స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ గ్రామాలకు వస్తారు, ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతారు. అప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ హామీల లెక్క అడిగితే ఏం సమాధానం చెబుతారు @ncbn గారూ? మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ఓట్లు అడగండి.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవిక దాడి, ఒక అమానుష చర్య. ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి అత్యంత తీవ్రమైన విషయం. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? చంద్రబాబు గారూ… ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?
@ncbn గారూ… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు, ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే. మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.4౦వేల కోట్లు.
వీటికితోడు , మీరు ఆ సీట్లోకి వచ్చిన తొలిరోజు నుంచే, మేం దేశంలో ఎక్కడాలేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా, తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం దాడిచేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు, వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. పారదర్శకతకూ, ఇంటివద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు, ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?
చంద్రబాబుగారూ.. వెంటనే ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి.
ఈ సందర్భంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటికంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మీ ద్వారా మళ్లీ అందేలా, దేశం మీవైపు చూసేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లుమూసుకుంటే ఆ కాలంకూడా ఇట్టే గడిచిపోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.
🚨 #NoAnimalFatInTTDLaddu
Om Namo Venkatesaya 🙏🏻
@ncbn and @PawanKalyan turned the sacred TTD Laddu into a political weapon, invoking the faith of crores of devotees to push an “animal fat” allegation in 2024.
Now, the ED investigation has found 𝗡𝗢 𝗮𝗻𝗶𝗺𝗮𝗹 𝗳𝗮𝘁 in the ghee used for the TTD Laddu.
Satyameva Jayate.
#CBNShouldApologizeHindus
#TruthRevealed
#TirupatiLaddu
#SeizeTheLiarPK
I am getting messages saying the police are not issuing permissions for DJ vehicles during Ganesh Nimmajanam. I request Home Minister @Anitha_TDP Garu and the DGP Garu to ensure permissions are given without hassle. Not a single DJ vehicle should be seized.
@APPOLICE100
.@ncbn గారి పాలనలో రాష్ట్రంలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరింది. రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు.
చంద్రబాబు గారూ, మీ పాలనలో ఇదేనా పోలీసింగ్ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?.
‘ఎక్స్’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమకు తాము అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య.
పోస్టుల తొలగింపు అభ్యర్థన నిజంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారిక ఈ–మెయిల్ చిరునామా నుంచే వచ్చిందని ‘ఎక్స్’ ధృవీకరించింది. అయినప్పటికీ, ఆ మెయిల్ పంపిన సంబంధిత అధికారి తాను ‘ఎఫ్‌బీఐ’ సంస్థకు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నారు.
అసలు ఆ అభ్యర్థన పంపాలని ఆదేశించింది ఎవరు? అక్కడ ‘ఎఫ్‌బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు, ‘ఎక్స్’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా?
1. అమలు చేయని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు
2. డీఎస్సీ కుంభకోణం
3. అమరావతి నిర్మాణంలో దోపిడీ
4. రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులు
పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించిందే తప్ప, మీ రాజకీయ సెన్సార్షిప్ను అమలు చేయడానికి కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పోస్టుల తొలగింపు చర్యలో ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును వాడటం ఆంధ్రప్రదేశ్‌కు అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తింది.
విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని, గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువు పరిస్థితుల్లో మొత్తం నష్టపోయిన రెతులను ఆదుకోండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి.
చాలా వేగంగా వ్యాప్తి చెందిన ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. మీ పనితీరుపై మీ ప్రభుత్వానికి అంత నమ్మకం ఉంటే, ప్రజలకు అంతా బాగా చేశామని అనుకుంటే.. అది మీ పనితీరులో చూపాలి. ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్షిప్, వేధింపులతో కాదు.
Urgent help needed for my friend’s brother’s medical treatment.
Any contribution, big or small, can make a difference. Please donate or share this post to help us reach more people.
𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!
Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?
𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho authorities: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗰𝗲𝗿𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗲 𝗶𝘀 𝗿𝗲𝗽𝗼𝗿𝘁𝗲𝗱𝗹𝘆 𝗳𝗮𝗸𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟯: Check with Nagarjuna University: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝘀𝗽𝗼𝗿𝘁𝘀 𝗲𝘃𝗲𝗻𝘁 𝗮𝗹𝗹𝗲𝗴𝗲𝗱𝗹𝘆 𝗻𝗲𝘃𝗲𝗿 𝗵𝗮𝗽𝗽𝗲𝗻𝗲𝗱.
Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this?
#MegaDSCScam
.@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old examination-based recruitment model?
Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this?