Must watch it..!
గత 19 నెలలుగా తెలంగాణ ఆస్తిత్వంపై, తెలంగాణపై జరుగుతున్న కుట్రలపై కవిత్వం రూపంలో వివరించిన తెలంగాణ ఉద్యమ కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి 👇
పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న..
రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినది తెలుగు భాష... కేవలం 700 సంవత్సరాల చరిత్ర కలిగినది హిందీ భాష.
హిందీ భాష పెద్దమ్మ ఎలా అవుతుంది? ఆ స్థాయిలో ఉండి కనీసం చరిత్ర తెలుసుకోరా?
- ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి
ఫిబ్రవరి 07, 2025 నాడు.. సాక్షాత్తు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి గారు ATLAS - 2024 రిపోర్టు విడుదల చేస్తూ..
2014 నుండి 2024 వరకు పదేండ్ల కాలంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ జీఎస్డీపీ 196.9% పెరిగిందని చెప్పిండ్రు.!
#Telangana#KCR
రేవంత్ రెడ్డి @TelanganaCMO ఆరు గ్యారంటీలపై పెద్దపెద్ద మాటలు మాట్లాడిండు ఇప్పుడు కనీసం వాటి ప్రస్తావన కూడా ఎక్కడా చెయ్యట్లేదు 🤡😆.
Congress Party is a party with bunch of jokers and idiots, they will destroy the party within no time.
#CongressSixGuaranteesIsAFarce
ఆయన గాకుండా మన మంచి చెడ్డలు సూసే ఇంటి పెద్ద ఎవరు..?
పొట్టకూటికోసం హైదరాబాద్ బాట పట్టిన ప్రతొక్కరిని కడుపుల పెట్టి కాపాడుకుండు... ఐదు రూపాయల బోజనం పెట్టించిండు...
ఎదో భ్రమలో ప్రజలు మోసపోయిండ్రు... ఇప్పుడు గోస పడుతుండ్రు 🥲
GO బాధితులను ఎన్నికలప్పుడు రెచ్చగొట్టిన్లు, #GO46 ను రద్దు చేస్తామని మాట ఇచ్చిండ్రు, బాధితులను విచ్చలవిడిగా ప్రచారానికి వాడుకున్నారు.
ఇప్పుడేమో గాంధీ భవన్ లోకి కనీసం ప్రవేశించకుండా సిబ్బందితో అడ్డుకుంటున్నారు. మల్ల దీనికి ప్రజా పాలనా అని పేరు ఒకటి.
ఏమనాలి దీన్ని? మోసం, దగా, దౌర్జన్యం, అవకాశవాదం, అహంకారం, అరాచకం, స్వార్ధం, అలసత్వం….ఇది @revanth_anumula రేవంత్ రెడ్డి గారి నైజం.
వీళ్ళతో మాట్లాడడం, మర్యాదగా వ్యవహరించడం వృధా.
పోరాటం తప్ప పరిష్కారం లేదు.
మేము నిర్మిస్తే - మీరు కూల్చేస్తున్నారు
మాది నిర్మాణం - మీది విధ్వంసం
లక్షల నిర్మాణాలు మావి - లక్షల కూల్చివేతలు మీవి
మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరం లో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదే
కట్టలేదన్నారు-ప్రజలను మభ్యపెట్టాం అన్నారు-మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చిట్టి
మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా
కేసీఆర్ నిజం, అయన హామీలు నిజం ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా
మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్ కు ఇవ్వాళా కేసీఆర్ గారి నిర్మాణాలే దిక్కయ్యాయి
కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం-కేటాయింపులు నిజం
మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి
చెరువుల ఆక్రమణ గత పదేళ్ల క్రితమే మొదలయినట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నేను ఇరవై ఏళ్ల క్రితం రాసిన ఒక వ్యాసం లోంచి కొన్ని విషయాలు ఇక్కడ పంచుకుంటున్నాను. హైదరాబాద్ లోని ప్రముఖ పరిశోధనా సంస్థ CESS లో మిత్రుడుప్రొఫెసర్ రామచంద్రయ్య సేకరించిన వివరాల ప్రకారం 1990 తరువాత వలసలు పెరిగి చెరువులు ఆక్రమణకు గురయినాయి. ( పట్టిక చూస్తే ఆ విషయం బోధపడుతుంది)
నిజానికి హైదరాబాద్ చెరువులతో విలసిల్లిన నగరం. ఈ నగరానికి పునాదివేసిన కుతుబ్షాహీ రాజులు 1534-1724 మధ్యకాలంలో సహజ సిద్ధమైన చెరువులను కాపాడుతూ వచ్చారు. తరువాత వచ్చిన అసఫ్ జాహీ పాలకులు 1724-1948 మధ్య ఫ్రెంచ్, బ్రిటీష్, ఇండియన్ ఇంజనీర్ల సహకారంతో వందలాది కొత్త చెరువులు నిర్మించారు. హుస్సైన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మీరాలం చెరువులను తాగునీటి కోసం నిర్మించారు. 1960-70 ల దాకా కాలువల ద్వారా నీళ్లు పారేవి. 2000 సంవత్సరం తరువాతి వరకు ఈ జలాశయాలే మొత్తం నగరాన్ని కాపాడాయి.
1985 తరువాత కోస్తావలసలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం నాటికి ఈ వలసలు వందరెట్లు పెరిగి చెరువులు తరగడం మొదలయ్యింది. కొత్తగా రియల్ ఎస్టేట్ అనే కొత్త జాతి పఠాన్ చెరువు, అమీన్ పూర్ చెరువు మొదలు దుర్గం చెరువు, పేరం చెరువు, సరూర్నగర్ చెరువు, సఫీల్గూడ చెరువు, యూసఫ్ గూడా చెరువు ఇట్లా వందలాది చెరువుల చుట్టూ వేలాది ఎకరాలను కబ్జాచేసి, ప్లాట్లు వేసి కొత్త కాలనీలను కట్టేసింది. అప్పటి ప్రభుత్వం దీనిని ప్రోత్సహించింది. నాయుడు గారి కాలంలో ప్రభుత్వమే కనీసం పది పెద్ద చెరువులను పూడ్చి పార్కులుగా మార్చేసి క్రిమినల్ చర్యలకు పాల్పడింది. చాచా నెహ్రూ పార్కు, కృష్ణకాంత్ పార్క్, సఫిల్ గూడా పార్క్, సరూర్ నగర్ పార్క్ అలావచ్చినవే. అప్పుడు మొదలయిన కబ్జాలు ఇప్పుడు చెరువులను పూర్తిగా మింగేసే స్థాయికి చేరాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి @revanth_anumula గారు నిజంగానే ఆ ఆక్రమణలు పూర్తిగా తొలగించి చెరువులను శుద్ధి చేస్తే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.