@satyakumar_y ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ స్టూడెంట్స్ పరిస్థితి గురించి కొంచెం ఆలోచించండి వాళ్ళ డ్యూటీస్ టైమింగ్ కానీ వాళ్లకి ఇచ్చే శాలరీస్ గాని చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి గురించి మీరు ఆలోచిస్తారని మనవి చేసుకుంటున్నాం
ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కి 60,000 అయితే , ప్రైవేట్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కి 30,000 మాత్రమే . చాలా వ్యత్యాసం ఉన్నది దయచేసి దాన్ని కూడా పరిశీలించవలసిందిగా కోరుచున్నాము@satyakumar_y
సత్య కుమార్ గారు పీజీలకు సంబంధించి డ్యూటీల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదిఇది ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కేనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడానా? తప్పకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా అ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం . స్టైఫెండ్ విషయంలో
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు....దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి...ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము.
శ్రీరామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు... నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీరామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. శ్రీ రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
నవ్యాంధ్రను అభివృద్ధి చేయడంలో తనకు ఎదురైన అనేక సవాళ్లు, సమస్యలు అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను శిథిలం నుంచి శిఖరం వైపు నడిపించిన నారా చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HBDBabu#HOPEJETTI ✌️
ఐటీ రంగాన్ని ఉమ్మడి రాష్ట్రానికి తీసుకువచ్చి హైటెక్ సిటీ నిర్మించి, సైబరాబాద్ నగర నిర్మాణానికి రూపకల్పన చేశారు. సాంకేతిక విద్యారంగంలో ఆయన తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఎందరో రైతుబిడ్డలను మట్టిలో మాణిక్యాలుగా తయారు చేసిన నారా చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు #HBDBabu ✌️
దేశం గర్వించతగ్గ ఉత్తమ నాయకత్వం... పాలనలో సమకాలీన దేశ నాయకులందరికీ ఆదర్శం... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు! #HBDBabu#HOPEJETTI ✌️✌️
భారతదేశానికి ప్రధాని అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చినా తన జీవితం తెలుగు ప్రజల కోసం అంకితం అని చెప్పి రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయిన చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు #HBDBabu#HOPEJETTI ✅