CHEER UP, SUCHIKA TARIYAL! 🥹🇮🇳
- You have made the whole of India proud by winning India’s first-ever medal in MMA at the Asian Games! 🥉
WHAT A HISTORIC MOMENT! 🔥🔥🔥
జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ శాసన సభ్యులు శ్రీ వరుపుల సుబ్బారావు
•కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ @PawanKalyan గారు
•పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు భారీగా జనసేనలో చేరికలు
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మాజీ శాసన సభ్యులు, వైసీపీ నేత శ్రీ వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం పిఠాపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్, వైసీపీకి చెందిన నాయకుడు శ్రీ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి గంగిరెడ్డి అరుణ, రెండు మున్సిపాలిటీల పరిధిలోని మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. అందరికీ పార్టీ కండువాలు కప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో వీరంతా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ, మాజీ శాసన సభ్యులు శ్రీ పెండెం దొరబాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్, కౌడా ఛైర్మన్ శ్రీ తలాటం సత్య, పిఠాపురం ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు శ్రీ ఓదూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చిన @bolisetti_satya గారికి ధన్యవాదాలు. విషయం తెలిసిన వెంటనే సంబంధిత శాఖ అధికారులను అక్కడికి పంపించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించడం జరిగింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, వాస్తవాలను వెలికితీసి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.