The pride of India, @humpy_koneru, has won the 2024 FIDE Women's World Rapid Championship for the second time! She is an inspiration to many, particularly those balancing professional and personal life. Wishing her many more victories!
నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ..అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నా వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకో���ేనిది.
16-12-2024
మచిలీపట్నం.
కూటమి ప్రభుత్వం కక్ష స���ధింపు చర్యలు ఎదుర్కొంటున్నవైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)ని వైయస్సార్సీపీ నేతలు పరామర్శించారు. ఇవాళ మచిలీపట్నంలోని ఆయన నివాసంలో నానిని కలిసిన వైయస్సార్సీపీ మాజీ మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, పెడన సమన్వయకర్త ఉప్పాల రాము ఆయనకు సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాల మీద నిలదీస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ... కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ తీరుపై వారు మండిపడ్డారు. మాజీ మంత్రుల నుంచి సాధారణ కార్యకర్తల వరకూ అందరిపైనా అక్రమ కేసులు బనాయిస్తూ.. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. అందులో భాగంగానే ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తున్న పేర్ని నాని కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్త���ందని... నాని కుటుంబానికి వైయస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
#SadistChandraBabu
#MosagaduBabu
On this special day of Vijay Diwas, we remember and salute the bravery and sacrifice of our armed forces. Their valor and determination in the historic 1971 victory liberated a nation and etched India’s courage in history. Jai Hind!
సామాజిక విప్లవ దార్శనికుడు, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. ఆయన స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేశాం. ఆయన జీవితం అందరికీ ఆ��ర్శనీయం.
Our Sovereign, Socialist , Secular, Democratic Republic guarantees us Justice, Equality, Liberty, and Fraternity. As we celebrate the 75th Constitution Day, let us reflect on its significance and reaffirm our unwavering commitment to its guiding principles.
The cornerstone of Democracy is electing the public representatives. Widespread concern across the nation about the functioning of EVMs prompts us to question the veracity of EVMs and to ask ourselves why we should not go to the polls with ballot papers as is the practice in a majority of countries across the world. Democracy should not only be prevalent but also be seen to be thriving.
The other significant concern in recent times has been an aggressive attempt to quell freedom of speech, the most important fundamental right guaranteed to the citizens of our country.
On this auspicious day, we pay tribute to Dr. B.R. Ambedkar and the visionary leaders who shaped our Constitution, guiding us towards a unified and equitable India.
#ConstitutionDay
#75YearsOfConstitution
#SamvidhanDivas
1.@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది.
2.చంద్రబాబుగారు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, సీబీఎస్ఈ నుంచి ఐబీదాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు.
3.వైయస్సార్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర��తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకూ రూ. 12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైయస్సార్సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేశాం.
4.ఎన్నికల కోడ్ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్ లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్��ాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్లో అయినా ఇచ్చారా అంటే అదీలేదు. అప్పటినుంచి ఒక్కపైసాకూడా చెల్లించడంలేదు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితికూడా అంతే. తర్వాత ఏప్రిల్-జూన్, తర్వాత జులై-సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజులు చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడ్డంలేదు. ఇప్పుడు అక్టోబర���-డిసెంబరు త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతిదీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరుచూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి, కాళ్లేమో గడపకూడా దాటడం లేదు.
5.ఫీజులు కట్���కపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీలేనివారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి.
6.ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫి���ా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే స్కాంలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధలేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదలచేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబుగారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు ��్రసాదించాలని ప్రార్థిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..
మీ
సింహాద్రి రమేష్ బాబు
మాజీ శాసనసభ్యులు
అవనిగడ్డ నియోజకవర్గం
.@ncbn గారు .. ప్రజలకు సూపర్సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.
నీవు చీటర్వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?
ఆడబిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్?
దీపం:
ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్?
తల్లికి వందనం:
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్?
అన్నదాత:
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్?
ఉచిత బస్సు ప్రయాణం:
రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి ర���.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.
యువగళం:
రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్
50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప���పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.
నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?
ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు.
నాతో స���ా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు.
#WeStandForTruth
#WeAreWithYSRCPSM
ఈ రోజు అవనిగడ్డ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన ఎంపీటీసీ సభ్యుల ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఎంపీటీసీలు అందరికీ సర్టీఫికెట్లను అందచేయడం జరిగింది..
Bharat Ratna Dr. APJ Abdul Kalam's story of persistence, ability, and sheer courage is a guiding light to millions who dare to dream and work towards its fulfillment. My humble tributes to the 'People's President', the legendary Missile Man on his birth anniversary.
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..
కోవిడ్ నుండి కోలుకుని డీచార్జ్ అయ్యాను. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను కానీ ఇంకో వారం రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండి ఆ తర్వాత మీ అందరినీ కలుస్తాను..
మీ
సింహాద్రి రమేష్ బాబు