రాష్ట్రానికి చెందిన యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికను, ఆమె కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఇటీవల ఫిడే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను దక్కించుకున్న నిహారికను అభినందించాను. ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించడమే తన లక్ష్యమని నిహారిక వివరించారు. ఇందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చాను.
పూర్వీకుల జ్ఞాపకాలకు ప్రణామం.. పితృదేవతల ఆశీస్సులకు అభివందనం! 🙏
భాద్రపద బహుళ అమావాస్య.. పితృఋణం గుర్తుచేసే పవిత్ర సందర్భం. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పించిన ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు.. ఆధునిక ఆలోచనలకు, మన సంస్కృతి సంప్రదాయాలకు సమాన గౌరవం ఇస్తూ భారతీయ విలువలను చాటారు.
వేరు ఎంత బలంగా ఉంటే.. వృక్షం అంత ఉన్నతంగా ఎదుగుతుంది. పూర్వీకుల ఆశీస్సులే మన ప్రస్థానానికి బలం! 🙏
#Pattiseema
పట్టిసీమతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.. ఆ ప్రాజెక్టు వేస్ట్, మోటార్లు పీకిపారేస్తామని అసెంబ్లీ వేదికగా నాడు రెచ్చిపోయారు గొడ్డలి పార్టీ నేతలు. అప్పుడు వేస్ట్ అన్న పట్టిసీమే పుష్కర కాలంగా కృష్ణా డెల్టాను కాపాడుతోంది. ప్రస్తుత ఎల్ నినో కరువు పరిస్థితుల్లోనూ వరప్రదాయినిగా మారింది. నాడు 4.2 టీఎంసీలతో మొదలైన ప్రస్థానం నేడు 500 టీఎంసీలకు చేరింది. సీఎం చంద్రబాబు గారి విజన్ కు పట్టిసీమ ఒక ఉదాహరణ.
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
స్థానిక సంస్థల్లో బీసీలకు 34% కంటే ఎక్కువ పదవులు ఇస్తాం. తగ్గేది లేదు. కూటమి పార్టీలు దీనికి కట్టుబడి ఉన్నాయి. అనుమానం ఉంటే ఎన్నికలయ్యాక భూతద్దం పెట్టి వెతుక్కోండి. స్థానిక సంస్థలన్నింటిలో కలిపి రాజ్యాంగబద్దంగా బీసీలకు సగటున 28.18 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయి.
- మంత్రి అచ్చెన్నాయుడు
#TDPWithBCs
#ChandrababuNaidu
#AndhraPradesh
స్థానిక సంస్థల్లో బీసీలకు 34% కంటే ఎక్కువ పదవులు ఇస్తాం. తగ్గేది లేదు. కూటమి పార్టీలు దీనికి కట్టుబడి ఉన్నాయి. అనుమానం ఉంటే ఎన్నికలయ్యాక భూతద్దం పెట్టి వెతుక్కోండి. స్థానిక సంస్థలన్నింటిలో కలిపి రాజ్యాంగబద్దంగా బీసీలకు సగటున 28.18 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయి.
- మంత్రి అచ్చెన్నాయుడు
#TDPWithBCs
#ChandrababuNaidu
#AndhraPradesh
పట్టిసీమ ద్వారా రాయలసీమకు జలకళ సంతరించుకుంది. కృష్ణా డెల్టా అవసరాలు పట్టిసీమ తీర్చడంతో, శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని వెలిగొండ, పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు తరలించింది కూటమి ప్రభుత్వం.
#Pattiseema#ChandrababuNaidu#AndhraPradesh
బీసీలు టీడీపీకి వెన్నెముకలాంటి వారు అని, బీసీల ప్రయోజనాలను కాపాడటంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని... కోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీ పరంగా 34 శాతం స్థానాలను బీసీలకు ఇచ్చి తీరుతాం అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసారు.
#JayahoBC#TDPWithBCs#NaraLokesh#ChandrababuNaidu
#AndhraPradesh
50 ఏళ్ల నిరీక్షణకు తెర.. గర్భకండ్రిక రైతులకు భరోసా!
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని గర్భకండ్రిక భూముల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండపిలో 8 గ్రామాల రైతులతో సమావేశమైన సీఎం, నర్సింగోలులో వారి కష్టాలను స్వయంగా విని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు పరిష్కార మార్గం చూపించారు.
