దాహం తీర్చుకునేందుకు నీటి కోసం వెతుకుతూ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయిన షెడ్యూల్-I వన్యప్రాణి, ఐయూసీఎన్ (IUCN) ప్రకారం 'వల్నరబుల్' జాతికి చెందిన సాంబర్ జింక (Rusa unicolor)ను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ హనుమాన్ (HANUMAN) రెస్క్యూ బృందం సమాచారం అందిన 20 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని అత్యంత చాకచక్యంగా సురక్షితంగా రక్షించింది.
రక్షించిన జింకకు అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు వెంటనే కరుణా సొసైటీ వన్యప్రాణుల పునరావాస కేంద్రానికి తరలించారు.
ప్రతి వన్యప్రాణి జీవితం అమూల్యం. వేగవంతమైన స్పందన, శాస్త్రీయ విధానాలు, నిపుణుల సేవలతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వన్యప్రాణుల సంరక్షణకు నిరంతరం కట్టుబడి ఉంది.
@APDeputyCMO@HANUMAN_APGOV
#HANUMAN #WildlifeRescue #APForestDepartment #WildlifeConservation #AndhraPradesh
The First Gen Z Political Icon. The Powerful politician . The Story of Pawan Kalyan Across Generations.
“చాలామంది నటులు ఒక తరం వరకే పరిమితమవుతారు. రాజకీయ నాయకులు నాయకులు కొంత కాలమే గుర్తుంటారు . కానీ చాలా అరుదుగా మాత్రమే ఒక వ్యక్తి కాలాన్నీ, తరాలనూ, వర్గాలనూ దాటి ఒక నమ్మకంగా… ఒక స్ఫూర్తిగా… చివరికి ఒక నిలుస్తాడు. పవన్ కళ్యాణ్ అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు.”
OG విడుదలైన సందర్భంలో థియేటర్లో కనిపించే ఈ సన్నివేశం ఉదాహరణగా తీసుకోవచ్చు..“పవర్ స్టార్” టైటిల్ చూడగానే పిల్లల కేకలు . ఆ క్షణాన్ని తన ఫోన్లో బంధించాలి అని తాపత్రయపడే జెన్ జి యువకుడు . ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తమ్ముడు సినిమా చూసి అభిమానిగా మారిన తండ్రి, ఇప్పటికీ అదే ఉత్సాహంతో విజిల్ వేస్తాడు . ఆ తండ్రి ఆనందాన్ని, మనవళ్ల ఉత్సాహాన్ని చూసి మురిసిపోయే తాతయ్య, అమ్మమ్మ - ఇలా మూడు తరాలు కలిసి ఒకే ఆనందాన్ని పంచుకుంటున్న సందర్భం పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రమే సాధ్యం .థియేటర్ బయట భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, డప్పులు, బాణాసంచా… సినిమా విడుదల ఒక పండుగగా మారిపోతుంది.
ఇదే దృశ్యం జనసేన సభల్లోనూ కనిపిస్తుంది. విద్యార్థులు, యువత, రైతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు- వీళ్లంతా ఒక నటుడి పరిధి దాటి తాము నమ్మిన విలువలకు కట్టుబడి నిలిచిన వ్యక్తిని వినడానికి వస్తారు.
ఈ రోజుల్లో సోషల్ మీడియా, వినోదం, రాజకీయాలు అన్నీ వయసుల వారీగా విడిపోయాయి. పిల్లలకు ఒక ఐకాన్, యువతకు ఇంకొకరు, మధ్యవయసువారికి మరొకరు, వృద్ధులకు వేరొకరు. అలాంటి కాలంలో దాదాపు మూడు దశాబ్దాలుగా అన్ని తరాలతో సమానమైన అనుబంధాన్ని కొనసాగించడం చాలా అరుదు. అదే పవన్ కళ్యాణ్ ప్రత్యేకత.
1990ల చివరలో, 2000ల ప్రారంభంలో వచ్చిన తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు కేవలం బ్లాక్బస్టర్లు మాత్రమే కాదు; ఒక తరం వ్యక్తిత్వాన్ని మలిచిన సినిమాలు. ఆత్మవిశ్వాసం,ఆత్మ గౌరవం, తిరుగుబాటు తత్వం, ప్రేమ, వ్యక్తిత్వం - యువత తమను తాము ఆ పాత్రల్లో చూసుకుంది. కాలేజీ ఫెస్టివల్స్‌లో ఆయన డైలాగులు వినిపించేవి. హాస్టల్ గోడలపై పోస్టర్లు ఉండేవి. బైక్‌లపై “Power Star” స్టిక్కర్లు కనిపించేవి. ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక ప్రెస్టీజ్ ఇష్యూ .
అప్పుడు అభిమానులుగా ఉన్న వారు నేడు డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, తల్లిదండ్రులు అయ్యారు.కానీ అభిమానంలో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు వాళ్లే తమ పిల్లలకు ఖుషి, తమ్ముడు, తొలిప్రేమ చూపిస్తున్నారు. ఇక్కడే ఒక హీరో అభిమానిగా మొదలైన ప్రయాణం, “పవనిజం” అనే భావోద్వేగంగా మారింది.
ఈ ప్రయాణాన్ని మూడు పదాల్లో చెప్పొచ్చు- ఇష్టం… అభిమానం… పవనిజం.
పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి తరం ఆయనను కొత్తగా కనుగొంటుంది. ఒక తరం తొలిప్రేమలో చూసింది. ఇంకో తరం జల్సాలో చూసింది. కుటుంబాలు అత్తారింటికి దారేదిలో చూసాయి. నేటి Gen Z కి oG కి తోడుగా సోషల్ మీడియా, రీ-రిలీజులు ద్వారా ఆయనను మళ్లీ కనుగొంది. OG విజయంతో, ఆయన తెరపై కనిపించే “AURA ” రుచి ఈ తరం ప్రేక్షకులను మల్లి తెలిసింది. OG కేవలం మరో హిట్ సినిమా కాదు. రెండు దశాబ్దాల క్రితం ఆయన సృష్టించిన ‘AURA’ ఈ డిజిటల్ తరం ముందు కూడా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా. ఒకప్పుడు ‘ఖుషి’తో ఒక తరం ఆయనను కనుగొంటే… OGతో మరో తరం పవన్ కళ్యాణ్‌ను తమదిగా చేసుకుంది.
ఈ అనుబంధం సినిమాలతోనే ఆగిపోలేదు. తెరపై కనిపించిన హీరో, నిజ జీవితంలోనూ అదే ఆప్యాయత, అదే మానవత్వాన్ని,అదే బాధ్యత చూపించినప్పుడు పవనిజంతో చిన్నారులు, తల్లిదండ్రులు, కుటుంబాల అనుబంధం మరింత బలపడింది.
అనారోగ్యంతో పోరాడుతున్న యువ అభిమాని నిరంజన్ను వ్యక్తిగతంగా పరామర్శించి, అతని చేతిని పట్టుకుని ధైర్యం చెప్పిన సంఘటన వేలాది కుటుంబాలను కదిలించింది. అతని మరణానంతరం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన బాధలో ఒక స్టార్ కాదు, ఒక మనిషి కనిపించాడు. అందుకే ఆయన అభిమానులకు కుటుంబ సభ్యుడిలా అనిపిస్తాడు.
కాలం మారింది… పాత్రలు మారాయి… కానీ పవన్ కళ్యాణ్ మారలేదు. చాలా మంది నటులు కాలానుగుణంగా తమ ఇమేజ్ను మార్చుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్‌లో అభిమానులు చూసింది వ్యక్తిత్వంలో స్థిరత్వం . తెరపై కనిపించిన నిజాయితీ, సింప్లిసిటీ , ఆత్మగౌరవం, సమాజం పట్ల బాధ్యత… ఇవే లక్షణాలు ప్రజాజీవితంలోనూ కనిపించాయి. సినిమా హీరోగా మొదలైన ప్రయాణం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా మారే క్రమంలో ఆయన Core principles విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు .
అందుకే సినిమా అభిమానులే ఆయన రాజకీయ ప్రయాణానికి మొదటి బలంగా నిలిచారు. అయితే అది అక్కడితో ఆగలేదు. సినిమాల్లో అభిమానించిన వారితో పాటు, సినిమాల ద్వారా కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని చూసి నమ్మిన కొత్త తరాలు, కొత్త వర్గాలు ఆయనతో ప్రయాణం ప్రారంభించాయి.
ఈరోజు ఏ జనసేన సభను చూసినా అదే multiple generation picture కనిపిస్తుంది. ఒకప్పుడు తమ్ముడు, ఖుషి చూసి అభిమానిగా మారిన వ్యక్తి… ఈరోజు తన కుమారుడితో కలిసి సభకు వస్తాడు. మొదట సినిమాల ద్వారా పరిచయమైన యువత, ఇప్పుడు ఆయన ఆలోచనలతో రాజకీయంగా అనుసంధానమవుతోంది. రైతు తన సమస్యను వినిపించే నాయకుడిని చూస్తాడు. మహిళలు గౌరవం, భద్రత గురించి మాట్లాడే వ్యక్తిని చూస్తారు. ఉద్యోగులు బాధ్యతాయుతమైన పరిపాలనను చూస్తారు. వృద్ధులు విలువలతో రాజకీయం చేయాలనే తపనను గుర్తిస్తారు. చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి “పవన్ కళ్యాణ్” అనే పేరును మరో తరానికి తీసుకెళ్తున్నారు.
అందుకే జనసేన సభలు కేవలం రాజకీయ సమావేశాలుగా కనిపించవు. అవి తరాలను కలిపే వేదికలుగా మారాయి. థియేటర్లో కనిపించే మూడు తరాల దృశ్యమే, ఇప్పుడు ప్రజాసభల్లోనూ కనిపిస్తోంది. ఒకే వ్యక్తిని మూడు తరాలు… మూడు కారణాల కోసం అభిమానిస్తున్నాయి. పెద్దలు ఆయన నిజాయితీని, యువత ఆయన ధైర్యాన్ని, పిల్లలు ఆయన ఆప్యాయతను ప్రేమిస్తున్నాయి.
Genz scripted రాజకీయాలు ఆమోదించడు.పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో కనిపించే సహజత్వం భావోద్వేగం,నేరుగా సమస్య పై స్పందించే విధానం ఈ తరానికి బలంగా కనెక్ట్ అయిన అంశం.
అధికారంలో ఉన్నాం కదా అని సర్దుకోకుండా సమస్యను ప్రశ్నించే తత్వంవల్ల gen z ఆయనలో తమ స్వరం చూసుకున్నారు.
చాలామంది యువ ఓటర్లకు రాజకీయాలపై మొదటి ఆసక్తి ఎన్నికల వల్ల కాదు; పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది. ఆయన సభలు, ప్రసంగాలు, చర్చలు రాజకీయాలపై ఆసక్తిని పెంచిన సందర్భాలు ఈ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి.
Gen Zకి పవన్ కళ్యాణ్ మొదట “Aura ”గా కనిపించాడు.ఇప్పుడు అదే వ్యక్తి “ఆదర్శం”గా మారాడు.
చాలా మంది Gen Z ఓటర్లకు పవన్ కళ్యాణ్ కేవలం సినిమా స్టార్ కాదు. వారు రాజకీయంగా అర్థం చేసుకున్న మొదటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. సోషల్ మీడియాలో ఆయన ప్రసంగాలు, ప్రశ్నించే ధోరణి, uncompromising attitude ఈ తరానికి కొత్త రాజకీయ భాషను పరిచయం చేశాయి. .పవన్ కళ్యాణ్ ని first Gen Z political hero అనొచ్చు.
మునుపటి తరం పవన్ కళ్యాణ్‌ను చూసి అభిమానించింది. Gen Z పవన్ కళ్యాణ్‌ను చూసి ప్రశ్నించడం, పాల్గొనడం, మార్పు గురించి ఆలోచించడం ప్రారంభించింది. అదే ఆయనను తరాలకు అతీతమైన నాయకుడిగా నిలబెడుతోంది.
చాలామంది నటులు విజయాలను సంపాదిస్తారు. కొందరు నాయకులు అధికారాన్ని సాధిస్తారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే తరాలను కలిపే అనుబంధంగా, కాలాన్ని దాటే నమ్మకంగా, ప్రభావంగా నిలుస్తారు.
పవన్ కళ్యాణ్ అలాంటి అరుదైన వ్యక్తి.
కొందరికి ఆయన పవర్ స్టార్…
మరికొందరికి జనసేనాని…
కానీ లక్షలాది మంది అభిమానులకు మాత్రం ఆయన ఒక పేరుకంటే ఎక్కువ.
