తన కూతురు కాదు కాబట్టే కైకా దేవి, సీత రాముని తో అడవి కి వెళ్తుంటే దసరథ కుటుంబం అడ్డుపడలేదు
తన కూతురు కాదు కాబట్టే పాంచాలి మానం కాపాడే ప్రయత్నం దృతరాష్ట్రుడు చేయలేదు
వేరే వాడి కూతురు ఏ యుగం లో అయినా లోకువే...
మర్చిపోకండి ఆ కూతురు కి దైవం ఎప్పుడూ సహాయం ఉంటుంది
నా పిచ్చి రాతలు🙏
సామాన్యుడి ఆకలి ఏ నాయకుడు తీర్చడు
సమాన్యుడి కన్నీరు ఏ ఆటగాడు తుడవడు
సామాన్యుడి కుటుంబాన్ని ఏ సినీ హీరో కాపాడడు
సామాన్యుడి చావుకు ఏ నేత సంతాపం తెలుపడు
చరిత్ర లో ఏ పాఠం అయినా ఇదే చెబుతున్నది.
సామాన్యుడా....వాస్తవం తెలుసుకో, బాధ్యత ని గుర్తుంచుకో...
#నా కొక్కిరి రాతలు
ఇద్దరి ఆటగాళ్ల మధ్య వైరం
ఇద్దరి నాయకుల మధ్య వైరం
ఇద్దరి సినీ తారల మధ్య వైరం
రెండు పార్టీల మధ్య వైరం
రెండు జట్టుల మధ్య వైరం
రెండు దేశాల మధ్య వైరం
రెండు వర్గాల మధ్య వైరం
ఈ వైరాల మధ్య ఆహుతి అయ్యేది ఎవరు??
ఒక సామాన్యుడు ...