నాలుగు మండలాల్లోని 8 గ్రామాలకు చెందిన 1,301 మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా 2,915.10 ఎకరాల భూముల సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. కొండపి, జరుగుమిల్లి, నాగులుప్పలపాడు, సింగరాయకొండ మండలాల్లోని రైతులకు భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాల జారీకి చర్యలు చేపట్టారు.
ఏళ్ల తరబడి తమ భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది. తమ సమస్యను స్వయంగా విని పరిష్కారానికి చొరవ చూపిన ముఖ్యమంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
బీసీలు టీడీపీకి వెన్నెముకలాంటి వారు అని, బీసీల ప్రయోజనాలను కాపాడటంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని... కోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీ పరంగా 34 శాతం స్థానాలను బీసీలకు ఇచ్చి తీరుతాం అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసారు.
#JayahoBC#TDPWithBCs#NaraLokesh#ChandrababuNaidu
#AndhraPradesh
బుచ్చిరెడ్డిపాళెంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం ఉద్యాన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి పంటల దిగుబడి, మార్కెట్ ధరలను అడిగి తెలుసుకున్నాను. తోటలో కూరగాయలు, బంతిపూలను స్వయంగా కోసి, రైతుల సాగు అనుభవాలను తెలుసుకున్నాను. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను.
#VemireddyPrashanthiReddy #FarmersWelfare #FarmersWelfare #Kovur #IdhiManchiPrabhutvam
సమాజంలో 50 శాతం కంటే ఎక్కువగా వెనకబడిన వర్గాలున్నాయి... టీడీపీకి 45 ఏళ్లుగా వెన్నెముకగా, అండగా నిలిచారు
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు చేశాం. ఎన్టీఆర్ 24 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెస్తే... నేను 34 శాతానికి పెంచా. కానీ గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది
మళ్లీ రిజర్వేషన్లు పెంచితే గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంది. బీసీలంటే గొడ్డలి పార్టీకి గిట్టదు. అయినా ఎన్డీఏ కూటమి నుంచి 34 శాతం స్థానాలు పార్టీ తరపున ఇస్తాం.
- కొండపి సభలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు.
#ChandraBabuNaidu #TeluguDesamParty #JayahoBC #TDPWithBCs #AndhraPradesh
సోలార్ విద్యుత్ తయారీలో ఆంధ్రప్రదేశ్ రికార్డులు బద్దలు కొడుతోంది. నిన్న కడప జిల్లాలో 11 నెలల్లో SAEL నిర్మించిన 600 మెగావాట్ల భారీ సౌర విద్యుత్ కేంద్రం అందుబాటులోకి రాగా.. తాజాగా 18 నెలల్లో ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేటలో ఏర్పాటు చేసిన 7 గిగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ సెల్ తయారీ ప్రాజెక్టు ప్రారంభమైంది.
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
ఏడుపదుల వయసు దాటినా..
ఆయనలో తగ్గని యువత ఉత్సాహం!
రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా..
అలుపెరుగని అడుగులు, ఆగని ఆలోచనలు!
ఏడు రోజులు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు.. రూ.1.79 లక్షల కోట్ల పనులతో నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కొత్త ఊపిరులు!
వయసు ఓ అంకె మాత్రమే.. విజన్‌కు హద్దులే లేవు.. ఆలోచనలో వేగం.. ఆచరణలో దూకుడు.. ప్రజల భవిష్యత్తే ఆయన ముందడుగు!
ఆయన ఆలోచన ఓ విజన్.. ఆయన ప్రతి అడుగు ఓ అభివృద్ధి శకం.. ఆయన పేరే @ncbn .. ఆయన ఆలోచనల వేగమే
బుచ్చిరెడ్డిపాళెం సీహెచ్‌సీకి రూ.39 లక్షల విలువైన వైద్య పరికరాలు, ఫర్నీచర్‌ను ఐఆర్ఈడీఏ సీఎస్ఆర్ నిధులతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సమకూర్చాం. అల్ట్రాసౌండ్, థైరాయిడ్ పరీక్షల యంత్రాలతో పాటు అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చాం.
గతంలో నెలకు 30గా ఉన్న ప్రసవాల సంఖ్య ప్రస్తుతం 46కు పెరగడం సంతోషకరం. వైద్యులు, సిబ్బందికి నా అభినందనలు. ఈ పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను.
#VemireddyPrashanthiReddy #VPRFoundation #HealthcareForAll #Kovur