Words uttered: “If tomorrow YS Jagan Mohan Reddy says that your wives are not your wives, they would blindly believe it and even go to the extent of treating their own wives as sisters and shamelessly look for marriage alliances; such are the spineless leaders in the YSR Congress Party!”
These words were uttered by Vemuri Radha Krishna on ABN Channel. Using such repulsive language and dragging women into political discourse is not criticism; it is a disgraceful and demeaning attack on women that raises serious questions about the kind of partisan journalism being practiced.
We strongly condemn these remarks and emphasize that such statements are a deliberate attempt to insult women and distort public discourse. The real issue is that, unable to counter the “MAVIGUN” proposal politically, Chandrababu Naidu and his aligned media have resorted to diversion, misinformation, propaganda, and abuse.
We held peaceful protests demanding strict action against Radha Krishna and his unconditional apology. Despite such offensive remarks, our cadre showed restraint and did not resort to violence, demonstrating our commitment to democratic values.
Instead of condemning this disgusting narrative, @ncbn, @naralokesh, and @PawanKalyan backed and amplified these remarks. This reflects their clear misogynistic attitude. We demand immediate action against Radha Krishna and strongly condemn these leaders for supporting such a toxic and outrageous utterances.
“ రేపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వ్యాఖ్యానించారు.
మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదు. ఆ వ్యాఖ్యలు మ���ిళలను అవమాన పరచడమే కాకుండా, వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలి. ఎలాంటి వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్నదానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో “MAVIGUN” ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. “MAVIGUN” ప్రతిపాదనను రాజకీయంగా ఎదు���్కోలేక, చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు కూడా దిగారు.
మేము శాంతియుతంగా నిరసనలు చేపట్టి, రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాము. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు.
ఈ జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకుండా, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం, మహిళల పట్ల వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించ���న నాయకుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆశయాల సాధన కోసం ఆయన పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్రజల పార్టీనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
16 సంవత్సరాల ఈ ప్రయాణంలో
అనేక పోరాటాలు
అనేక విజయాలు
పోరాటాల మధ్య పుట్టి… ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన ప్రజా పార్టీ.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు.
#16YearsOfYSRCP
#YSRCPFormationDay
#YSRCPForAll
#AndhraPradesh
🚨🚨🚨 𝗛𝗲𝗹𝗹𝗼 𝗜𝗻𝗱𝗶𝗮, 𝘁��𝗶𝘀 𝗶𝘀 𝗮 𝘄𝗮𝗸𝗲-𝘂𝗽 𝗰𝗮𝗹𝗹.
In Visakhapatnam, @ncbn and his family are grabbing public land worth nearly 𝗥𝘀 𝟱,𝟬𝟬𝟬 𝗰𝗿𝗼𝗿𝗲. Around 𝟱𝟰.𝟳𝟵 𝗮𝗰𝗿𝗲𝘀 𝗼𝗳 𝗽𝗿𝗶𝗺𝗲 𝗹𝗮𝗻𝗱 𝗻𝗲𝗮𝗿 𝗥𝘂𝘀𝗵𝗶𝗸𝗼𝗻𝗱𝗮 is being taken over through open misuse of power. As 𝗖𝗵𝗶𝗲𝗳 𝗠𝗶𝗻𝗶𝘀𝘁𝗲𝗿, Chandrababu has handed this valuable land to his own family member, 𝗩𝗶𝘀𝗮𝗸𝗵𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺 𝗠𝗣 Sri Bharat. Lands recovered and fenced by the government during the YSRCP period are now being gifted to his family 𝗳𝗿𝗲𝗲 𝗼𝗳 𝗰𝗼𝘀𝘁.
The role of his son 𝗡𝗮𝗿𝗮 𝗟𝗼𝗸𝗲𝘀𝗵 𝘁𝗼 𝘄𝗵𝗼𝘀𝗲 𝗖𝗼-𝗯𝗿𝗼𝘁𝗵𝗲𝗿 these lands are gifted exposes the family nexus. Despite having no authority, a memo was issued from the Education Department to allot this land to his relatives. Chandrababu then pushed the system through pressure and intimidation to secure one-sided approvals by force on local administration. When YSRCP corporators stood firm to protect public property, they were attacked and forcibly removed, leaving several injured, while the police stood by as silent spectators.
To execute this land grab, Chandrababu 𝗿𝗲𝗺𝗼𝘃𝗲𝗱 𝗮 𝗬𝗦𝗥𝗖𝗣 𝘄𝗼𝗺𝗮𝗻 𝗠𝗮𝘆𝗼𝗿 who was from the BC Yadava community, spent crores to buy corporators, bulldozed the process to gift Rs 5000 crore property to his family members. Whenever Chandrababu is in power, public assets disappear and family interests grow. This is not an exception, but a pattern. Chandrababu Naidu and Nara Lokesh have reduced governance to a real estate business.
హలో ఇండియా… ఇది ఒక వేక్-అప్ కాల్.
విశాఖపట్నంలో @ncbn, ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుంది.
రుషికొం��� సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం ద్వారా బహిరంగంగానే కబ్జా చేసేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, అత్యంత విలువైన ఈ భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్‌కు కట్టబెట్టేశారు.