ఒక నమ్మకం… ఒక అనుబంధం… ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తున్న స్ఫూర్తి…
తరాలను దాటే ప్రజాదరణ గొప్పది.
తరాలను కలిపే నాయకత్వం ఇంకా గొప్పది.
పవన్ కళ్యాణ్ ఈ రెండింటినీ సాధించిన అరుదైన వ్యక్తి.
🎬 The wait is over!
Book your tickets, grab your gang, and experience the madness on the big screen. Don’t miss this entertaining ride!
Watch #KoreanKanakaraju in theatres from today! ❤️
@IAmVarunTej@UV_Creations
పిల్లల కోసం జీవితమంతా పోరాడిన తండ్రికి చివరికి ఓల్డ్ ఏజ్ హోమే గమ్యం...
చనిపోయిన తర్వాత కూడా అంతిమ వీడ్కోలు చెప్పడానికి రాని కూతురు, వీడియో కాల్లో "Aur kitna time lagega?" అని అడిగిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Many leaders forget their promises once they’re in power.
Pawan Kalyan is doing the opposite by delivering on the promises he made between 2017 and 2019.!
2018 - Requested to increase Storage Facilities for Farmers
2026 - When in Power built 117 Storages
#PawanKalyan #JSPWorks
హస్తకళలకు సాంకేతిక వెలుగులు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనతో ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానం మొదలు
•స్కాన్ చేస్తే చాలు.. కళాఖండం చరిత్ర చెప్పేస్తుంది… కళాకారుడి కష్టాన్ని వివరిస్తుంది..
•నకిలీ ఉత్పత్తుల నిరోధానికీ ఉపయోగం
ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆలోచనలకు అనుగుణంగా లేపాక్షి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ప్రతి కళాఖండం, కళారూపం పూర్తి వివరాలు తెలిసేలా, దాన్ని రూపొందించిన కళాకారుడికి తగిన గుర్తింపు లభించేలా వాటి పూర్తి వివరాలను తెలుసుకునేలా ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థ తీసుకురావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా సూచించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ కేవలం నెల రోజుల వ్యవధిలో దేశంలో తొలిసారిగా హస్తకళలకు క్యూఆర్ కోడ్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఒక్క స్కాన్‌తో పూర్తి వివరాలు
కళ- ఉత్పత్తి- వివరాలు ప్రతిపాదికన ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చారు. కొనుగోలుదారులు వస్తువుపై ఉన్న కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలను సెకన్లలో తెలుసుకోవచ్చు. ఆ వస్తువు చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, తయారు చేసిన కళాకారుడి పేరు, వారి నైపుణ్యం, తయారు చేయడానికి వారు పడిన కష్టం, ఉపయోగించిన ముడిసరుకు, తయారీకి పట్టిన సమయం, వస్తువు కొలతలు వంటి వివరాలతోపాటు, దానికి భౌగోళిక గుర్తింపు లేదా ఒక జిల్లా–ఒక ఉత్పత్తి గుర్తింపు ఉందా అనే సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.
దశలవారీగా విస్తరణ
మొదటి దశలో రాష్ట్రంలోని విభిన్న సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే 8 ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ ప్రొఫైల్స్‌ను అధికారులు కేటాయించారు. బొబ్బిలి వీణతోపాటు, సంపూర్ణ రామాయణం, మహాభారతం, శ్రీ కృష్ణలీలా, మత్స్యావతారం కలంకారి పెయింటింగ్స్, అలాగే సవర ఆదివాసి పెయింటింగ్స్ ఉన్నాయి. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని హస్తకళా ఉత్పత్తులు, కళాకారుల క్లస్టర్లకు ఈ విధానాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట పడటంతోపాటు, ఏపీ హస్తకళలకు ప్రపంచ మార్కెట్లో మరింత గుర్తింపు లభించి, కళాకారుల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు సహకరిస్తున్న బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారికి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, ఈ కార్యక్రమం అమలుకు కృషి చేసిన శాఖ ఉన్నతాధికారులు, లేపాక్షి సంస్థ అధికారులు, సిబ్బంది మరియు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరి సమష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకువచ్చే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమైన విషయం.
(1/3)
A voice that echoed for the voiceless. His powerful voice, fearless spirit & songs for justice continue to inspire us even today. His memories and legacy will always remain in our hearts..
Heartfelt tributes to #Gaddar garu 🙏