రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ -సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. రేపటి నా విశాఖ పర్యటనలో నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలిసి రావాలని కోరుతున్నాను.
#WorldEnvironmentDay
#PsychoFekuJagan
వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఒక బూటకం.
ఆ పరీక్ష నేను కూడా రాశాను. ఇప్పటికీ నాకు వచ్చిన ర్యాంక్ ఏంటో తెలియదు. నాకే కాదు, ఆ పరీక్ష రాసిన చాలా మందికి తమ ర్యాంకులు ఏమిటో తెలియదు. ర్యాంక్ లిస్ట్ లేదు, మెరిట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్ట్ లేదు... ఏదీ అధికారికంగా విడుదల చేయలేదు. కావాల్సిన వారికి మాత్రం నేరుగా మెసేజ్‌లు పంపించి ఉద్యోగాలు ఇచ్చారు.
జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా... ఇది మీరు నిర్వహించిన నియామక విధానం.
ఈ రోజు కూటమి ప్రభుత్వం డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తే, అదే యువతపై విషం చిమ్ముతారా? పారదర్శకంగా జరిగిన నియామకాలపై కూడా దుష్ప్రచారం చేయడం సరికాదని గుర్తించాలి.
#YCPFakeBrathuku
#AndhraPradesh
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియని నీకు..
BRIDGE అనే ఆటకు, పేకాటకు ఏమి తేడా తెలుస్తుందిలే @ysjagan?
గొడ్డలి పార్టీకి నరకడం, చంపడం, వేట్లు వేయడం బాగా తెలుసు. కానీ ఉద్యోగాల గురించి, నోటిఫికేషన్ల గురించి అర్థం చేసుకునే బుర్రలు ఎక్కడ ఉన్నాయి? జగన్‌కు మించిన కోడి బుర్ర పేర్ని నాని లాంటి వారిదే.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయించినవి కావు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఈ జాబితాను రూపొందించారు.
2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం క్రీడా విభాగాలను Category-A, Category-Bగా విభజించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఈ క్రమంలోనే 'బ్రిడ్జ్' ఆటను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారిక 'మైండ్ స్పోర్ట్' (Mind Sport)గా గుర్తించింది. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.
అయితే గొడ్డలి పార్టీకి మాత్రం BRIDGE అంటే వాళ్ల ఇళ్లలో ఆడుకునే పేకాట అనే కోడి బుర్ర మైండ్‌సెట్ ఉంది. డీఎస్సీ ద్వారా ఎంపికైన 16 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువతను జగన్ రెడ్డి ఇలా హేళన చేస్తున్నాడు.
#PsychoFekuJagan
#YCPFakeBrathuku
#AndhraPradesh
#QuantumRevolutionInAP
At Amaravati, we are building the foundations of a future-ready innovation ecosystem. By bringing together academia, industry, startups and government, Andhra Pradesh aims to position India at the forefront of the quantum revolution. Grateful to @livemint for this deep dive into Andhra Pradesh’s Quantum Valley initiative.
https://t.co/Oklu2eFKoO
డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.
నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.
మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.
కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.
#NaraLokesh
#AndhraPradesh
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను అందించాను. శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నాను. సింహాచలం కోరినట్లుగా ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించి... వారు తీసిన తాజా కల్లును రుచిచూశాను.
#PensionsPandugalnAP
"ప్రజలలో అభద్రతా భావాన్ని కలిగించడానికి, శాంతి భద్రతలను భగ్నం చేయడానికి జగన్ రకరకాల కుట్రలు చేస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాది గొడ్డలి పార్టీయే అని చెప్పుకుంటున్నారు. కత్తులు, కటార్లతో వస్తారంట. ఇక్కడున్నది సీబీఎన్. గుర్తుపెట్టుకోండి."
- గొడ్డలి పార్టీ రౌడీగాళ్లకు చంద్రబాబు గారి స్ట్రాంగ్ వార్నింగ్.
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇది ఒక కీలక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు.
@narendramodi@AshwiniVaishnaw
దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాలు ప్రత్యేక విభాగాలుగా ఉంటాయి.
కానీ గొడ్డలి పార్టీకి మాత్రం —
▪️ గంజాయి బ్యాచ్
▪️ బ్లేడ్ బ్యాచ్
▪️ సోషల్ మీడియా సైకో బ్యాచ్
▪️ ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్
▪️ హత్యా రాజకీయాల కిరాయి ముఠా బ్యాచ్
▪️ దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్
▪️ కల్తీ లిక్కర్ బ్యాచ్
ఇలా ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసే రాజకీయాలకే పరిమితమైంది.
ప్రజలకు అభివృద్ధి చూపించలేని వారు… అశాంతి, అబద్ధాలు, అరాచకాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు.
#GoddaliParty
#PsychoFekuJagan
#EndOfYCP
#Andhrapradesh
#Mahanadu2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించింది.
#SthreeShakti
నేను డీఎస్సీ కోసం ఎదురు చూసిన నిరుద్యోగిని... @ysjagan గారికి నా ప్రశ్నలు
ఒక ఉద్యోగం కోసం ఎంతకాలం ఎదురు చూడాలో నిరుద్యోగులకే తెలుసు. ఒక నోటిఫికేషన్ వస్తుందేమో అని ప్రతి రోజు పేపర్ చూస్తూ, ప్రతి బడ్జెట్లో ఆశలు పెట్టుకుని, ప్రతి ఎన్నికల్లో హామీలు వింటూ గడిపిన సంవత్సరాలు మావి.
నేను కూడా అలాంటి వేలాది మంది యువతలో ఒకడిని. టీచర్ కావాలనేది నా కల. మా కుటుంబం ఆశ. కానీ గత ఐదేళ్లు ఆ కల కేవలం కలగానే మిగిలిపోయింది.
2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగ యువత ఎంతో ఆశ పెట్టుకుంది జగన్ గారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ వస్తుందని, డీఎస్సీలు జరుగుతాయని, ఖాళీలు భర్తీ అవుతాయని నమ్మింది. కానీ జరిగినది ఏమిటి?
ఐదేళ్లలో ఒక్క మెగా డీఎస్సీ కూడా లేదు.
లక్షలాది మంది యువత వయసు పెరిగింది. కొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. కొందరు కుటుంబ బాధ్యతలతో పరీక్షలకే దూరమయ్యారు. మరికొందరు ఆశలు కోల్పోయారు.
అప్పుడు మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడని మీరు... ఇప్పుడు 16,347 పోస్టులతో జరిగిన మెగా డీఎస్సీపై ఏడాది తర్వాత అకస్మాత్తుగా కన్నీళ్లు కార్చడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
నిజంగా మీకు యువతపై ప్రేమ ఉంటే ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?
ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. నా లాంటి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. మా కుటుంబాల్లో ఆనందం వచ్చింది. మా తల్లిదండ్రుల కష్టాలకు ఫలితం దక్కింది. కానీ ఆ ఆనందం కూడా మీకు ఇబ్బందిగా కనిపిస్తున్నట్టు ఉంది.
మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే కేసుల మీద కేసులు వేశారు. కోర్టులకు వెళ్లారు. ప్రక్రియ ఆగిపోవాలని ప్రయత్నించారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు విడుదల చేసింది. మెరిట్ లిస్టులు పెట్టింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసింది. చివరకు నియామకాలు పూర్తిచేసింది.
ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాక, శిక్షణలు పూర్తయ్యాక, పాఠశాలల్లో చేరాక మళ్లీ కొత్త కథలు మొదలుపెట్టడం ఎందుకు?
మీ ఆరోపణలు నిజమైతే ఒక అభ్యర్థి అయినా ముందుకు వచ్చి "నేను డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాను" అని చెప్పాడా?
ఒక్క నియామకం అయినా అక్రమమని నిరూపించగలిగారా?
ఒక్క అభ్యర్థి అయినా రాజకీయ సిఫారసుతో ఉద్యోగం పొందాడని ఆధారాలు చూపించగలిగారా?
లేకపోతే ఇవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలే కాదా?
ఇంకా విచిత్రం ఏమిటంటే... డీఎస్సీ గురించి మాట్లాడుతున్న మీ పార్టీకి గతంలో డీఎస్సీ అవినీతి ఆరోపణల చరిత్ర ఉంది. ఓఎంఆర్ షీట్లు మార్చారని, డబ్బులు తీసుకుని మార్కులు పెంచారని కేసులు నమోదైన రోజుల గురించి మేము కూడా చదివాం. ఆ చరిత్ర మర్చిపోయి ఇప్పుడు పారదర్శకంగా జరిగిన నియామకాలపై బురదజల్లడం ఏ నైతిక హక్కుతో?
ఈరోజు నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిలబడగలిగానంటే అది ఎన్నో సంవత్సరాల కష్టం, చదువు, పోటీ, మెరిట్ వల్లే. నా లాంటి వేలాది మంది కూడా అదే విధంగా ఉద్యోగాలు సాధించారు.
మా విజయాన్ని అవమానించవద్దు జగన్ గారు.
మేము లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకోలేదు.
మేము రాజకీయ సిఫారసులతో ఉద్యోగాలు పొందలేదు.
మేము రాత్రింబవళ్లు చదివి, పోటీ పరీక్షలు రాసి, మెరిట్‌తో ఉద్యోగాలు సాధించాం.
అందుకే మీకు ఒక నిరుద్యోగి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారిన యువకుడి ప్రశ్న...
ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వని మీరు యువత గురించి మాట్లాడే అర్హత సంపాదించారా?
16,347 మంది జీవితాల్లో వెలుగులు నింపిన మెగా డీఎస్సీపై విషం చిమ్మడం ఆపి, కనీసం వారి కష్టాన్ని గౌరవించలేరా?
ఎందుకంటే...
ఉద్యోగం రాకముందు మేము నిరుద్యోగులం.
ఉద్యోగం వచ్చిన తర్వాత మేము ఉపాధ్యాయులమయ్యాం.
కానీ యువత ఎదుగుదల చూడలేకపోవడం మాత్రం మీ రాజకీయాల అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది.
#Mahanadu2026#NTRLivesOn
మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#PsychoFekuJagan
జగన్ నాటకాలు చూసి చూసి జనం ఛీ కొట్టినా.. ఆ డ్రామాలు మానడం లేదు. బాబాయి గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపాడు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య వైసిపి నేతల అనుచరుడని పోలీసులు తేల్చారు. ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా @ysjagan?
#YcpCriminalPolitics
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహా నాయకుడు ఎన్టీఆర్ జయంతి తెలుగు జాతి కీర్తి మహోత్సవం మహానాడు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల్లో నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుమేరకు హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. స్త్రీ శక్తి థీమ్‌తో జరిగే మహానాడు ను 'నా తెలుగుదేశం - నా బాధ్యత'గా నిర్వహించాలని కోరుతోంది. కార్యకర్తలు, పార్టీ అభిమానులు వారి వారి ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి ... ఆ జెండాతో సెల్ఫీ దిగి దానిని మీ మీ సామాజిక మాధ్యమాలలో #Mahanadu2026 హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి. మహానాడు వేడుక ముందుగానే మొదలైందని ప్రపంచానికి చాటండి.
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh