A proud moment for Indian athletics!
Congratulations to Pooja on winning the Bronze medal in the Women’s High Jump at the Asian Games 2026. This is India’s first medal in the event at the Asian Games since over two decades. It’s truly a memorable achievement. Best wishes for her upcoming endeavours: PM @narendramodi
‘పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారులు, తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతోపాటు పర్యాటక రంగానికీ ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం చుట్టామ’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. పల్లె బలపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందనే సంకల్పంతో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లెపండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,085 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఈ రెండున్నరేళ్లలో పల్లెపండుగ, జలజీవన్ మిషన్ - అమరజీవి జలధార, 15వ ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం, 10 వేలకుపైగా పదోన్నతులు, డి.డి.ఒ. కార్యాలయాల ఏర్పాటు.. ఇలా ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే, మరోవైపు వ్యవస్థను బలోపేతం చేశాం. ఒకప్పుడు పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి, ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని, తమ గ్రామ అభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చాం.
గత ఐదేళ్ల కంటే రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం
గత ప్రభుత్వం ఐదేళ్లలో 880 కి.మీ. సీసీ రోడ్లు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం ద్వారా కేవలం రెండేళ్లలోనే దానికి 10 రెట్లు ఎక్కువగా, దాదాపు 9,000 కి.మీ. సీసీ రోడ్లను పూర్తి చేశాం. గతంలో 304 మినీ గోకులాలు మాత్రమే నిర్మిస్తే, మనం దాదాపు 100 రెట్లు ఎక్కువగా, 30 వేలకు పైగా మినీ గోకులాలను నిర్మించాం. అలాగే, పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో భాగంగా 1 లక్ష 15 వేల పంట కుంటలను నిర్మించడంతోపాటు, 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేశాం. మరోవైపు, 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఇతర కాలనీల్లో 6,500 కిలోమీటర్ల సీసీ రోడ్లను ఇప్పటికే పూర్తి చేసింది. గిరిజన గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మరింత మెరుగుపరచేందుకు అడవితల్లిబాట కార్యక్రమం కింద రూ.2,180 కోట్ల వ్యయంతో సుమారు 2,437 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇందులో ఇప్పటికే 1500 కిలోమీటర్లకు పైగా అనుసంధాన రహదారులను నిర్మించాం. అలాగే, ఇప్పటివరకు రోడ్డు అనుసంధానం లేని బంజారా, యానాది, ఎరుకుల గిరిజన ఆవాసాలు ఉన్న ప్రాంతాల్లో, పల్లెపండుగ ద్వారా 167 ఆవాసాలకు 111.4 కి.మీ. మేర రహదారి సౌకర్యం కల్పించాం.
పల్లెపండుగ 3.0తో గ్రామీణ ప్రగతికి కొత్త ఊపు
ఈ రోజు ఇక్కడ మనం రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లబోతున్నాం. రూ.50 వేల కోట్లతో పల్లెపండుగ, జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయబోతున్నాం. ఇందులో రూ.30 వేల కోట్లతో అక్టోబర్ 5న గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్, సింగిల్ విలేజ్ స్కీమ్ పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నాం. అలాగే రూ.9 వేల కోట్లతో పల్లెపండుగ 1.0, 2.0 కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి, ఈ రోజు రూ.11,085 కోట్లతో ప్రతిష్టాత్మకంగా పల్లెపండుగ 3.0ను ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, మరో 22,500 మినీ గోకులాలు, 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయబోతున్నాం. అలాగే, 1,000 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర అభివృద్ధి పనులను చేపట్టబోతున్నాం.
