*జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ శాసన సభ్యులు శ్రీ వరుపుల సుబ్బారావు*
• కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు భారీగా జనసేనలో చేరికలు
@JanaSenaParty@PawanKalyan
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గ��రు కొద్దిసేపటి క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల ��ుర్గేష్ గారు, రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు శ్రీ వై. శ్రీనివాస్, రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్పాలెంకు బయలుదేరి వెళ్లారు. అక్కడ సుందరీకరణ పనులు పూర్తయిన మైసమ్మ చెరువును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
పిఠాపు��ం నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Remembering the legendary Indian actor, Dadasaheb Phalke Awardee and Padma Vibhushan Sri Akkineni Nageswara Rao Garu on his birth anniversary.
His unparalleled contribution to Indian cinema and his instrumental role in bringing the Telugu film industry to Hyderabad will always be remembered and cherished.
Celebrating his legacy and invaluable contribution to Indian cinema.
#ANRJayanthi
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృద���పూర్వక ధన్యవాదాలు.
మీరు నాకు అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత అంకితభావంతో నిర్వర్తిస్తాను. జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాను.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో, పార్టీ నాయకత్వం నిర్దేశించిన విధానాలకు అనుగుణంగా ప్రతి స్���ాయిలో సమన్వయంతో పనిచేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు నా వంతు కృషి చేస్తాను.
@PawanKalyan @JanaSenaParty
#JanaSenaParty
Politics should ultimately be measured by what reaches the last village and the last household.
In Pithapuram, Hon'ble Deputy CM @PawanKalyan is set to launch development works worth about ₹1,500 crore, spanning drinking water, infrastructure, environmental conservation, fishermen’s welfare and women’s empowerment. A renovated drinking-water scheme alone is designed to serve nearly 97,000 people across 52 villages.
Leadership is not about making noise. It is about making a difference people can actually see and feel.
This is the politics of delivery that JanaSena stands for.
@JanaSenaParty@JSPShatagniTeam #PawanKalyan #Pithapuram #PawanKalyanAneNenu
#PawanKalyanForPithapuram
పిఠాపురం నియోజక వర్గంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
•పిఠాపురంలో రెండు రోజులపాటు పర్యటన
•పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
•రూ. 200 కోట్లతో పిఠాపురంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ
•రూ. 80 కోట్లతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్
•అమృత్ పథకం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీకి తాగునీరు
•ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు అధునాతన లైఫ్ జాకెట్లు, డ్రై ఫిష్ యూనిట్లు
•స్వయం సహాయక సంఘాలకు రూ. 120 కోట్ల రుణాల అందజేత
•89 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ
•ప్రజలకు అందుబాటులోకి రానున్న “పీఠికాపుర వనం” ప్రారంభం
•ఆధునీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం ప్రారంభోత్సవం
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాట మేరకు ప్రతి అడుగు అభివృద్ధి వైపు వేస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తన శాఖల పరిధిలోనే కాకుండా, ప్రభుత్వంలోని అన్ని శాఖల సహకారంతో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రజలకు అసాధ్యం అనుకున్న ఎన్నో అభివృద్ధి పనులను సుసాధ్యం చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికల విజయం అనంతరం తొలి అడుగులోనే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. సోమవారం నుంచి రెండు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు, దాదాపు రూ. 1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
సోమవారం ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల పరిధిలోని దాదాపు 52 ఆవాసాలకు చెందిన 97 వేల మందికి పూర్తి స్థాయి అవసరాలకు తగిన విధంగా తాగునీటి సరఫరా చేసేందుకు వీలుగా పునరుద్ధరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథ��ాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పథకం ద్వారా చివరి గ్రామాలకు పూర్తి స్థాయి తాగునీరు అందడం లేదన్న విషయాన్ని గుర్తించి, రూ. 9.59 కోట్లతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధునీకరణ పనులు చేపట్టారు. దీనితోపాటు పిఠాపురం పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో భాగంగా నిర్మించిన పీఠికాపురవనాన్ని ప్రారం���ించనున్నారు. చందుర్తి, తాటిపర్తి బీటీ రోడ్డు, సుందరీకరించిన ఎఫ్.కె. పాలెం మైసమ్మ చెరువులను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటనలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో పిఠాపురం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో రూ. 307 కోట్ల జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల నిధులతో మల్టీ విలేజ్ స్కీం, రూ. 200 కోట్లతో పిఠాపురం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ. 80 కోట్ల ఏఐఐబీ నిధులతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్, అమృత్ 2.0 నిధులతో పిఠాపురం మున్సిపాలిటీ వాటర్ వర్క్స్, మరో రూ. 100 కోట్ల సాస్కీ నిధులతో ���ిర్మించనున్న రోడ్లు, రూ. 118 కోట్ల విలువైన పిఠాపురం ప్రజల చిరకాల కోరిక రోడ్ ఓవర్ బ్రిడ్జి, రూ. 323 కోట్ల ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ, పిఠాపురం మల్టీ విలేజ్ స్కీం తాగునీటి పథకం, పిఠాపురం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, గొల్లప్రోలు వాటర్ వర్క్స్ తదితర అభివృద్ధి పనులు ఉన్నాయి.
