🚨 జనసేన నాయకుడు వీరాంజనేయులు మృతిపై KK సంచలన వ్యాఖ్యలు!
👉 పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వీరాంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన శివ శ్రీనివాసరావు.
👉 రాష్ట్ర స్థాయిలో 15 ఏళ్లు కలిసి ఉండాలనుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు.
👉 పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
👉 బయటి వ్యక్తులు తోసివేయడం వల్లే వీరాంజనేయులు గుండెపోటుతో మరణించారని ఆరోపణ.
👉 ఆయన మృతికి కారకులు ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టేది లేదు. సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి! —KK
#JanaSena @PawanKalyan #AndhraPradesh
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం?
@PawanKalyan@ncbn@MadhavBJP@JanaSenaParty@JSPShatagniTeam
🚨 URGENT HELP NEEDED! 🙏
Dear X Fam ❤️
One of my mutuals, @Ram_Tweetzs is going through a difficult situation. His mother is suffering from HIV and requires medical treatment costing approximately ₹3 lakhs or more. Unfortunately, their family is facing severe financial..
Telugu ante Perugunnam..
Telugu ante Chicken Masala..
Telugu ante Mutton masala
Telugu ante aavakaya.. vattakaya
These are the people who use such lines in their songs and then call Kannada an ugly language 🤡 https://t.co/0vO2oC8Lda
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తారు. ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని అధ్యక్షులు ఆదేశించారు.
ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు పర్యవేక్షించనున్నారు.
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం
• నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా
• శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. మృతుడు శ్రీ ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
•విచారణ ప్రక్రియపై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ
పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులపై విచారించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచించారు. విచారణ ప్రక్రియను సమన్వయం చేస్తూ, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. శ్రీ రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫన భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ను పులివెందులకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ ముంతల రామాంజులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దిశా నిర్దేశం
• నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా
• శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. మృతుడు శ్రీ ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
•విచారణ ప్రక్రియపై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ
పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులపై విచారించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచించారు. విచారణ ప్రక్రియను సమన్వయం చేస్తూ, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. శ్రీ రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫన భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ను పులివెందులకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ ముంతల రామాంజులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
కడప జిల్లాలో జనసేన కార్యకర్తల ఆవేదన 💔🙏
ప్రొద్దుటూరులో 52 కౌన్సిలర్ స్థానాలు, ZPTC, MPTC స్థానాలు ఏకగ్రీవమైన సమయంలో ఒక్క తాళ్లమాపురం MPTC స్థానంలో మాత్రమే ఎన్నిక జరిగింది. ఆ ఒక్క స్థానాన్ని జనసేనకు కేటాయించి బీఫామ్ ఇచ్చినా, టీడీపీ రెబల్ అభ్యర్థికి మద్దతుగా స్థానిక టీడీపీ నాయకత్వం వ్యవహరించడంతో జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తమ్ముడు రాఘవరెడ్డి అక్కడికి వెళ్లి వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమైంది.
అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క 39వ వార్డులోనే జనసేన, టీడీపీ మధ్య పోటీ జరిగింది. ఆ సమయంలో జనసేన అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం, మహిళలను బెదిరించడం, పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
చక్రాయపేట మండలంలో (పులివెందుల) జనసేన ఒక్క సురభి పంచాయతీలో మాత్రమే నామినేషన్ వేసింది. జనసేన సర్పంచ్ అభ్యర్థిగా నాగ మల్లయ్య గారు నామినేషన్ వేశారు. ఆ ఒక్క స్థానంలో కూడా అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? నాగ మల్లయ్య గారికి మద్దతుగా వచ్చిన వీరాంజనేయులు గారికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు.
ఈరోజు ప్రాణాలు కోల్పోయిన వీరాంజనేయులు గారి కుటుంబానికి పార్టీ నాయకత్వం తక్షణమే అండగా నిలవాలి. ఇటీవలే ఆయన భార్య కూడా మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి.
ఈ విషాదాన్ని రాజకీయాలకు ఉపయోగించకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలవడమే ఇప్పుడు మనందరి ప్రాధాన్యత కావాలి.
@JanaSenaParty@PawanKalyan
కడపలో జరిగిన సంఘటన..కుటుంబంకి
జన సైనికులకు శోకాన్ని మిగిల్చింది💔
వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్న
రాజకీయ నాయకులు ఇంత దిగజారి విలువలు లేకుండా పోవడం దురదృష్టకరం ఏం సాధిస్తారు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు...దౌర్భాగ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి @JaiTDP
వీరాంజనేయులు మృతిపై డీఎస్పీ, జనసేన నేత మధ్య తీవ్ర వాగ్వివాదం
వీరాంజనేయులు మృతి ఘటనపై డీఎస్పీ మురళీ నాయక్, జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ మరణానికి జనసేన నాయకులే బాధ్యులని ఆరోపిస్తూ డీఎస్పీ మురళీ నాయక్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, పోలీసుల వైఫల్యం వల్లే వీరాంజనేయులు ప్రాణాలు కోల్పోయారని సుంకర శ్రీనివాస్ ప్రత్యారోపణ చేశారు. తమ సర్పంచ్ అభ్యర్థిని స్క్రూటినీకి రాకుండా అడ్డుకుంటున్నారని జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆయన పేర్కొన్నారు. ఉదయం నుంచి టీడీపీ వర్గీయులను అక్కడి నుంచి చెదరగొట్టకుండా, వారి దౌర్జన్యాన్ని అడ్డుకోకపోవడం వల్లే వీరాంజనేయులు గుండెపోటుతో మరణించారని సుంకర శ్రీనివాస్ ఆరోపించారు.
#AndhraPradesh #Pulivendula #JanaSena #TDP #PawanKalyan #ChandrababuNaidu