ఏఎస్ఆర్ జిల్లా పేలుడు ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆరా
అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం పినకోట సమీపంలో వాహనంలో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వాహనంలో పేలుడుకుగల కారణాలను ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం టిప్పర్ వాహనంలో డీజిల్ తరలిస్తున్న సమయంలో మరో వాహనాన్ని ఢీ కొట్టడం కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. పేలుడు ధాటికి నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ పేలుడుకుగల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ విజయదశమి పర్వదినాన, ఆ జగన్మాత శక్తి స్వరూపిణి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
#Vijayadashami2026
#HappyDussehra
#HappyDussehra2026
వైసీపీ పై శ్రీ కిరణ్ రాయల్ ఆగ్రహం ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ గారు వేసిన రోడ్లు ధ్వంసం
రూ.4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును అర్ధరాత్రి ధ్వంసం చేశారు
ప్రజల రాకపోకల కోసం నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం
కూటమి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే విధ్వంసానికి పాల్పడ్డారు
ప్రజలు వినియోగించే రహదారిని ధ్వంసం చేయడం హత్యకన్నా దారుణం
ఏకగ్రీవాలపై గతంలో జగన్ చేసిన ప్రకటనకు ఇప్పుడేం సమాధానం చెబుతారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై జగన్ చర్యలు తీసుకుంటారా…?
ఒంగోలు కార్పొరేషన్ 1వ వార్డు కూటమి అభ్యర్థి గా జనసేన పార్టీ నుండి మావారి నామినేషన్ పత్రాలు ఎలక్షన్ అధికారులకి అందచేయటం జరిగింది..
@JanaSenaParty.
@PawanKalyan garu
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ @PawanKalyan గారితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ @DrMohanYadav51 గారు భేటీ
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల వారి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోహన్ యాదవ్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య అభివృద్ధి సంబంధితమైన పలు కీలక అంశాలపై చర్చించారు.
ప్రధానంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలో పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేసే అంశాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అలాగే, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో గౌర్ (అడవి దున్నలు) పునఃప్రవేశానికి సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
* ఉప్పాడ పట్టు శాలువా, కొండపల్లి కళాకృతి బహూకరణ
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ పట్టు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం కొండపల్లి కళాకృతిని, శ్రీకాళహస్తి పెన్ కలంకారీ కళాకారులు రూపొందించిన శ్రీ దుర్గాదేవి చిత్రపటాన్ని, అరకు కాఫీని బహూకరించారు.
శ్రీ మోహన్ యాదవ్ గారు శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిమను, జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించిన జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచారం రథంను జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు శుక్రవారం హైదరాబాదులో ప్రారంభించారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా డా. గడల శ్రీనివాసరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, సూచనలు చేశారు.
ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఎన్నికల ప్రచార వాహనంగా కాకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని స్పష్టం చేశారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వం, ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఆకర్షితులై తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, యువత, డిజిటల్ మీడియా ప్రతినిధులు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం లక్ష్యంగా ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాజకీయ, సామాజిక, విద్యా, వ్యాపార, క్రీడా, డిజిటల్ మీడియా తదితర రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తులు జనసేనలో భాగస్వాములు కావడం ద్వారా పార్టీ సంస్థాగత విస్తరణకు, ప్రజా సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరనుంది.