పచ్చ తమ్ముళ్లు బాగా వినండి , పెద్దాయన గట్టిగ బల్ల గుద్ది మరి చెప్తున్నారు
PawanKalyan has his own mark of Governance 🔥🔥🔥🔥
@JanaSenaParty || @PawanKalyan
వైసీపీవాళ్ళు 5 సంవత్సరాల్లో 800 కిలోమీటర్లు రోడ్లు వేస్తే మనం 1000 ,2000 వెయ్యాలి కాని 9000 కిలోమీటర్లు వేసెయ్యడం ఏంటండీ పవన్ కళ్యాణ్ గారు…
పోటీ వైసీపీతో కాదు వరల్డ్ రికార్డుతో పెట్టుకున్నట్లు ఉంది
ల్యాప్ టాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ జిల్లా జఫ్స్ స్కూల్ విద్యార్థిని D. చిన్నారి అభినందనలు తెలియజేశారు❤️🙏
@APDeputyCMO@JanaSenaParty@PawanKalyan
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గెలిచిన వెంటనే వెళ్ళింది మన్యం ప్రాంతాలకి అక్కడ రోడ్లు కరెంటు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశారు :- ఈటీవీ గల్లీ గణేష్ ఈవెంట్లో హైపర్ ఆది గారు 💥 ❤️🔥🙌
(2/2)
పిఠాపురం నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఈ సమస్యను గ్రామస్థులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చి వినతి పత్రం సమర్పించారు. ప్రజల భద్రతకు సంబంధించిన సమస్య కావడంతో ఆయన తక్షణమే స్పందించి, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ను సురక్షిత ప్రాంతానికి తరలించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ను సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారం లభించడంతో కొండేవరం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
* పిఠాపురం–రాజమండ్రి బస్సు సర్వీసు ఏర్పాటు
పిఠాపురం నుంచి రాజమండ్రికి నేరుగా బస్సు సర్వీసు లేకపోవడంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేశారు. ప్రజల అభ్యర్థనపై స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, పిఠాపురం–రాజమండ్రి మధ్య బస్సు సర్వీసును త్వరలో ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.
వీటితోపాటు ఎఫ్‌కే పాలెం ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఈబీసీ కాలనీ వరకు 0.98 కి.మీ మేర డ్రైనేజీ నిర్మించాలని స్థానికులు అర్జీ సమర్పించగా, ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ.1.35 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. చందుర్తి గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు కోరగా 162 చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సర్పవరం ప్రాంతంలో ప్రజల రాకపోకలకు సౌకర్యంగా సీసీ రోడ్డు నిర్మించాలని ప్రజలు అర్జీ సమర్పించగా రూ.6 లక్షలతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే వాకతిప్ప ప్రాంతంలో 0.2 కి.మీ మేర సీసీ డ్రైనేజీ నిర్మించాలని గ్రామస్తులు కోరగా రూ.10 లక్షలతో పనులు చేపట్టేందుకు అనుమతులు ఇచ్చారు. కొండెవరం ప్రాంతంలో 1.7 కి.మీ మేర ప్రధాన సీసీ డ్రైనేజీ నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేయగా, వారి అభ్యర్థనను పరిశీలించి రూ.1.20 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు మంజూరు చేయాలని పలువురు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు సమర్పించారు. వారి అభ్యర్థనలను పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించి, అర్హతను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అర్హతపై విచారణ నిర్వహించిన అధికారులు, పింఛన్ల మంజూరు కోసం ప్రతిపాదనలను హెడ్ ఆఫీసుకు పంపించారు.
విన్నారు.. స్పందించారు.. పరిష్కరించారు
• పిఠాపురం ప్రజా వినతులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తక్షణ స్పందన
పిఠాపురం నియోజకవర్గం పర్యటన సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. పర్యటనలో ప్రజలు సమర్పించిన వినతిపత్రాలను బుధవారం స్వయంగా పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా, మానవతా దృక్పథంతో పని చేయాలని స్పష్టం చేశారు.