వైయస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో తిరిగి స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ వేసిన భూములను ఇప్పుడు మళ్లీ చంద్రబాబుగారు తన కుటుంబానికి ఉచితంగా బహుమానంగా ఇచ్చేశారు.
ఈ విలువైన భూములను లోకేష్ తన తోడల్లుడికి కట్టబెట్టడం, చంద్రబాబు కుటుంబ కుట్రను బయటపెడుతోంది. లోకేష్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, విద్యాశాఖ నుంచి ఒక మెమో జారీ చేసి ఈ భూములను తన తోడల్లుడికి కేటాయించేలా చేశారు.
ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లు, బెదిరింపులతో నగర పాలక సంస్థ సభ్యుల (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్)ను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైయస్సార్సీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే, వా��ిపై భ��తిక దాడులు చేసి బలవంతంగా బయటకు తోసేశారు. ఈ దాడుల్లో పలువురు వైయస్సార్సీపీ కార్పొరేటర్లు గాయపడగా, పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషించారు.
ఈ భూ దోపిడీని అమలు చేయడానికి చంద్రబాబు, బీసీ యాదవ వర్గానికి చెందిన వైయస్సార్సీపీ మహిళా మేయర్‌ను తొలగించారు, కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, ప్రజాస్వామ్య ప్రక్రియను బుల్డోజ్ చేసి రూ.5,000 కోట్ల విలువైన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కానుకగా ఇచ్చారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి. వారి కుటుంబ ఆస్తులు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పరిపాటిగా జరిగిపోతుంది.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు తమ పాలనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Even in a small MPP election, the way democracy is being brutally murdered exposes the extreme high-handedness of the TDP and the dangerous nature of the coalition government led by @ncbn, who has reduced elections to a show of force instead of a democratic process.
In Udayagiri constituency, Vinjamuru mandal, our YSRCP MPTCs were stopped on the road while coming to exercise their vote. They were attacked, a woman MPTC suffered bleeding injuries, one member was kidnapped and another was taken into police custody, all with the sole aim of stopping them from voting to elect an MPP. It is a planned attempt to silence people by creating fear, using force and blocking their right to vote, only to crush the democratic voice. During these incidents, the police acted like puppets in the hands of the TDP, openly supporting the ruling party and failing to protect the democratic process.
The same ugly picture was repeated in Rayadurgam constituency, Bommanahal mandal. Our YSRCP MPTCS were confined and kept away, and the MPP election was completed forcibly while police and election officials stood as silent spectators, helping these undemocratic acts to take place.
Kidnapping elected representatives, attacking them in public, misusing the police and bulldozing election process has become routine under the TDP-led coalition. Chandrababu Naidu, who lectures the nation on democracy, must answer for turning Andhra Pradesh into a lawless jungle raj state. If this is the condition of democracy in a small local body indirect election, it clearly shows how arrogant and anti-democratic this government has become.
‘ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బలప్రదర్శన వేదికగా మార్చిన చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వపు తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకరమైన స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది’.
‘ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలంలో, ఎంపీపీ ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్తున్న మా వైయస్సార్సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం, ఎంపీపీ ఎన్నికలో వారు ఓటు వేయకుండా ఆపడమే. అలా ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. తద్వారా ప్రజల గొంతును అణచి వేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో, పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడటంలో విఫలమవుతున్నారు’.
‘రాయదుర్గం నియోజకవర్గం, బొమ్మనహల్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. మా వైయస్సార్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. అలా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిల్చి, అక్కడ ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’.
‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేయడం, వారిపై బహిరంగంగా దాడి చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం.. ఇంకా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. దేశానికి ప్రజ��స్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబునాయుడు, రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలి. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే, ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వినియోగం చేస్తోంది.. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారింది.. అన్న విషయాలను తేటతెల్లం చేస్తోంది’.
ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశాం. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం నాకు సంతో��ాన్ని కలిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
September 15, 2023, remains one of the most satisfying days of my tenure as Chief Minister. It gave me the joy of knowing that I had done something truly good for the people of Andhra Pradesh. From 1923 to 2019, the state had only 12 government medical colleges. But during our term alone, we took up the ambitious task of establishing 17 medical colleges at one go.
As part of this effort, on September 15, 2023, we inaugurated medical colleges in Vizianagaram, Rajahmundry, Eluru, Machilipatnam, and Nandyal, marking a historic step forward in strengthening public healthcare. These five colleges alone added 750 MBBS seats, which was a source of immense satisfaction for me. Along with this, the medical colleges in Paderu and Pulivendula were also made ready for admissions.
However, instead of completing the construction of the remaining 10 medical colleges, the present government is trying to hand them over to private entities. This is a grave injustice to the people. Citizens across the state are opposing this move, and we strongly demand that the government immediately withdraw such an attempt.
తెలుగు ప్రజల ���ుండె చప్పుడు మహానేత వైయస్ఆర్ గారు. విపక్షాలు సైతం కొనియాడిన వ్యక్తిత్వం ఆయనది.
విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆ మహానాయకుడి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
#YSRVardanthi #JoharYSR #YSRCP