కొత్తపేట నియోజకవర్గంలోని పిచ్చుకులంక గ్రామంలో నిర్వహించిన ఆర్థర్ కాటన్ బ్యారేజీ గేట్ల ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సభా ప్రాంగణంలో పచ్చ కండువాలను గాల్లో తిప్పుతూ సీఎం రాకను ఆహ్వానించిన రైతుల ఉత్సాహానికి ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి కూడా పచ్చ కండువాను గాల్లో తిప్పుతూ సభికులను అభివాదం చేశారు.
#FarmersFriendlyGovt
#ChandrababuNaidu
#AndhraPradesh
#kothapetaConstituency
#BandaruSatyanandarao
#BandaruSanjeev
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గోదావరి డెల్టాకు మహర్దశ పట్టింది! ఈ రోజు ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 కొత్త గేట్ల ఏర్పాటు పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన బ్యారేజీ పునరుద్ధరణ కోసం వెంటనే ₹150 కోట్లు కేటాయించడం రైతుల పట్ల సీఎం గారి చిత్తశుద్ధికి నిదర్శనం.
అలాగే సెంట్రల్ డెల్టాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే లొల్లలాకుల నిర్మాణానికి ₹74 కోట్లు మంజూరు చేయడం, అన్నదాత సుఖీభవ కింద రైతులకు ₹20,000 సాయం అందించడం, వ్యవసాయంలో డ్రోన్లు, AI వంటి ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం రైతులకు ఎంతో మేలు చేసే నిర్ణయాలు. ఈ సందర్భంగా గోదావరి డెల్టా ఆధునీకరణను వేగవంతం చేయడం, లంక భూములను నదీ కోత నుంచి రక్షించేందుకు గ్రోయిన్ల నిర్మాణం, ఏటిగట్ల ఎత్తు పెంపు, పిచ్చుకలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాను.
#NaraChandrababuNaidu
#GodavariDelta
#Konaseema
#kothapetaConstituency
#BandaruSatyanandarao
#BandaruSanjeev
ఏపీ అసెంబ్లీలో ఈ రోజు జరిగిన రాజ్యసభ నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొని, టీడీపీ అభ్యర్థులు శ్రీ సానా సతీష్ గారు, శ్రీ భాష్యం రామకృష్ణ గారు, శ్రీ చింతకాయల విజయ్ గార్లను శాలువాతో సత్కరించి, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. రాజ్యసభ వేదికగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వారు మరింత విశేషమైన కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా సంపూర్ణ మద్దతు ప్రకటించాను.
#RajyaSabha
#SanaSatish
#BhashyamRamakrishna
#ChintakayalaVijay
#KothapetaConstituency
#BandaruSatyanandharao
#BandaruSanjeev
కాసేపు వయసు, స్థాయి, పరిసరాలు అన్నీ మర్చిపోయి ఒకరిని ఒకరు నవ్వుతూ పలకరించుకుంటున్నారు. అంత పెద్ద లీడర్ కూడా చిన్నారి ప్రేమ ముందు చిన్న పిల్లడు అయిపోయాడు.
#ChandrababuNaidu#AndhraPradesh
జొన్నాడ ఫ్లైఓవర్ పనుల జాప్యం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా అమలాపురం ఎంపీ శ్రీ గంటి హరీష్ మాధుర్ గారితో కలిసి ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కృష్ణబాబు మరియు జాతీయ రహదారుల ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపాము. పనుల్లో విఫలమైన పాత కాంట్రాక్టర్ను తొలగించి, కొత్త టెండర్ల ద్వారా పనులను వేగవంతం చేసే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాము. ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి తక్షణమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాము. అలాగే, రావులపాలెంలో ఆక్రమణల తొలగింపు అనంతరం సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము.
#JonnadaFlyover
#DevelopmentWorks
#HarishBalayogi
#KothapetaMLA
#KothapetaConstituency
#BandaruSatyanandharao
#BandaruSanjeev
ఆలమూరు మండలం గుమ్మిలేరులో అమలాపురం ఎంపీ శ్రీ హరీష్ మాధుర్ గారితో కలిసి ఈరోజు వృద్ధులకు, దివ్యాంగులకు 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా అందజేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. మన కొత్తపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఈ నెల 41,656 మంది లబ్ధిదారులకు రూ.18.30 కోట్ల ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వానికి... ఈ ఆసరా అందుకుంటున్నప్పుడు ప్రజల ముఖాల్లో కనిపించే ఆ చిరునవ్వే నిజమైన సంతృప్తి.
