హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
Naaku nachatla. I think we are commiting blunders in certain issues…..
Public perception lo YCP and Kutami okkate anukune stage ki vellodhu ani korukuntunna
Honest ga…As a well wisher cheputunna🙏🏻
@ncbn@naralokesh
@OnlyFrPSPK@PawanKalyan Neekante... same kulam ani mohana salary demgthunnaad monthly
Thappadhu
edi vesina em chesina kusoni banisatvam cheyyaali
Migathavaallu ala kaad kada proves aduguthaar source lu aduguthaaru
గన్నవరం పోలీస్ స్టేషన్ లో రావణ్ పై మరణ శిక్ష పడే విధంగా పెట్టారు.
4 కేసులు పెట్టాం 4 కేసులు బెయిల్ వచ్చేసింది.
మన పరువు పోతుంది అని మరణ శిక్ష పడే విధంగా పెట్టారు.
ఒక YOUTUBER భారతదేశం రహస్యాలు తీసుకుని వెళ్లి పాకిస్తానికి అమ్మేసేటట్టు దేశద్రోహం కేసు పెట్టారు.
102 కేసులు పెట్టారు ఒక్కసారి రిమాండ్ కి వెళ్తే PT వారంటీ కింద రెండేళ్లు అయినా జైలు శిక్ష ఉంటుందని ఈ కేసులు పెట్టారు.
- జడ శ్రావణ్ కుమార్
రాజేష్ మహాసేన ప్రశ్న రావణ్ కంటే దారుణంగా మాట్లాడాడు మిమ్మల్ని @PawanKalyan గారు మరి రాజేష్ మహాసేన అరెస్ట్ ఎప్పుడు??
Ohh టీడీపీ వాళ్ళని చట్టాలు పని చెయ్యవా??
యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను చంపేసే ప్రయత్నం ఏమైన జరుగుతుందా.?
వరుసగా 4 రోజుల్లో 4 కేసుల్లో బెయిల్ వచ్చింది.. నిన్న 5వ సారి ఏలూరు పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు..
రావణ్ ని తీసుకెళ్లిన ప్రతి చోట పోలీస్ స్టేషన్ లపైకే జనసేన వాళ్ళు దాడులకు వెళ్తున్నారు.
ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చేతకాని మీరు.. కుట్రలు పన్నుతున్నారు అని చెప్పడానికి సిగ్గులేదా @kanduladurgesh గారు?
ఎక్కడో ఉన్న ప్రకాష్ రాజ్, రావణ్ లతో కుట్రలు పన్నాల్సిన అవసరం మాకేంటి?
- @Venkat_karmuru గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.
#CBNJungleRaj #PackageStarPK #AndhraPradesh #JaganannaConnects
After getting slapped by the courts 4 times, the Andhra Govt now files a draconian UAPA case on Ambedkarite journalist Prashna Ravan.
Isn't it a conspiracy of the Andhra govt to get his bail denied? This is a pure political revenge targeting SC/ST, Christian & Muslim voices.