"ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆగే ప్రసక్తి లేదు. ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా... సాగునీరు, తాగునీరు కోసం తలపెట్టిన 'సమరశంఖారావం' కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది."
- శిల్పా చక్రపాణి రెడ్డి
పవిత్రమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని ప్రజలంతా అత్యంత భక్త���శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
సుదీర్ఘకాలం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ మంత్రి,కాపు ఉద్యమనేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు శివైక్యం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన లేని లోటు పూడ్చలేనిది.వారి పవిత్ర ఆత్మకు సద్గతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి!
సృష్టికి మూలం అమ్మ. నిరంతరం మన ప్రగతి కోసం తపించే ప్రతి అమ్మకు పాదాభివందనం. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిది. అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
#Mothersday
కఠినమైన ఉపవాసం.. నిష్కల్మషమైన ప్రార్థన.. పేదలకు చేసే సాయం.. ఇదే రంజాన్ సందేశం. ఆ అల్లాహ్ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని, ఎనలేని శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ.. శ్రీశైలం నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులందర��కీ రంజాన్ ��ుభాకాంక్షలు.
#EidMubarak
టి20 వరల్డ్ కప్లో విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు 🇮🇳🏆
ఈ అద్భుత విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం.ఆటగాళ్ల అంకితభావం, కృషి దేశానికి గర్వకారణం.ఈ ఘనత సాధించిన జట్టుకు నా శుభాకాంక్షలు.
@ICC@BCCI#T20WorldCup#TeamIndia#Champions#ProudMoment
విశ్వ విజేతలుగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు.
విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత్ మహిళా క్రికెట్ టీమ్ జట్టును చూసి దేశం గర్విస్తోంది.భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన విజయం, భావితరాల మహిళలకు క్రి��ెట్ మహిళా అభిమానులకు ఎంతో స్ఫూర్తిదాయకం.
ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు, జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#MahatmaGandhi#MahatmaGandhiJayanti
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే విజయదశమి. ఈ పర్వదినాన ఆ విజయ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని, మంచి ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని మనసారా క��రుకుంటూ.. అందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు.
#dussehra #vijayadashami #HappyNavaratri #navaratri2025 #Dasara2025
బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా... శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 21-07-25వ తేదీన నుండి 30-07-25 వరక�� కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
కార్యక్రమం వివరాలు.
@YSRCParty @ysjagan @peddireddyysrcp @katasaniysrcp
నేడు నంద్యాల జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు
#SilpaChakrapaniReddy#Srisailam
ప్రతి వ్యక్తికి తొలిహీరో నాన్న. కుటుంబ బాధ్యతలను మోస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసే వ్యక్తి నాన్న. పిల్లల భవిష్యత్తే సర్వస్వంగా జీవించే ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే.
#happyfathersday
జమ్ముకశ్మీర్లో దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ గారి మృతి అత్యంత బాధాకరం. శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందిన ఈ వీరుడు తన అసాధారణ ధైర్యంతో మనందరికీ స్ఫూర్తి. ఆయన త్యాగం ఎప్పటికీ మరువలేనిది. ఆయన ఆత్మకు శా���తి కలగాలని ప్రార్థిస్తున్నాను.
మనుషుల్లో ప్రేమ తత్వాన్ని నింపడం కోసం, సమాజంలో శాంతి స్థాపన చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేయడమే కాకుండా... ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను కూడా త్యాగం చేసారు క్రీస్తు. ఇతరుల కోసం జీవించే జన్మ చరితార్ధమని నిరూపించిన త్యాగధనుడు ఏసుక్రీస్తు బోధనలను గుడ్ ఫ్రైడే సందర్భంగా స్మరించుకుందాం!