అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
4 th bail and again fifth arrest .. this is mockery of Court s Peopele are watching @ncbn@PawanKalyan#AndhraPolice#GovernmentofAndhrapradesh .. we are witnessing your arrogance, your frustration and your fear to Voices that question. Our fight will continue #justasking
Arrest/ Bail ..Arrest /Bail.. Arrest/Bail.. and arrest again. Isn’t Courts telling you that you are wrong.. Citizens are witnessing your Vindictive politics.. @ncbn@PawanKalyan please stop this #justasking
రావణ్ ను 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా ఇప్పటికీ జడ్జి ముందు హాజరుపరచలేదు
శనివారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా తహశీల్దార్ ఉండనున్నారు.
ఆయనతో రావణ్ కు 7 రోజుల రిమాండ్ విధించే కుట్ర చేస్తున్నారు.
అదే జరిగితే హైకోర్టులో పిటిషన్ వేసి పోలీసులకు తాసిల్దార్ కు అందరూ ఉద్యోగాలు తీయిస్తాను.
- జడ శ్రవణ్
@ncbn garu @PawanKalyan garu ..arresting journalists KVR and Raavan of Prashna for voicing is a condemnable act and missuse of the power the citizens have given you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా?
మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా?
ఏ రాష్టమైనా అన్యాయం అన్యాయమే!
ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత!!
అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం
మీ పిరికితనం!! #justasking
నాయకుడిగా పోరాటం ఏంటో చూపించిన దేవభక్తుని చక్రవర్తి
చక్రవర్తి తాతగారు దేవభక్తుని వెంకటేశ్వరరావు విగ్రహం వద్ద మరమ్మత్తులు చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్న టీడీపీ.
దమ్ముంటే విగ్రహం వద్దకు రావాలంటూ సవాల్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.
బోడే ప్రసాద్ సవాల్‌ను స్వీకరించి విగ్రహం దగ్గరకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నా.. వారిని సైతం లెక్కచేయకుండా అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించిన చక్రవర్తి.
కొంతమంది నాయకులు పోలీసులు రాగానే వారితో పాటు పోలీసు జీపులో వెళ్తారు. అలా కాకుండా ఇంతగా ప్రతిఘటించడం ఈ మధ్యకాలంలో చాలా అరుదు.
రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!
@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే.
•మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా, ఒక్క సంవత్సరం కూడా తప్పలేదు. పైగా మేము మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం.
•ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా నిలబడి, PM-KISANకు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి, మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ ట్వీట్‌కు మీరు మాట్లాడిన మాటలు జతచేస్తున్నాను.
•2024-25లో PM-KISANకు అదనంగా మీరు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది – సున్నా.
•2025-26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే.
•2026-27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది – కేవలం రూ.5,000.
•అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం PM-KISAN కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.19,000.
•పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85లక్షల మందికి కుదించారు.
•కౌలు రైతులకు, ROFR పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు.
•మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్‌గా మేం నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.
•ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్ట, నష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా, మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియంకూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. కాని, మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం, రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే.
•ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు.
•రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేశారు.
•ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ-క్రాప్‌ను, టెస్టింగ్ ల్యాబులను నాశనం చేశారు.
•ఆక్వారైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉన్న అప్సడా అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వాఫీడ్కు రూ.4లు పెంచారు, జూన్‌లో మరో రూ.10- రూ.12లు పెంచారు. కిలోకు ఏకంగా రూ.14- రూ.16లు చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యలమేత ధర రూ.72వేల నుంచి రూ.1.08లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి.
•ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టిమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరాచూస్తే తగ్గించింది కేవలం రూ.2లు మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప? పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వారైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
•మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12లు చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి, ఇవ్వాళ్టికీ రూ.380కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4లు ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?
•పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు ఆ ధర రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా?
•ఇక మీరు రైతులకోసం ఏంచేసినట్టు చంద్రబాబుగారూ? మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే.
English Version- https://t.co/8IDfDDLVxo
రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !
ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు
1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ? అని.
2.రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!
3.ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం! సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన!
4.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?
5. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
6.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు! ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది! దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.
7.విద్యా రంగం దెబ్బతింది! వైద్య రంగం దెబ్బతింది! వ్యవసాయం సంక్షోభంలో ఉంది! ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు! నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
8.ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
9.చంద్రబాబుగారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు.
10.ఈ “నారాసుర పాలన’’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు.
#2YearsForCBNBackStabbing
Law & Order is a Big Joke in Andhra Pradesh!!
పోలీసులు, ఎమ్మెల్యేల అండతో 26 ఏళ్ల శ్రమను దోచుకునే ప్రయత్నం జరుగుతోంది!!
ప్రాంత అభివృద్ధి కోసం నిర్మించిన కాంప్లెక్స్‌ను అక్రమంగా ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు!!
తప్పుడు ఆరోపణలు చేసి, మా కుటుంబంపై కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు
#SaveAPFromTDP
Presenting #TeamIndia's newest T20I captain 🇮🇳
Congratulations to Shreyas Iyer as he takes the helm in the shortest format of the game 👏
@ShreyasIyer15
🚨 Exposed 🚨
నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది.
కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అంటే, నీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.
మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను పిలిచారు
1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి.
-బాలకృష్ణ గారు, కాకినాడ. తూర్పు గోదావరి జిల్లా
#MegaDSCScam
#LooterLokesh
#SadistChandraBabu
#CBNFailedCM