has demonstrated that sustainable development is achieved when governments and citizens work together with a shared sense of responsibility.
I extend my special congratulations to the 28 Swachha Ratham Operators, representing all districts, who were felicitated today for their outstanding service. Their commitment has inspired communities to embrace responsible waste management and environmental stewardship.
Swachha Ratham is not just a waste management initiative. It is a movement to transform behaviour, strengthen the circular economy, and inspire every household to become a partner in protecting nature. Together, let us continue this journey towards building a Swachh Andhra Pradesh and a Viksit Andhra Pradesh for future generations.
- @PawanKalyan
#SwachhaRatham #SwachhAndhraPradesh #WasteToWealth
ముంబయి ఆసుపత్రి నుంచి శ్రీ @PawanKalyan గారు డిశ్చార్జ్
•హైదరాబాద్ లోని నివాసానికి చేరుకోనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు
•వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ
ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యణ్ గారు కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న ఆయన డిశ్చార్జ్ అనంతరం నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారు. మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.
మహిళా భద్రత కోసం జనసేన.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడంతో పాటు, సమాజంలో చైతన్యం నింపి అలాంటి నేరాలు జరగకుండా నివారించేందుకు జనసేన పార్టీ మొదటి నుండి కృషి చేస్తుంది.
#JSPStandsWithWomen