అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మబలిదానంతో 1953 అక్టోబర్ 1న ఏర్పడిన మన ఆంధ్ర రాష్ట్రం అనేక చారిత్రక మలుపులను దాటుకుంటూ నేటి ఆంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దుకుంది. 2014 రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్, నేడు గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సహకారం, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, వ్యవసాయం, సాంకేతికత, విద్య, వైద్యం వంటి ప్రతి రంగంలో పురోగతిని సాధిస్తూ రాష్ట్రం స్వయంసమృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఆర్థికంగా బలమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్���గామిగా నిలబెట్టడం మనందరి సంకల్పం.
రైతన్నల సంక్షేమం, దేశ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న���రు.
2027-28 రబీ సీజన్‌కు ఆరు ప్రధాన రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ, అందుకోసం రూ. 90,962 కోట్లను కేటాయించటం ద్వారా అన్నదాతలక�� మరింత ఆర్థిక భరోసా కల్పించారు. అదే విధంగా రూ.1,86,405 కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ Phase-III కి ఆమోదం లభించింది. ఇందులో భాగంగా కేంద్రం రూ.54,082 కోట్ల ఆర్థిక సహాయం అందించనుంది. రైతు సంక్షేమం నుంచి స్వచ్ఛమైన ఇంధన భవిష్యత్తు వరకు ప్రతి రంగంలోనూ దేశ ప్రగతికి బాటలు వేస్తూ, వికసిత్ భారత్ నిర్మాణ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్న ఈ నిర్ణయాలు దేశ అభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్నాయి.
ఆసియా క్రీడలు - 2026 లో, ఆర్చరీ పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో సాహిల్ జాదవ్, కుశాల్ దలాల్లతో కలిసి స్వర్ణ పతకాన్ని సాధించి, భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గణేష్ మణిరత్నం తిరుమురు గారికి హృదయపూర���వక అభినందనలు. నాయుడుపేట నుంచి అంతర్జాతీయ వేదిక వరకు సాగిన మీ ప్రయాణం ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4.82 కోట్లతో చేపట్టిన పలు ఎండ్-టు-ఎండ్ బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ప్రకాశం బ్యారేజ్ రోడ్డు, 41వ డివిజన్ వాసవి కళ్యాణ మండపం వీధి, 45వ డివిజన్ మాదాసు రామారావు వీధి, 49వ డివిజన్ ఎర్రకట్ట నుండి సొరంగం వరకు నిర్మించే బీటీ రోడ్ల పనులను కూటమి నాయకులతో కలిసి ప్రారంభించాము.
పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్య, వైద్య రంగాల బలోపేతానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కార్యాలయం అనునిత్యం అందుబాటులో ఉంటుంది.
సత్యం, అహింస అనే ఆయుధాలతో భారత స్వాతంత్ర్య సంగ్రామానికి దిశానిర్దేశం చేసి, ప్రపంచానికే శాంతి మార్గాన్ని చూపిన మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, ధర్మం, సహనం, గ్రామ స్వరాజ్య స్ఫూర్తి నేటికీ మనకు మార్గదర్శకాలు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక సామరస్యంతో మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని, మన రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్దాం.
'జై జవాన్ - జై కిసాన్' అనే శక్తివంతమైన నినాదంతో దేశ సైనికులకు, రైతులకు సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని అందించిన మహానాయకుడు, మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళులు.
వారి నిరాడంబర జీవితం, నిష్కలంకమైన దేశభక్తి, అసాధారణ క్రమశిక్షణ మరియు నాయకత్వ పటిమ తరతరాలకు మార్గదర్శకం. స్వయంసమృద్ధి మరియు జాతి ప్రగతి సాధనలో ఆయన చూపిన బాట మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శనీయం.
