ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ క్యాలెండర్ సాధ్యమవ్వడానికి టెలిగ్రామ్‌లో 75,000+, వాట్సాప్‌లో 25,000+, ట్విట్టర్(X)లో 10,500+ మంది మిత్రులు సహకరించారు. దయచేసి ఇదేవిధముగా ఇంస్టాగ్రామ్ లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము🙏
https://t.co/TwcK6kD8MN
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం ఉండవల్లి నివాసంలో జరిగింది. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పై చర్చించాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశాం.
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ శాసన మండలి విప్ వేపాడ చిరంజీవిరావు, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌కు వినతిపత్రం అందజేశారు.
గ్రామ సచివాలయ వ్యవస్థలో సంక్షేమ మరియు విద్యా సహాయకులుగా పనిచేస్తున్న ఉద్యోగులు (వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉత్తరాంధ్ర )తమకు ప్రమోషన్ చానల్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవి రావు గారికి విన్నవించారు.