పవన్ కళ్యాణ్ గారిని ఎన్నీ మాట్లాడిన ముద్రగడ గారిని ఎప్పుడు విమర్శించలేదు..
ముద్రగడ గారు ఎన్నీ మాట్లాడిన,పెద్దలు ఓ మాట అంటారు మనం,బాధ పడకూడదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏...
ఓం శాంతి ముద్రగడ పద్మనాభం గారు🙏💐
#pawankalyan
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం
•అధికారులకు ఆదేశాలు
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు సేవలందించారని... అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
Team PKCW extends heartfelt wishes to our beloved Founder, Sri @PawanKalyan Garu, for a speedy and complete recovery following his successful surgery.
The hands that have touched countless lives, the shoulders that have carried the hopes of millions, and the fist that symbolizes resilience and courage will soon rise stronger than ever.
Your resilience, dedication, and unwavering commitment continue to inspire millions. May each passing day bring renewed strength, good health, and a smooth recovery. We look forward to seeing you back stronger than ever, doing what you love and continuing your service to the people.
#GetWellSoonPawanKalyan
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స విజయవంతం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముంబయిలో నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయింది.
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది.
ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కి తీసుకువచ్చారు. అనష్తీషియా ప్రభావం నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏
ఎన్నో సంవత్సరాలుగా వేధించిన నొప్పి పూర్తిగా తొలగిపోయి, సంపూర్ణ ఆరోగ్యంతో మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భగవంతుడు మీకు నిండు ఆయురారోగ్యాలు ప్రసాదించి, మీరు త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు రావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ❤️🙏
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స..!
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలియచేశారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు.
2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan
గారికి భుజానికి జరిగిన సుమారు మూడున్నర గంటల శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏
ఎన్నో సంవత్సరాలుగా భరించిన ఆ నొప్పికి ఇప్పుడు పూర్తిగా ఉపశమనం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శస్త్రచికిత్సతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది, మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం, అపారమైన శక్తి, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మీరు త్వరగా కోలుకుని యథావిధిగా ప్రజాసేవలోకి తిరిగి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.🙏❤️
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స
• రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
• మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
WISH YOU A SPEEDY RECOVERY @PawanKalyan ANNA ♥️
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan