పెద్దలు, సీనియర్ నాయకులు నాదెండ్ల భాస్కర్ రావు గారి మరణం బాధాకరం. 1970వ దశకం నుంచే ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తుతం ఏపీలో మంత్రిగా రాణిస్తున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు గారి ఆత్మకు శాంతిచేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
కృష్ణపట్నంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణంపై ఈ రోజు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కీలక అడుగు వేశాం. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయ ప్రాచీనత కోల్పోకుండా పునఃనిర్మాణం జరపడం కోసం ఆర్కియాలజీ చీఫ్ మునిరత్నం రెడ్డి గారితో పాటు దేవాదాయ శాఖ స్తపతులు, చీఫ్ ఇంజనీర్లతో కలిసి సమీక్ష నిర్వహించాం. రెండేళ్లలో ఆలయ పునఃనిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 10వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయాన్ని పునఃనిర్మించే అవకాశం మాకు లభించడం మా అదృష్టం.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ -2025 అవార్డు అందుకున్న ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారికి శుభాకాంక్షలు. విజనరీ లీడర్ నాయకత్వంలో మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు మరింత ఊపందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
పెనుశిల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెంచలకోనలో దేవదేవేరులను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ పెంచలస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నాను.
పదో తరగతిలో సత్తా చాటిన గిరిజన బిడ్డలు
నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నిరక్ష్యరాస్యత అధికంగా ఉండే గిరిజన కుటుంబాల నుంచి వచ్చిన నిరుపేద ఆడబిడ్డలు అత్యుత్తమ ఫలితాలు సాధించడం గొప్ప విషయం. వెంకటాచలం మండలం గొలగమూడిలోని ప్రభుత్వ ఎస్టీ ఆశ్రమ బాలికల పాఠశాలలో 62 మందికి గాను 58 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 50 మంది గిరిజన బిడ్డలే. అత్యంత నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ బిడ్డలు 90 శాతంపైగా మార్కులు సాధించడం విశేషం. మరో నలుగురు ఒక్కో సబ్జెక్టులో ఫెయిల్ అయినప్పటికీ సప్లిమెంటరీలో వారు కూడా ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటున్నాను. ఈ బిడ్డల్లో ఏ ఒక్కరి చదువు పదో తరగతితో ఆగిపోకూడదు. ఉన్నత విద్యకు వెళ్లే క్రమంలో ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలుస్తానని తల్లిదండ్రులకు మాటిస్తున్నాను. ప్రతి గిరిజన బిడ్డ చాగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడమే నా ఆకాంక్ష.
#APSSCResults
బెంగళూరు సర్జాపూర్ లోని గ్రీన్ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు
బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
#NaraLokesh
రాయలసీమని రాజకీయం కోసమే వాడుకున్న నువ్వా మాట్లాడేది @ysjagan?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎన్జీటీ ఆదేశాలతో మీ హయాంలోనే ఆగిపోయింది. అప్పుడు నిద్రపోయావా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే, తెలంగాణ సభలో అప్పటి మంత్రి హరీష్ రావు రాయలసీమ ప్రాజెక్ట్‌ను ఆపింది మేమే అని చెప్పలేదా?
నీ హయాంలోనే ఆగిపోయిన ప్రాజెక్ట్‌ను మళ్లీ మేము ఎలా ఆపగలం జగన్, బుర్ర పని చేస్తుందా?
#PsychoFekuJagan
#PayyavulaKeshav
#AndhraPradesh
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ చేసిన దుర్మార్గం నుంచి బయటపడేస్తున్న కూటమి ప్రభుత్వం.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే రోజు రూ.2,950 కోట్లు విడుదల. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభం. అదే సమయంలో, సర్వీస్‌లో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Warm congratulations to Shri Nitish Kumar ji on taking oath as a Member of the Rajya Sabha. A leader of immense experience and administrative depth, his wisdom will be a valuable asset in strengthening governance and advancing nation-building. Wishing him a productive and impactful tenure in Parliament.