వీటితోపాటు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్లో భద్రతతో కూడిన భరోసా నింపుతూ... అధునాతన లైఫ్ జాకెట్లు, డ్రై ఫిష్ యూన���ట్లు, ఐస్ బాక్సులతో కూడిన మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేలా స్వయం సహాయక సంఘాలకు రూ. 120 కోట్ల రుణాలు సెర్ప్, మెప్మాల సహకారంతో అందజేయనున్నారు. 89 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలు అందజేసి వారి భూ హక్కులకు భరోసా కల్పించనున్నారు. రెండు రోజుల పర్యటన ఆద్యంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
@PIB_India @IPR_AP @pibvijayawada
#Pithapuram
ఈనెల 21, 22 వ తేదీలలో గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా....పిఠాపురం నియోజక వర్గ పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు నిమిత్తం పిఠాపురం ఆ��్ ఆర్ బి హెచ్ గ్రౌండ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్...
🚨 JOININGS IN PEDDAPURAM JANASENA
Former Peddapuram Municipal Vice-Chairman Nekkanti Sai Prasad is set to join the JanaSena Party, along with 10 former councillors.
Sai Prasad and the councillors recently resigned from YSRCP and decided to join JanaSena.
#JanaSena#Peddapuram #Kakinada
కొంత మంది యూట్యూబర్లు ఎవరి ప్రోద్భలంతోనో, లేదా ఏ లాభం కోరి ఇటువంటి వార్తలు వ్రాస్తున్నారో తెలియదుకానీ, బాలినేని శ్రీనివాస్ గారి మీద వారు చేసే ఈ అబద్ధపు, విష ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాలినేని గారు మా జనస��న పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే ఆయన మీద ఈ ప్రచారం మొదలు పెట్టారు. ఆయన జనసేన పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు అని ఒకరు, ఆయన వైకాపా కొవర్ట్ అని మరొకరు....ఇలా ఎవరికి తోచినరీతిలో వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా, బాలినేని గారు బెంగుళూరులో జగన్ మోహన రెడ్డి గారిని కలిసినట్టు, తిరిగి వైకాపా లోకి వెళ్తునట్టు ఒక అబద్దపు, విషపూరితమైన ప్రచారము మొదలుపెట్టారు. ఈ ప్రచారం ఒక రాజక��య పక్షానికో లేదా ఒక వర్గానికో ��ొమ్ము కాసే చానల్స్ చేస్తున్నాయని సులభంగా అర్ధమవుతున్నాది.
ఎందుకంటే, బాలినేని గారు జగన్ ని కలిసిందీ లేదు, అసలు జనసేన పార్టీని వదలాలి అనే ఆలోచనాలేదు. ఈ మాట నేను చాలా భాద్యతతో మాట్లాడుతున్నాను.
బాలినేని గారు రాజకీయంగా ఒక పెద్దస్ధాయి ఉన్న నాయకుడు. ఇటువంటి నాయకుడు జనసేన పార్టీ ఎదుగుదలకు చాలా అవసరం అని ఎంతో మక్కువతో స్వయానా మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి పార్టీలో ��ేర్చుకున్నారు.