#NTRBharosa
#Pensioners
#HarishBalayogi
#KothapetaConstituency
#BandaruSatyanandharao
#BandaruSanjeev
#BusinessReformerCBN
Big moment! Our Chief Minister Sri N. Chandrababu Naidu garu conferred Business Reformer of the Year at the The Economic Times Awards for Corporate Excellence!
Reforms. Vision. Execution. #AndhraPradesh is on the move @ncbn@EconomicTimes
#HBDOneAndOnlyCBN
Warm birthday greetings to Hon’ble Chief Minister N. Chandrababu Naidu garu - an inspiring leader I also have the privilege of calling Nanna. ❤️
With each passing year, your passion for public service only grows stronger; your experience and wisdom now blending seamlessly with a renewed energy to lead from the front.
I feel fortunate to learn from you every single day - your clarity of thought, resilience, and unwavering commitment to the people continue to guide me. Wishing you continued good health, strength, and many more years of inspiring leadership.
@ncbn
Wishing you a very, very Happy Birthday my dear brother @naralokesh anna 🎉❤️ I’ve seen your journey up close, the discipline, sacrifices, and heart behind your work. Your sincerity and sense of responsibility inspire me every day. Always proud of you. Wishing you good health, happiness, and greater heights ahead.
Respected @nitin_gadkari Ji,
The flyover construction work on the National Highway (NH-216A) at Jonnada Junction, Rajamahendravaram (Rajahmundry) road, Andhra Pradesh, started around 2 years ago but has been stopped for a long time.
The contractor dug up and damaged the main road for the flyover, but it has not been repaired yet. Commuters are facing severe difficulties and safety issues daily.
I am attaching a video showing the current pathetic condition of the road.
Sir, this is a long-pending issue causing hardship to thousands of people. Kindly look into it on priority and instruct the concerned authorities (NHAI/contractor) to resume work and repair the damaged main road at the earliest.
Your intervention will help the people of this area immensely.
Thank you. Jai Hind!
#NitinGadkari #NHAI #AndhraPradesh #Rajahmundry
#HappyNewYear2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించింది. ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఏ రంగంలో చూసినా... 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు.... నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన సంవత్సరంగా 2025 గుర్తుండిపోతుంది. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం - సంక్షేమం - అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటూ....అందరికీ హ్యాపీ న్యూ ఇయిర్ 2026
తెలుగువారి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభం అయిన ఆయన ప్రయాణం ఒక మహాశక్తిగా మారింది. సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ఆదర్శంగా నిలిచారు. ప్రజా నాయకుడిగా పేద ప్రజల ఆకలి తీర్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేశారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని నిత్య శ్వాసగా చేసుకొని ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు. ఆయన ప్రతి అడుగు నేటి తరానికి మార్గదర్శి. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#NTRLivesOn
#NTRJayanthi
🙏🙏🌹కోత్తపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,నమ్ముకున్న కార్యకర్త లకు భరోసా ఇచ్చే నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనీయర్ నాయకులు, మా శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂🎊🎊🎉🎉🎈🎈💐💐💐💐👏👏
ఇట్లు
రెడ్డి దుర్గాప్రసాద్
గుమ్మిలేరు
Commendable work by Alamuru PS & Kothapeta Sub-Division police in swiftly tracing the six missing children from Khandrigapeta, Alamuru. Your prompt response, use of technology, and coordination with multiple teams ensured their safe return. Kudos to the entire team! @appolice100
తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనం. ప్రగతి - ప్రజాసంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం. పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నినదించారు. వెనుకబడిన, బడుగు బలహీనవర్గాలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఆదుకొని అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం. నేడు స్వర్ణాంధ్ర సాకారానికి కృషిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
#43YearsOfTDP
#TDPFoundationDay