@NitishKumar
గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను. రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నాను. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాను. ఇందులో భాగంగా నేడు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించి భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందచేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ ముగించి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆటో మ్యూటేషన్ తరువాత పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా ప్రజల ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించాను. భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తాం. వారికి భద్రత, భరోసాను కల్పిస్తాం.
#PattadarPassbooks
2015 నుంచే CRDA ఏర్పాటు చేసి, అమరావతి, విజయవాడ, గుంటూరు కలుపుకుని పని చేస్తున్నాం… ఇప్పుడు అమరావతి అనే పేరు పలకటం ఇష్టం లేక కథలు చెబుతున్నాడు.
#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
#PsychoFekuJagan
అసత్యాలు ప్రచారం చేయడం ఒక్కటే తమ జీవిత ధ్యేయం అన్నట్లు వైకాపా నాయకులు ప్రవర్తిస్తున్నారు. అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తమ ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. 2018లో అమరావతి బాండ్స్ విడుదల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చేసిన ప్రసంగంలో దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి చెబితే దాన్ని ముందు భాగం కట్ చేసి, అమరావతి రాజధానికి అవసరమైన నిధుల గురించి చెబుతున్నట్లుగా ఒక ఫేక్ వీడియోను వైకాపా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, దేశంలో సుమారు 30 శాతం సేవింగ్స్ ఉంటాయని, అంటే ప్రతి సంవత్సరం సుమారు 750 బిలియన్ డాలర్ల సేవింగ్స్ సాధ్యమవుతాయని గౌరవ ముఖ్యమంత్రి తన 2018 నాటి ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే భారత్ ప్రస్తుతం 10 నుంచి 12 శాతం వృద్ధి సాధించే సామర్థ్యం ఉందని, సరైన ప్రణాళికలు అమలు చేస్తే 15 శాతం వరకు వృద్ధి సాధ్యమవుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా వృద్ధి కొనసాగితే పదేళ్లలో సుమారు 10 ట్రిలియన్ డాలర్ల సేవింగ్స్ సమీకరించవచ్చని ఆయన అన్నారు. దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రసంగంలోని ‘‘2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని’’ అన్న వాక్యానికి ముందు చెప్పినదంతా కట్ చేసి ‘‘అమరావతికి’’ అనేది కలిపి వైకాపా వారు ఒక ఫేక్ వీడియోను రూపొందించారు. ‘‘ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రవేశపెట్టడం, భూముల ధరలు భారీగా పెరగడం వంటి పరిణామాలతో అమరావతి ప్రాజెక్ట్ రాష్ట్రానికి మరింత ఆర్థిక భారం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి’’ అనే కుట్రపూరిత వ్యాఖ్యను జత చేసి ప్రచారం చేస్తున్నారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా ‘‘మావిగన్’’ అనే వికృత ప్రతిపాదన తెచ్చిన వైకాపా తప్పుడు వీడియోలతో ఫేక్ ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన జీవితాంతం కృషిచేశారు. విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు అందరం కృషిచేద్దాం.
చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, చట్టరూపకల్పనపై ఉండవల్లి నివాసంలో సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు, అధికారులతో మా మంత్రుల బృందం సమావేశమైంది. పిల్లల సృజనాత్మకత దెబ్బతినకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంచే చట్టం రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ & పీఆర్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్, ఐజీ ఆకే రవికృష్ణ, అదిరాజ్ సింగ్ రానా ఎస్పీ సైబర్ క్రైమ్, ఐ & పీఆర్ అధికారులు, సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు చట్టం విధివిధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
బెంగళూరు సర్జాపూర్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలోని గ్రీన్ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ(గ్రేడ్-XII) గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నాను. పాఠశాలలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆర్ట్ గ్యాలరీ, తరగతి గదులను సందర్శించాను. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశాను. ఈ కార్యక్రమంలో సత్వ గ్రూప్ ఎండీ, గ్రీన్ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్మన్ బిజయ్ అగర్వాల్ గారు, మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నీరు అగర్వాల్ గారు పాల్గొన్నారు.