🔥 IPO stocks can give HUGE returns!
I’m giving away my powerful IPO scanner.
Get it NOW: 👇
(1) Like & Retweet
(2) Comment "IPO SCAN"
(3) Follow @rohaninvestor
Scanner will be in your DMs! 📩
కారణం లేకుండా ఎవ్వరూ జన్మించరు, కానీ కొందరు ప్రత్యేక కారణం తో జన్మిస్తారు అనేది ఎన్టీఆర్ గారి విషయంలో నిజమే అనిపిస్తుంది.
నేను ఆయన పౌరాణిక పాత్రలకు చిన్నప్పటినుండి పెద్ద అభిమానిని. రాజకీయ పరంగా అంతగా కనెక్ట్ అవ్వలేదు కానీ తెలుగు ఆత్మగౌరవ నినాదం బాగా నచ్చేది, ఎందుకంటే ఆ రోజుల్లో ఢిల్లీ లో చదువుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు మద్రాసీ అనే వివక్ష కు గురి అయ్యేదాన్ని.
ఎన్టీఆర్ గారు 1982 లో పార్టీ పెట్టినప్పుడు, అమ్మకు కూడా ఆహ్వానం పంపారు, 1977 లో కాంగ్రెస్ ఎంపీ గా ఉంటూ మొత్తం దక్షిణ భారత దేశం నుండి ఎమర్జెన్సీ ని పార్లమెంట్ లో వ్యతిరేకించిన ఏకైక ఎంపీ అమ్మ. అలా ఆయనకు అమ్మంటే అభిమానం ఉండేది. అప్పుడు అమ్మ జనతా పార్టీ నుండి హిమాయత్ నగర్ అసెంబ్లీ ఎంఎల్ ఏ గా ఉన్నారు. ఇక జనతా పార్టీ కూలి పోవడం, పార్టీ రద్దు అవ్వడం తో ఎవరి పాత గూటికి వారు చేరుకున్నారు.
1983 లో మళ్ళీ ఎన్నికలొచ్చాయి, అది టీడీపి కి మొదటి ఎన్నిక. అప్పటికి టీడీపి స్ధాపించి కొన్ని నెలలే అయ్యింది, వనరులు లేవు, క్యాడర్ అంతంతమాత్రమే, పోటీ చేయడానికి అన్ని చోట్ల అభ్యర్థులు లేరు. హిమాయత్ నగర్ నుండి అమ్మ కాంగ్రెస్ అభ్యర్థి, టీడీపి నుండి ఎవరికో టికెట్ ఇచ్చారు కానీ, ఆయన నామినేషన్ రిజెక్ట్ అయ్యింది, అప్పుడు నారాయణ్ గౌడ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్ధి ని టీడీపి ఓన్ చేసుకుంది కానీ సాంకేతిక కారణాల వల్ల సింబల్ ఇవ్వలేక పోయింది. ఆ ఎన్నికల్లో నేను అమ్మ కోసం చురుగ్గా ప్రచారం చేసాను. ఎక్కడా టీడీపి ఊసు అంతగా లేదు, ప్రచారం కూడా లేదు, పోటీ బీజేపి కాంగ్రెస్ ల మధ్యనే ఉందనుకున్నాము. పోలింగ్ అయ్యింది, రెండ్రోజుల్లో కౌంటింగ్. నేను కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్ గా హాల్ లో ఉన్నాను. బ్యాలెట్ బాక్సులు తీసి కౌంటింగ్ మొదలు పెడితే అందరు షాక్… టీడీపి ఓన్ చేసుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థి నారాయణ్ గౌడ్ గెలిచారు. ఆయన గెలుపు ఆయనే నమ్మలేక భావోద్వేగానికి గురై ఆ రోజు మధ్యరాత్రి హార్ట్ఎటాక్ తో చనిపోయారు. రాష్ట్రమంతా దాదాపు అదే గెలుపు సునామీ.
ఇంతటి ప్రజాకర్షణ ఒకరి సొంతం అవ్వడం అరుదైన విషయం. ఈ రోజు ఎన్టీఆర్ గారి పేరు ఎత్తితేనే కొందరు కులం ఆపాదిస్తున్నారు, ఏ కులాభిమానం తో ఆయన పేరును జిల్లాకి పెట్టారు, ఏ కులాభిమానం తో ఆయన విగ్రహం పార్లమెంటులో పెట్టారు, ఏ కులాభిమానం తో ప్రధానమంత్రులందరూ ఆయనను కొనియాడుతూ వస్తున్నారు……?
కొందరు బజ్జీలంటూ అతి చేయడం గమనించా, అప్పుడు తిని ఆయన బాగానే ఉన్నారు, ఇప్పుడు విని వీళ్ళకి అజీర్తి చేసిందనుకుంట. తిన్నది అరగాలంటే జఠరాగ్ని ఉండాలి, కడుపుమంట కాదు.