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో రాయలసీమను 'ప్రపంచ ఉద్యాన కేంద్రం' గా తీర్చిదిద్దేందుకు NDA కూటమి ప్రభుత్వం నేడు శ్రీకారం చుడుతోంది. కేంద్ర ఆర్థిక ��ంత్రి శ్రీమతి @nsitharaman గారి చేతుల మీదుగా, సీఎం శ్రీ @ncbn గారు, డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గార్ల సమక్షంలో మదనపల్లెలో రూ.1 లక్ష కోట్ల అభివృద్ధి ప్రణాళికతో పాటు 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' కు శంకుస్థాపన జరుగుతోంది. 10 జిల్లాల్లో 9.6 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా 14.41 లక్షల హెక్టార్లలో ఉద్యానసాగును విస్తరించి, రాయలసీమను రైతు సంక్షేమానికి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగు.
విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఏపీ ఇన్ఛార్జ్ @bhadoriabjp గారు మరియు ఇతర ముఖ్యనేతలతో కలిసి పాల్గొనడం జరిగింది. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చించాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గ్రామానిక�� చేరువ చేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి కార్యకర్తా అంకితభావంతో సిద్ధం కావాలని పిలుపునిచ్చాము.
ఆసియా క్రీడలు - 2026 లో భాగంగా, బాక్సింగ్ మహిళల 65 కేజీల విభాగంలో అత్యుత్తమ పోరాట పటిమతో స్వర్ణ పతకాన్ని సాధించి, విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన పర్వీన్ హుడా గారికి హృదయపూర్వక అభినందనలు.
రింగ్‌లో మీ నిరంతర శ్రమ, అపార విశ్వాసంతో సాగిన ఈ విజయం దేశంలో ఎందరో యువ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తిదాయకం.
కేంద్రంలోని ప్రధాని @narendramodi గారి ప్రభుత్వం అందించిన ‘పూర్వోదయ’ పథకం నిధులతో రాయలసీమ ప్రాంతం అభివృద్ధి, ప్రగతి పథంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.
మౌలిక వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, హార్టికల్చర్ హబ్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఏఐ ఆధారిత అగ్రిటెక్ ప్రాజెక్టులతో మన ప్రాంత అన్నదాతలకు ఆధునిక వ్యవసాయ అవకాశాలు అందుబాట���లోకి వస్తున్నాయి. మరోవైపు, భారీ పారిశ్రామిక పెట్టుబడులతో రాయలసీమ యువతకు స్థానికంగానే విస్తృత ఉపాధి, ఉద్యోగ మార్గాలు సుగమం కానున్నాయి.
రాయలసీమను అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా శ్రమిస్తోంది.
44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, 2026 ఆసియా క్రీడల మహిళల హాకీ ఫైనల్లో చైనాపై అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మన భారత మహ��ళల హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. అసాధారణ పట్టుదల, పోరాట స్ఫూర్తి, అసమాన ప్రతిభతో దేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా ఎగురవేసిన మన హాకీ వీరనారీమణుల విజయం యావత్ భారతావనికి గర్వకారణం. ఈ చారిత్రక విజయం కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ స్వర్ణ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడం మరింత ఆనందకరం.
ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని, భారతదేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించిన మన భారత పురుషుల హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. మీ ప్రతిభ, పట్టుదల కోట్లాది భారతీయులకు ఎనలేని గర్వకారణం. ఈ స్వర్ణ విజయంతో పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన శుభవేళ.. మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు దేశానికి అందించాలని ఆకాంక్షిస్తున్నాను.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర NDA కూటమి ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది మంది పేదల సొంతింటి కలను నెరవేరుస్తోంది. ఆ ప్రస్థానంలో మరో చారిత్రాత్మక ఘట్టంగా పీఎంఏవై-గ్రామీణ్ 2.0 కింద రూ.7,170 కోట్ల వ్యయంతో 3 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడంతో పాటు, అతి తక్కువ సమయంలో నిరుపేదలకు వేగంగా, నాణ్యతతో కూడిన ఇళ్లను అందించాలనే లక్ష్యంతో ప్రయోగాత్మకంగా 177 ఇళ్లను అత్యాధునిక 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించే బృహత్తర కార్యక్రమం నేడు గౌరవ కేంద్ర మంత్రి శ్రీ @ChouhanShivraj గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి చేతుల మీదుగా ప్రారంభమవడం చాలా సంతోషకరం. ఆధునిక సాంకేతికతతో పేదల సొంతింటి కలను మరింత వేగంగా సాకారం చేసే ఈ కార్యక్రమం, గృహ నిర్మాణ ��ంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.
