We ordered this pizza from tealogy patia cafe through toing app.when we opened this pizza is looking like this ,whole uncooked and doughy. When I spoke with toing customer care agent they replied they can give only 40rs as replacement. I don't understand why this agents cnt ask hotel to replace with something good
చిన్ని చిన్ని జ్ఞాపకాలు!!
ఈరోజు తొందరగా పని ముగించుకుని ఇంటికొచ్చి కూర్చుని , ఏమి పని లేకుండా అలా పార్కలో కూర్చుంటే నా ఎదురుగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకుంటుంటే ఒక్కసారిగా బాల్యంలో కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి!
జోరుగా వర్షం వల్ల వర్షాకాలం లో వచ్చే సర్ప్రైజ్ లీవ్ లో మేము చేసిన ఆ మధుర జ్ఞాపకాలు ఎంతో మధురం. రోజు వచ్చే పాల ఆయన ఎగరగొడితే ,పొద్దున్నే పాలు తెచ్చుకోవడానికి కాలనీ ఎంట్రన్స్ లో గొడుగు పట్టుకుని నిలబడితే ఆ వర్షంలో పక్కనే పల్లెటూరు నుండి ఆ వర్షంలో పాల డబ్బాలు తల మీద పెట్టుకుని వరుసగా వచ్చే పాలవాళ్ళు.....పులివెందుల లో మా కాలనీ లో రావి చెట్టు కింద తేలు తోకకి దారం తో కట్టేసి చీమల పుట్ట దగ్గరకు తగిలించి పరిగెత్తేవాళ్ళం నేను మా అన్నయ్య! ఆ వర్షం నీటిలో పేపర్ పడవలను పంపించి దాని వెనుకే పరిగెత్తితే వచ్చే ఆ మజా ఇప్పుడు ఏమాడితే వస్తుంది ? నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మేమున్న క్వార్టర్స్ ఉన్న కాలనీ ఒక స్వర్గం మాకు. కాలనీ అంతా మాకిష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళం! కాలనీ పక్కనే ఉన్న వంక లో నీళ్ళు పారుతుంటే ఆది చూడడానికి మా పిల్ల గ్యాంగ్ వెళ్తే ,ఆ పక్కనే ఉన్న నీళ్ళ ట్యాంక్ సెక్యూరిటీ మమ్మల్నందరిని తరుముతుంటే అక్కడినుండి పరిగెత్తడం.... ఆ పక్కనే ఉన్న చెట్ల మీద మేమాడిన కోతి కొమ్మచ్చి ఆటలు అన్ని గుర్తొస్తుంటే మనం పెరిగింది ప్రకృతి వడిలో అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఎంత మందికి ఇలాంటి జ్ఞాపకాలు మిగుల్తాయో మరి!
ప్రతిచాయ ఒక మంచి సినిమా అని చెప్పడం కన్నా ఒక మంచి భావోద్వేగమైన కథ అని చెప్పాలి. నివిన్ పాలీ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన కథ అని మాత్రం చెప్పగలను. సినిమా లో జరిగే హడావిడి సన్నివేశాలని పక్కన పెడితే ,సినిమా మొదటి నుండి చివరి వరకు సాగే కథాపయనం ఒక చక్కటి మానవ సంబంధాలను హత్తుకునే (1/6)
పడాల్సిందే అనే ఒక అమ్మ ,ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక క్యారెక్టర్ ను రాసుకున్న తీరు మాత్రం హాట్స్ ఆఫ్.....
నాకు తెలిసిన ఒకడే యాక్టర్ నివిన్ పాలీ ఇందులో. యాక్షన్ పరంగా 10/10 ఇస్తాను. మిగతా అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్ చక్కగా చేశారు. స్క్రీన్ప్లే డైరెక్షన్ కూడా చాలా (5/6)
సరే కొడుకుకి శిక్ష పడాల్సిందే అనే ఒక అమ్మ ,ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక క్యారెక్టర్ ను రాసుకున్న తీరు మాత్రం హాట్స్ ఆఫ్.....
నాకు తెలిసిన ఒకడే యాక్టర్ నివిన్ పాలీ ఇందులో. యాక్షన్ పరంగా 10/10 ఇస్తాను. మిగతా అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్ చక్కగా చేశారు. స్క్రీన్ప్లే డైరెక్షన్ కూడా