.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 క���ట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్���ం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడ�� త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్సీపీ ప్రభుత్వం బకాయిలు ��ెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రై��ాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్��ైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
��ానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధ�� ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…
వేల ఏళ్లుగా విశాఖను తుపానుల బారి నుంచి కాపాడుతున్న కైలాసగిరి, యారాడ, సింహాచలం కొండల వలయాన్ని నేడు 'అభివృద్ధి' పేరుతో తవ్వేస్తున్నారు.
విశాఖపట్నం చుట్టూ అర్ధచంద్రాకారంలో ఉన్న తూర్పు కనుమల కొండలు నగరానికి ఒక 'సహజ రక్షణ కవచం. సముద్రం నుంచి వచ్చే తుపాను గాలుల వేగాన్ని తగ్గించి, సముద్రపు ఉప్పెన నగరంలోకి రాకుండా ఇవి అడ్డుకుంటాయి..
కానీ నేడు అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా కొండలను తవ్వేయడం వల్ల:
1️⃣ కొండచరియలు విరిగిపడే ప్రమాదం
2️⃣ చిన్న వర్షానికే ఆకస్మిక వరదలు (Flash Floods)
3️⃣ భూగర్భ జలాల్లోకి ఉప్పునీరు చేరడం
4️⃣ నగరంలో విపరీతమైన వేడి పెరగడం వంటి తీవ్ర నష్టాలు పొంచి ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి జరగాలి.
#SaveVizagHills #Visakhapatnam #Vizag
విశాఖపట్నం..,తూర్పు కనుమలు సముద్రంతో కలిసే ఏకైక ప్రదేశం.పచ్చటి కొండలు-సముద్రం కలయికతో అందమైన ప్రకృతి సౌందర్యం కలిగిఉండటమే ఈ సిటీ ఆఫ్ డెస్టిన�� ప్రత్యేకత.కాని నేడు నగరంలోని నలుమూలల్లో ఆ పచ్చని కొండలపై పర్యావరణ విధ్వంసం యధేచ్ఛగా జరుగుతోంది.నగర వైశిష్ట్యాన్ని నాశనం చేసే
కుట్ర ఇది.🤔
A fire broke out in the early hours of today at K. Pallepalem in Kothapatnam mandal of Prakasam district. Fishermen’s nets and fishing equipment were destroyed, causing an estimated loss of Rs. 5 crore and affecting the livelihoods of 300 families. The fishermen who met me today said they watched helplessly as the nets they had prepared for fishing went up in flames. Their words deeply moved me.
@ncbn garu, these families depend on their daily catch to make ends meet. I demand that your government assess the losses immediately and provide full compensation to every affected family.
I also assure our fisher brothers that if this government fails to support you, we will provide compensation as soon as our government returns to power. Please do not lose heart.
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.
@ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న���్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
From a humble beginning in Ranchi to conquering the pinnacle of the sport, @msdhoni’s journey is a story of extraordinary grit, self-belief, and leadership.
As he bids farewell to active cricket, we celebrate not just the trophies, but the countless times he stood tall in the team's toughest moments, absorbing the pressure and guiding the side with a quiet smile. He leaves behind a wonderful and inspiring legacy that will be cherished by generations to come.
Wishing him the very best in his new role as Mentor and every happiness ahead.
#MSDhoni
విశాఖపై కూటమి ప్రభుత్వనికి ఎందుకు అంత పగ..??
విశాఖలో ఉన్న కొండలకు ఎందుకు బోడి గుండు కొడుతున్నారు??
ప్రకృతి విధ్వంసం ఎందుకు చేస్తున్నారు??
#SaveAPFromTDP#SaveAPFromKutami
AP ప్రజలకు ఒక్క పేపరైనా, ఒక్క పచ్చడి బాటిలైనా ఉచితంగా ఇవ్వలేదు
పైగా రాసినవన్న�� విషపురాతలే… జర్నలిజానికి మాయని మచ్చ
అటువంట వ్యాపారికి ప్రజల సొమ్ముతో స్టేట్ ఫంక్షన్
ఖర్మరా నాయనా💦💦💦
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించలేదు.
దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య జయంతికి ఆ గౌరవం ఇవ్వలేదు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించలేదు.
సంఘ సంస్కర్త, వితంతు పునర్వివాహ ఉద్యమకర్త కందుకూరి వీరేశలింగం జయంతికి గుర్తింపు ఇవ్వలేదు.
ఆంధ్రకేసరి, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, రైతు ఉద్యమ నేత ఆచార్య ఎన్జీ రంగా వంటి మహనీయుల జయంతులకు ఈ గౌరవం దక్కలేదు.
ఇక తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జయంతిని కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించలేదు!
మరి వీరందరి కంటే రామోజీరావు గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయన జయంతిని మాత్రమే రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి చంద్రబాబు గారికి ఉన్న ప్రాతిపదిక ఏమిటి?
రాష్ట్ర గౌరవాలు… వ్యక్తిగత అభిమానం, రాజకీయ అనుబంధాల ఆధారంగా నిర్ణయించాలా?
లేక చరిత్రలో వా��ి సేవలు, త్యాగాలు, ప్రజలకు చేసిన కృషి ఆధారంగా నిర్ణయించాలా?
చంద్రబాబు గారూ… ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి!
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్��ున్నాను.