Winter Night time Road safety measures under construction site at Varanasi to Aurangabad Road project.
Good visibility for night Road users #nhai#RoadSafety#morth
Criticism is not a crime. Blocking opposition voices and restricting social media pages exposes the @JaiTDP government’s intolerance of dissent.
A government that fears questions is a government that fears democracy itself.
#YSRCP#JaganannaConnects#AndhraPradesh #SaveDemocracy #FreedomOfSpeech
Makeup మంత్రి అనిత గారూ… “ఎవడో”, “గుడ్డు” అంటూ మాట్లాడే ముందు కాస్త చూసుకోండి! 2014-2019లో మీ నాయకుడు ఏమి సాధించాడో… నేడు నేడు మీ ప్రభుత్వం ఏమి తీసుకొచ్చిందో ప్రజలకు తెలుసు. 20 నెలల వ్యవధిలోనే అమర్నాథ్ గారు ఏపీకు ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, పోర్టు పెట్టుబడులు, భారీ పరిశ్రమలు
రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !
ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు
1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ? అని.
2.రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!
3.ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం! సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన!
4.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?
5. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
6.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు! ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది! దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.
7.విద్యా రంగం దెబ్బతింది! వైద్య రంగం దెబ్బతింది! వ్యవసాయం సంక్షోభంలో ఉంది! ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు! నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
8.ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
9.చంద్రబాబుగారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు.
10.ఈ “నారాసుర పాలన’’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు.
#2YearsForCBNBackStabbing
Wishing K.S. Bharat all the best as he embarks on a new Journey after announcing his retirement from international cricket. Good luck for the future!
@KonaBharat
On the occasion of World Environment Day, let us reaffirm our commitment to protecting nature and conserving the environment for future generations. Sustainability is not just a goal but a responsibility that should be integrated into our lives.
#WorldEnvironmentDay
Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on winning the KFF Singapore Badminton Open 2026 Men’s Doubles title. Proud moment for India and Andhra Pradesh. Wishing them both many more achievements and continued success ahead.
@BAI_Media@satwiksairaj@Shettychirag04
స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి.. దేవునిపై అచంచలమైన భక్తిని, త్యాగనిరతిని చాటిచెప్పే పర్వదినమే బక్రీద్. అల్లాహ్ ఆదేశాల మేరకు తన ప్రాణప్రదమైన కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధమైన ఇబ్రహీం ప్రవక్త మహాత్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పవిత్ర బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#EidUlAdha
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?
1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?
2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?
3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
6.సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి.
8.టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి?
9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..!
English Version- https://t.co/2mfX4zUGzp
.@ncbn గారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉండే APSADAకు తెలియకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులుపెట్టడానికి? ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులవేనన్నవి అక్షర సత్యం కాదా? కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు.
చంద్రబాబుగారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులుకూడా చితికిపోయారు. సిండికేట్ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకు వచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా APSADA అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేస్తే మీరు వచ్చాక ఉద్దేశ పూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్, ఫీడ్ క్వాలిటీ ప్రమాణాలు సహా, వాటి రేట్ల నియంత్రణ దగ్గరనుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, యూనిట్ కరెంటును కేవలం రూ.1.5౦కే వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేశారు. మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప, వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడు రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా?
చంద్రబాబుగారూ.., ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు, పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.
Chandrababu Naidu Garu, under your governance, no sector has been spared from exploitation. In the case of aqua feed prices too, you have colluded with the aqua feed companies and are enabling the looting of aqua farmers.
Every measure our government had taken to support aqua farmers has been systematically weakened, causing severe damage to the farming community.
How can companies increase aqua feed prices without the knowledge or approval of APSADA, the regulatory authority headed by the Chief Minister himself? In this context, is your narrative not misleading? How did these companies gain the audacity to defy both the government and the law? Is it not because they are closely associated with you and your party? Is it not an undeniable truth that these aqua feed companies are sympathizers and supporters of your party? Is it not true that you compromised with them for commissions? That is precisely why you have remained silent despite the continuous hike in feed prices.
Chandrababu Garu, ever since you came to power, aqua farmers, along with all sections of society in the State, have been pushed into distress. During the period of our Government, we enacted laws to protect farmers from syndicates, middlemen, and exploitative companies, and established APSADA as a regulatory body under the chairmanship of the Chief Minister. However, after you came to power, you deliberately weakened and rendered the institution ineffective.
Our government not only took responsibility for regulating seed and feed quality standards and controlling their prices, but also for determining prices for aqua products. We supplied electricity to aqua farmers at just Rs. 1.50 per unit and extended support in every possible way. But after you assumed office, all those systems were dismantled, pushing aqua farmers into severe distress. During the first year itself, when aqua product prices crashed and farmers suffered huge losses, you remained a silent spectator instead of taking responsibility to support them. Now, you are openly backing the exploitation being carried out through the hike in feed prices. Is this not grave injustice to farmers?
Chandrababu Garu, merely building a narrative that the feed price hike is temporary, would not serve any purpose. The increased prices must be completely rolled back. Otherwise, we warn that we will launch protests along with the farmers.
Hello India !!!!!
AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh.
Article 19 of the Indian Constitution guarantees Freedom of Speech, one of the most sacred and non-negotiable pillars of democracy. But today, in Andhra Pradesh, that constitutional guarantee is being subjected to a dangerous, systematic, and deeply disturbing assault under the TDP coalition government led by Chief Minister @ncbn. The Andhra Pradesh Police machinery is increasingly being weaponized as a political tool to intimidate critics, silence opposition voices, and create an atmosphere of fear among citizens who question the government.
A systematic campaign of political vendetta, authoritarian intimidation, and institutional misuse of power is being unleashed against social media activists, YSRCP supporters, journalists, and ordinary citizens who dare to expose the failures, hypocrisy, corruption, and anti-people governance of the TDP coalition.
The modus operandi has now become frighteningly clear and predictable. TDP leaders and their affiliated supporters continuously file politically motivated complaints against social media posts, videos, comments, and opinions that question the TDP government or criticize its leaders. Acting almost immediately on these complaints, the police department rushes to register cases, invoke exaggerated and questionable legal provisions, file false and fabricated FIRs, and begin coercive harassment against dissenting voices.
The misuse of power does not stop there. The police department itself is allegedly sending notices to social media platform X and other social media platforms, demanding the removal of content critical of TDP leaders and seeking the blocking or suspension of accounts that expose government failures or question those in power. This coordinated censorship campaign clearly demonstrates how the Naidu government is using the police department as its political enforcement machinery to control public discourse, crush dissent, and suppress democratic expression.
Such coercive steps exposes the insecure, intolerant, vindictive, and deeply authoritarian mindset of a government that appears terrified of criticism, accountability, transparency, and public scrutiny.
Ironically, while the TDP propaganda ecosystem continuously spreads toxic misinformation, character assassination campaigns, abusive trolling, hate-driven narratives, and malicious attacks against YSRCP leaders and political opponents on a daily basis, complaints filed against them are conveniently ignored. No action, no FIRs, no accountability. This shocking double standard and blatant misuse of state machinery represents a grave attack on democratic values, constitutional freedoms, civil liberties, and the very spirit of democracy itself.
Democracy cannot survive in an atmosphere where fear replaces freedom, intimidation replaces accountability, police institutions become political weapons, and criticism is criminalized. We strongly condemn these draconian, repressive, politically motivated, and anti-democratic actions and demand that the Andhra Pradesh government immediately stop abusing police power, targeting opposition voices, manipulating social media regulation, and throttling democratic dissent.
హలో ఇండియా !!!
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అసమ్మతిని అణిచి వేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను క్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటి వాక్ స్వాతంత్య్రం. దాన్ని మన రాజ్యాంగంలో ఆర్టికల్–19 లో పొందుపర్చారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపించే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా ఇంకా ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైయస్సార్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు, సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు.
ఆ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. తమ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు ఎత్తి చూపుతూ, అందుకు బాధ్యులైన తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏ మాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే తమ పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. చట్ట విరుద్ధంగా, కోర్టులు అనేక సందర్భాల్లో తప్పు పట్టినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, పూర్తి ఏకపక్షంగా, కక్ష సాధింపుతో పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. అలా తప్పుడు కేసులు పెడుతూ, తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. తమ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులు ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక (సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్)లకు నోటీసులు పంపిస్తోంది.
ఆ విధంగా ఒక వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం, ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం, ఆ విధంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో అని చెప్పడానికి ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలు సహించకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావం వల్ల పెల్లుబికుతున్న అసహనం. దాని వల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలు. ఆ దిశలో ప్రభుత్వ చర్యలు తేటతెల్లం అవుతున్నాయి.
అదే అధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రతిరోజూ వైయస్సార్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది. ఆ విధంగా నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది. వాటిపై విపక్ష వైయస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల ఊసే లేదు. ఆ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది.
స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు, పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం, ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం.
అందుకే హేయమైన చర్యలు, అణిచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, పోలీస్‌లను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ, ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం, ప్రతిపక్ష గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ.. మొత్తంగా అసమ్మతిని అణచి వేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.
#UpholdDemocracyInAP
ఎంతైనా మీరు గ్రేట్ @ncbn గారు!! 😏
నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు… 👏
కానీ…!
అధికారులు, కార్యకర్తలు మాత్రం
మీ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు సార్! 🤔🎯🔥
ఇది చూస్తుంటే 🤔🤔
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుడిని,
సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని కూడా గడ్డి పోచతో సమానంగా తీసిపారేస్తున్నట్టుంది సార్! 😏🔥
దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్ర నాథ్ ఠాగూర్ గారు. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు.
#RabindranathTagore
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
Heartiest birthday greetings to the Hon’ble Vice President of India, Shri C.P. Radhakrishnan Garu. May God bless you with a long and healthy life in the continued service of our nation.
@CPR_VP@VPIndia
కార్మికులు..
సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారు
దేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు
ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు
అభివృద్ధి వెలుగులకు జీవం పోసే కనిపించని హీరోలు నా శ్రామికులు.
కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.
#InternationalWorkersDay
Deeply concerned to hear about the hospitalization of Hon’ble Governor Shri Justice S. Abdul Nazeer garu. Wishing him a speedy recovery and praying for his good health.
@governorap