బాలినేని గారికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా గౌరవం, ఇష్టం కూడా. పవన్ కళ్యాణ్ గారిలాంటి వ్యక్తి మన రాష్రానికి నాయకత్వం వహిస్తే, దేశ రాష్ట్రాలలో మన రాష్ట్రం ఉన్నత స్ధాయిలో ఉంటుంది అని గాఢంగా నమ్మే వ్యక్తి బాలినేని గారు. అలాగే జనసేనా పార్టీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వంలో తగిన న్యాయం జరిగే విధంగా నిబద్ధతతో, నిబ్బరంగా కార్యకర్తల పక్షాన నిలబడే ధైర్యం ఉన్న వ్యక్తి బాలినేని గారు. అందుకనే అటు విపక్షాలు, ఇటు స్వపక్షంలోని కొన్ని వర్గాలు ఆయన మీద ముప్పేట దాడి చేస్త��నే ఉన్నాయి.
ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, బాలినేని గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ లో ఒక బలీయమైన నాయకుడుగా పార్టీకి, మన రాష్రానికి సేవలు అందించడం ఖాయం, ఇది తధ్యం.
@PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri
@balineni_vasu @JanaSenaParty @JSPShatagniTeam
@JSPVeeramahila
Hon’ble Prime Minister of India Shri Narendra Modi presented the ‘Russian translation of the Tirukkural’, published by the Central Institute of Classical Tamil (CICT), to H.E. Mr. Vladimir Putin, President of the Russian Federation, during the 18th BRICS summit in New Delhi on 11th September 2026.
*శ్రీమతి పాలవలస యశస్వి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీ మజ్జి శ్రీనివాస్ రావు గారు (చిన్న శ్రీను గారు)*.
(15-09-2026…… విజయనగరం)
ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు విజనగరం అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారిని ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన డైనమిక్ నాయకులు శ్రీ మజ్జి శ్రీనివాస్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ MSME, SERP & NRI వ్యవహారాల శాఖల మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు గారు తోడు రాగా ఆమె స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కలవడం జరిగినది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జరిగినది.
నాయకులందరు ఆత్మీయంగా పలకరించుకుని, ప్రజా సేవ మరియు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది.#Pawankalyan #ramthaluri #Nagababu #nadendlamanohar #Janasena #veeramahila #vizayanagaram
On the occasion of Vinayaka Chavithi, I visited the Gutchimi Elephant Holding Area in Parvathipuram Manyam District and appreciated the Forest Department’s ongoing elephant conservation efforts and measures being taken to mitigate human–elephant conflict under the leadership of Honourable Deputy CM @pawankalyan garu.
I interacted with elephant trackers, forest officials, mahouts and the veterinarian, and they briefed me the field-level monitoring practices and the movement of wild elephants. I appreciate the dedication and commitment of the Forest Department personnel working on the ground to ensure both wildlife conservation and public safety.
As part of the visit, I planted Raavi and Vepa saplings in the Gutchimi Reserve Forest and had the opportunity to feed nutritious enrichment food to our Kumki elephants, Jayanth and Abhimanyu. Coming just ahead of the Ganesh festival, spending time with these magnificent animals made the visit even more special.
AP-GREEN remains committed to supporting this balance between conservation and human well-being.
#APGREEN #WildlifeConservation #KumkiElephants #AndhraPradesh
Thank you, Shri @PawanKalyan ji, for your kind words and for choosing Keralam for your rest and recovery.
It is heartening to know that the warmth of our people and the darshan at our ancient temples brought you peace and healing.
We look forward to hosting you again soon. On behalf of the Government and the people of Keralam, I wish you a complete recovery and continued good health.
@CMOKeralam@IPRDKerala
DyCM Shri.@pawankalyan welcomed five multitracking railway projects worth ₹10,021 crore, adding nearly 540 km of new capacity.He said the Arakkonam–Renigunta 3rd & 4thLine will strengthen connectivity to Tirupati & Rayalaseema,boost tourism,trade & logistics,and ease congestion.
Parvathipuram,Bobbili,Saluru,Gajapathi Nagaram, Vizianagaram
Entire Vizianagaram area mega fort but aa election results aa candidates aa dynamics naku inka ardam kavu , kevalam manchi leaders leka waste aypothundi
Proper candidates unte mamulu mass chudaru.
Parvathipuram,Bobbili,Saluru,Gajapathi Nagaram, Vizianagaram
Entire Vizianagaram area mega fort but aa election results aa candidates aa dynamics naku inka ardam kavu , kevalam manchi leaders leka waste aypothundi
Proper candidates unte mamulu mass chudaru.