-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
@VangaveetiOffl
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
చింత చెట్టు చెంతన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు
అడిగిన వెంటనే గిరిజనులకు అభివృద్ధి వరాలు
‘మాటా-మంతి’లో వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారాలు
సుమారు రూ. 5 కోట్లతో పాఠశాలలు, ఆసుపత్రులు తదితర అభివృద్ధి పనులకు మంజూరు
కాకవాడ–వేములకొండ అడవి తల్లి బాట రహదారికి శంకుస్థాపన అనంతరం గిరిజనులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటా-మంతి
అడవి బిడ్డల కష్టాలు తెలుసుకునేందుకు అరణ్యం మధ్యలోని గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. సుమారు 350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామాన్ని సందర్శించి, గిరిజనుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చింత చెట్టు కింద కూర్చుని వారితో మమేకమయ్యారు. గిరిజనులు ప్రస్తావించిన సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కారాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ‘అడవితల్లిబాట 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఆదివారం పోలవరం జిల్లా పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గం, వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామానికి చేరుకున్నారు. అదే పంచాయతీ పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ. 2.29 కోట్ల వ్యయంతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న రచ్చబండ వద్ద గిరిపుత్రులతో ‘మాటా-మంతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాఠశాల, ఆరోగ్య కేంద్రం, ఆలయ అభివృద్ధికి నిధులు
రాకోట గ్రామ సందర్శన సందర్భంగా అక్కడి ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు దాని పునరుద్ధరణకు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. రాకోట గ్రామస్థుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేకుల షెడ్డులో కొనసాగుతున్న ఆలయ పరిస్థితిని గమనించిన ఆయన, దేవాదాయ శాఖ సహకారంతో భజన మందిరంగా అభివృద్ధి చేసేందుకు మరో రూ. 20 లక్షలు కేటాయించారు.
గిరిజన గ్రామాల సమస్యలకు తక్షణ పరిష్కారాలు
‘మాటా-మంతి’ కార్యక్రమంలో రాకోట పరిసర ప్రాంతాలైన వేములకొండ, సువర్లవాడ, డబ్బావలస, తిరుగటిరాళ్లు, కాకవాడ, చిలకవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రతి గ్రామానికి అంగన్వాడీ కేంద్రంతో కూడిన మండల పరిషత్ పాఠశాల, విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా దాదాపు రూ. 5 కోట్లు కేటాయించారు. గిరిజనులు తమ సమస్యలను స్వయంగా ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో గిరిపుత్రుల్లో భరోసా నింపారు.
రహదారి పొడవునా పూలు పరిచి.. ఘన స్వాగతం పలికిన గిరిజనులు
‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తమ గ్రామానికి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాకోట గ్రామ గిరిజన మహిళలు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయాలను అనుసరిస్తూ స్థానికంగా లభించే పూలతో తయారు చేసిన బొకేలను అందజేశారు. జలహారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ తమ గ్రామంలోకి ఆహ్వానించారు.
మండల పరిషత్ పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
రాకోట గ్రామానికి చేరుకున్న వెంటనే పక్కనే ఉన్న ఎంపీపీ పాఠశాలను ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. చిన్నారులను పలకరించి, పాఠశాల భవనాలతో పాటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాన్ని సందర్శించారు. పాఠశాల భవనం మరమ్మతుల కోసం రూ. 20 లక్షలు కేటాయించారు. విద్యార్థులకు తినుబండారాలు అందించారు.
వెదురు ఉత్పత్తుల విలువ పెంపునకు సహకారం
అనంతరం రాకోట గ్రామంలో వెదురు బొంగులతో గృహోపకరణాలు తయారు చేస్తున్న శ్రీ కొమ్మిరెడ్డి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులు పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెర్ప్ ఆధ్వర్యంలో వెదురు ఉత్పత్తుల ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. వెదురు ఉత్పత్తులకు మరింత విలువ జోడించి, గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభించేలా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.
వ్యవసాయదారులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కాకవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముందు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద వాటర్‌షెడ్ అభివృద్ధి పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.68 కోట్ల వ్యయంతో 34 వేల మంది అర్హులైన రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన రైతులకు పరికరాలను పంపిణీ చేశారు.
ఒక రోడ్డంటే కేవలం రహదారి కాదు.
ఒక బిడ్డ భవిష్యత్తు, ఒక తల్లి ప్రాణం, ఒక గ్రామం ఆశ, అన్నింటికి ఆ రహదారే ఆధారం.
ఇక్కడ రోడ్డంటే జీవితం.
గిరిజనుల జీవనాభివృద్ధి కోసం అడవితల్లి బాట.
#AdaviThalliBaata