* ఆరు గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు
గ్రామాల్లో స్థానిక పాలనను మరింత బలోపేతం చేయడంతోపాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తమ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేయాలని అమరవిల్లి, కొమరగిరి, గోర్స, నవఖండ్రవాడ, చేబ్రోలు, దుర్గాడ గ్రామాల ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు. ఈ మేరకు తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రాలను సమర్పించారు. ప్రజల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయా గ్రామాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో గ్రామ పంచాయతీ భవనానికి రూ.32 లక్షల చొప్పున, మొత్తం ఆరు భవనాల నిర్మాణానికి రూ.1.92 కోట్ల నిధులను కేటాయించారు. గ్రామ పంచాయతీ భవనాల ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టడంతోపాటు, నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
• గొల్లప్రోలు డ్రైనేజీల సమస్యకు సత్వర స్పందన
గొల్లప్రోలు మున్సిపాలిటీలోని డ్రైనేజీ వ్యవస్థను శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలు కురిసిన సమయంలో డ్రెయిన్లు పొంగిపొర్లడంతో మురుగు నీరు ఇళ్లలోకి, రహదారులపైకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్య తీవ్రతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు- డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు . సమస్యకు పరిష్కారం చూపేందుకు సుమారు రూ.4.50 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అదే విధంగా రాయవరం రోడ్డు, తాటిపర్తి రోడ్డు, మెయిన్ రోడ్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను కూడా స్థానికులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాడా, మున్సిపల్ నిధులను వినియోగించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన డ్రైనేజీ పనులు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. గొల్లప్రోలు మున్సిపాలిటీలో పెరుగుతున్న పారిశుద్ధ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, శానిటేషన్ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రూ. 25 లక్షలతో జేసీబీని మంజూరు చేశారు.
• వలస కూలీల సమస్యలపై ఆరా
నియోజక వర్గం పరిధిలో పని చేస్తున్న వలస కూలీలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీరు, తాత్కాలిక వసతి, విద్యుత్ సౌకర్యం, రేషన్ అందించాలని వలస కూలీలు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వలస కూలీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తాగు నీరు, తాత్కాలిక వసతి, విద్యుత్, రేషన్ వంటి సౌకర్యాలు అందేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
• ఆలయాల అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయింపు
ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రజల నుంచి అందిన అర్జీలను పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు... ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి, ఆయా ఆలయాల అభివృద్ధి పనులకు మొత్తం రూ.1.50 కోట్ల నిధులు కేటాయించేలా చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా విరవలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, కోనేరు అభివృద్ధి పనులకు రూ.కోటి, కొండేవరం కోదండ రామాలయం అభివృద్ధికి రూ.25 లక్షలు, ఫక్రుద్దీన్పాలెంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, కనకదుర్గ ఆలయాల అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయించారు.
• కొండెవరం విద్యుత్ సమస్యకు పరిష్కారం
యు.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామంలోని ఇందిరా కాలనీ సమీపంలో ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు చాలాకాలంగా అధికారులను కోరుతూ వస్తున్నారు. (1/2)
పిఠాపురం మత్స్యకారుల సంక్షేమం కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవ !!
₹4.3 కోట్ల విలువైన పరికరాలతో 1,250కి పైగా పడవలకు Life Jackets, Fire Safety Equipment, Ice Boxes అందించారు.
మహిళలకు 30 Activa Scooters, 30 Ice Boxes, 3 ఆటోలు, అలాగే ఎండుచేపల తయారీకి కత్తులు, టార్పాలిన్లు, సిమెంట్ తొట్టెలు తదితర పరికరాలు అందించారు.
మత్స్యకారుల భద్రత నుంచి వారి జీవనోపాధి వరకు… ప్రతి కుటుంబానికి అండగా నిలిచే ప్రజా సంక్షేమం .
My dear @nameisnani, it is always wonderful to see your enthusiasm, sincerity and hunger to explore something new.
After witnessing the passion and conviction you and Srikanth brought to #Dasara, it is exciting to see you both come together once again with an entirely new world in #TheParadise. I’m really looking forward to experiencing this special film on the big screen. ❤️
My best wishes and blessings to you, @odela_srikanth, @SLVCinemasOffl, @anirudhofficial and the entire team.
May it create new milestones at the box office and give everyone involved a celebration to remember.