భారతీయ సినిమా నిఘంటువులో నూతన ప్రయోగాలకు ఆద్యుడైన మహోన్నత దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి మరణం ఎంతో విషాదకరం. అసాధ్యం అనిపించే ఎన్నో అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించి, తరాలు మారినా గుర్తుండిపోయే కళాఖండాలను అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఆయన భౌతికంగా దూరమైనా, ఆయన అందించిన అద్భుత చిత్రాలు విశ్వవ్యాప్తంగా సినీ ప్రేమికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి ఆత్మకు సద్గతులు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 'జల్ జీవన్ మిషన్ - 2.0'ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సారథ్యంలో రూ. 30,000 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర NDA కూటమి ప్రభుత్వం 'అమరజీవి జలధార' పనులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ముఖ్యంగా రాయలసీమలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా దూరం చేసి, సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది.
ఈ బృహత్తర పథకం ద్వారా అందుతున్న ఫలాలు:
1) 27.36 లక్షల కుటుంబాలకు తా���ునీటి సౌకర్యం
2) 24,601 ఆవాసాల్లో విస్తృతంగా నీటి సరఫరా
3) 13,075 ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం.
4) 77,243 కి.మీ. కొత్త పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణ.
5) 61.50 లక్షల కుళాయి కనెక్షన్లు.
6) మొత్తం 3.27 కోట్ల మంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం.
భారత్ - స్విట్జర్లాండ్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ ఉత్పత్తి, అణుశక్తి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు, స్విస్ అధ్యక్షుడు శ్రీ @ParmelinG గారితో జరిపిన కీలక చర్చలు ద్వైపాక్షిక భాగస్వామ్యానికి నూతన దిశను నిర్దేశించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అధునాతన స్విస్ సాంకేతిక పరిజ్ఞానానికి మరింత అవకాశాలు లభించడంతో పాటు తయారీ, పరిశోధన రంగాల్లో పురోగతి సాధ్యమవుతుంది. తద్వారా భారత యువతకు కొత్త ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభించనుంది.
భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ (CITU) ప్రతినిధులు నన్ను కలసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేసారు.
ఆశా వర్కర్ల విధుల్లో ఎదురవుతున్న సమస్యలు, వారాంతపు సెలవులు, లీవ్‌ల మంజూరు, సమాన పనికి సమాన వేతనం మరి��ు సౌకర్యాల మెరుగుదల వంటి పలు అంశాలను నా దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్క��రానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చాను.
భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో VMC ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు మరియు విభాగాధిపతులతో కలి��ి పశ్చిమ నియోజకవర్గంలోని అభివృద్ధి, పెండింగ్ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించాను.
కాళేశ్వరరావు మార్కెట్, వస్త్రలత కాంప్లెక్స్ ల రీ-డెవలప్మెంట్, కొండ ప్రాంత వాసులకు స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా, స్మశానవాటికలు & పార్కుల అభివృద్ధి, రివర్ ఫ్రంట్ బ్యూటీఫికేషన్ మరియు స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణ పనులను అత్యంత ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను.
విద్యాధరపురం, సితార సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న 'ఈట్ స్ట్రీట్' (Eat Street) నిర్మాణ స్థలాన్ని ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగుల్ మీరా గారు, VMC అధికారులు మరియు కూటమి ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాను.
నేషనల్ హెల్త్ మిషన్, కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు VMC సాధారణ నిధులు రూ. 1.78 కోట్లతో ఈ 'ఈట్ స్ట్రీట్' ను ఏర్పాటు చేస్తున్నాము. వినియోగ��ారులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తూ, వ్యాపారాలు సులభంగా సాగేలా అవసరమైన పార్కింగ్, సిట్టింగ్ ఏరియా, విద్యుత్ వసతి, డ్రైనేజీ మరియు టాయిలెట్ల నిర్మాణం వంటి మౌలిక వసతులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను.