నా రాజకీయ గురువు..నా తండ్రి, నా సర్వం కాన్షీరామ్. ఆ మహనీయుడి కలల్ని తెలంగాణా లో నిజం చేసి చూపించడమే నా సదాశయం..! ఎన్ని ప్రతికూలతలు ఎదురు ఐనా బహుజన రాజ్య నిర్మాత కాన్షీరామ్ దీప స్తంభం వద్దకు చేరడమే నా జీవిత ముగింపు.
#Kanshiram#Bahujan#Telangana#BCSCST
రాహూల్ గాంధీ ఆర్యుడని,రామ భక్తుడని అంటున్న రేవంత్ రెడ్డి
🔷🔶🔷🔶🔷🔶🔷🔷🔶🔷
రేవంత్ రెడ్డి..రాముడు ఆర్యుల దేవుడు, ధనికుల దేవుడు-శివుడు పేదల దేవుడు,ద్రావిడుల దేవుడు అంటూ అగ్ర వర్ణాలని అదృశ్యం చేస్తున్నాడు.
ఇది తప్పు. శివుడు భారతీయ శూద్రుల బీసీ,ఎస్సీ, ఎస్టీ ల దేవుడు, రాముడు భారతీయ అగ్రవర్ణాల దేవుడు.
ఇది అసలు కథ. రేవంత్ కుట్ర కథ లెక్క తప్పింది ఎట్లా అంటే..! రేవంత్ రెడ్డి,రాహుల్ గాంధీ లు కాంగ్రెస్ రెడ్లు వేల కోట్లకి అధిపతులు ఐతే మరి వీరి దేవుడు రాముడే కదా.! ఇది రుజువు చేసుకున్నాడు పాపం రేవంత్. మరొక్క విషయం..రేవంత్ రెడ్డి అంటున్నాడు.. ఉత్తరభారతీయులు అంతా ఆర్యన్ లు దక్షిణ దేశీయులు అంతా ద్రావిడులు అనడం కూడా పూర్తి గా అసత్యం. అంటే రేవంత్ రెడ్డి దృష్టి లో ఉత్తరభారతం లోని బిసి ఎస్సీ ఎస్టీ లను కూడా ఆర్యులు అంటున్నాడు,దక్షిణ భారతీయ అగ్ర వర్ణాలను ద్రావిడులు అంటున్నాడు.. ఇది ఎక్కడి దుర్మార్గ పిడి వాదం..ఈ భావ జాలం దెబ్బతో దక్షిణ భారత అణగారిన వర్గాల పై ఇక్కడి అగ్ర కులాలు శాశ్వత పెత్తనం చేయొచ్చు..శత్రువే లేకుండా ఇక్కడివారిని బానిసలు గా మార్చుకోవచ్చు అనుకుంటున్నాడు. కానీ ఫూలే అంబేద్కర్ ఖడ్గం తో ఎవడు ఆర్యుడో ఎవడు ద్రావుడు డో,ఎవడు అగ్ర వర్ణమో,ఎవరు అనగారిన వర్గ మో ఒట్టిగనే పసిగట్టి పట్టుకుంటాం.
అంటే రేవంత్ రెడ్డి కుట్ర ప్లాన్ ఏంటి అంటే..! భవిష్యత్తు లో బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్కటి కాకుండా ద్రావిడ పేరుతో అగ్రకులాలు అణగారిన కులాల కి శత్రువులు గా కనపడకుండా ఉంచడం దీని మతలబు.రెండు KCR తెలంగాణ వాదాన్ని మాయం చేయడం.
ఇంతకీ రేవంత్ రెడ్డి ఇక్కడ పొరపాటు చేసింది ఏంటి అంటే..నెహ్రూ కుటుంబాన్ని,రాహుల్ గాంధీ నీ మరియు ఉత్తరాది కాంగ్రెస్ పార్టీ వారి నందరిని కూడా ఆర్యులని ఇరికించాడు ..అందుకని ఇందుమూలం గా వీరి నందరిని తన్ని తరిమేయమని అర్ధం.
#RahulGandhi
#Congress
#Revanthreddy
#BCSCST
వరంగల్ ఎయిర్ పోర్టుకి సమ్మక్క - సారలమ్మ ఎయిర్ పోర్ట్ గా నామకరణం చేయండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి..!
మీరు వరంగల్ ఎయిర్ పోర్ట్ కి పేరు సూచించమని పత్రికల ద్వారా అడిగారు. అందుకు మా ప్రతిపాదన..మేము మొట్టమొదటి రోజు నుండి చెబుతున్నట్టు గా.. 90% బహుజనుల ఆరాధ్య దైవ వీర నారీమణు లైన "సమ్మక్క - సారలమ్మ" ల పేరు తో వరంగల్ ఎయిర్ పోర్ట్ కి నామకరణం చేయమని విజ్ఞప్తి తో కూడిన డిమాండ్ మీ ముందు చేస్తున్నాం.
ఈ పేరు మీరు పెడతారని ఆశిస్తున్నాం.
కానీ.. కాకతీయ ,రుద్రమ పేరును మీరు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.. కాకతీయ,రుద్రమా అంటే..10% లేని దొరలు,అగ్రకులాల నామ స్మరణ అవుతుంది.
కానీ ఆసియా ఖండం లోనే అతి పెద్ద యుద్ధ జాతర జరిగే..విశ్వవిఖ్యాత వీర నారీ మణులైనా సమ్మక్క - సారలమ్మ ల పేరు పెడితే అద్భుతం గా,గంభీరంగా ఉంటుంది. అందుకే వరంగల్ ఎయిర్పోర్ట్ కి ఈ పేరు ఖాయం చేయమని, తెలంగాణలోని 4కోట్ల మంది బహుజనుల నుండి కోరుతున్నాం. ఒక వేళ ఈ సమ్మక్క సారలమ్మ పేర్లు మీరు పెట్టలేదంటే ఖచ్చితం గా మీరు ఈ అణగారిన వర్గాలకు వ్యతిరేకమని నిరూపణ అవుతుందనీ మీము భావించాల్సివస్తుంది.
@TelanganaCMO@revanth_anumula
#SammakkaSaralammaAirport
#Warangal
#BCSCST
కుక్క రాయిని కరుస్తుందా...?
రాయి వేసిన వాడిని కరుస్తుందా ..?
కుక్క దగ్గర జ్ఞానం నేర్చు కుందామా..?
వీడు హమారా ప్రసాద్ కాదు...
వీడు తుమార ప్రసాద్ ( BJP ప్రసాద్)
🔷🔶🔷🔶🔷
ఈ మధ్య SC,ST,BC లు మరియు అంబేడ్కర్ ఆరాధకులు... తమ లోని సర్వ శక్తిని, సర్వ కాలాన్ని సోషల్ మీడియాలో హమారా ప్రసాద్ గాడి పై ఫోకస్ చేయడం, అతడి పై దాడి చేయడం లోనే నిమగ్నమై ఉన్నారు.
బ్రాహ్మణ మనువాద విజయ రహస్యం అంతా శత్రువు ను అదృశ్యం చేయడం లోనే దాగి ఉంది.
ఈ మధ్య "అంబేడ్కర్ కల్పిత నాయకుడు" అనే పుస్తక ఆలోచనలు అన్నీ RSS - BJP వారివే...కానీ వారు ఆ పుస్తకాలు రాయకుండా, వారు SC ST BC లకు శత్రువు రూపం లో కనపడకుండా, దొరకకుండా మన తోటి దళిత శరీరం తోనే ఆ పుస్తకాన్ని రాయించాలనీ నిర్ణయం తీసుకున్నారు.
దాని వల్ల కొన్ని కోట్ల మంది దళితులు, అణగారిన వర్గాలు BJP RSS ని వదిలిపెట్టి...తుమార ప్రసాద్ శరీరం వెంట పడేటట్టు అగ్రకులాలవారు పన్నాగం పన్నారు.
ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి.. అంటే..?
మనకున్న శక్తిలో ఒక్క శాతం మాత్రమే తుమార ప్రసాద్ గాడి పై కేటాయించి వాడి చమడాలు లు తీద్దాం. మిగతా 99 శాతం సమయాన్ని తుమార ప్రసాద్ గాడిని పుట్టిస్తున్న BJP-RSS & మనువాద పార్టీ లపై యుద్ధాన్ని చేద్దాం.
ఈ అగ్రవర్ణ మనువాద పార్టీలు నిరంతరం అనేక రూపాలలో విడుదల చేస్తున్న మనువాద భావజాలం పై మరియు దాని సామాజిక, సాంస్కృతిక రాజకీయ వేదికలకు అభిముఖంగా పూలే-అంబేడ్కర్-కాన్షీరామ్ ల వాదాన్ని నిర్మిద్దాం.
దాని కోసం నిరంతరం మనం జనం లో ఉండి కష్టించి పని చేద్దాం.
ఇక నుండి మనం సోషల్ మీడియాలో ఒక్క శాతం సమయాన్ని కేటాయించి, 99 శాతం సమయాన్ని ప్రజలకు ఇచ్చి వారికి సామాజిక సాంసృతిక రాజకీయ జీవితాన్ని అందిద్దాం.
వారినీ కన్నీళ్లు కష్టాల నుండి బయటికి తీస్తూ,వారికి ధైర్యాన్ని ఇస్తూ.. వారికి నాయకత్వాన్ని ఇద్దాం.
ఇదే మన ప్రజల కోసం చేయాల్సిన నిజమైన అసలైన అంబేడ్కర్ పని.(ఈ నా మాటలు నచ్చకపోతే..నా పై కూడా దాడి చేసే పని లో మీరు ఉండవచ్చు.)
#Ambedkar
#BCSCST
#BJP
#Hamaraprasad
ప్రభుత్వం పరిగి భూములను వదిలేయటం మా ఉద్యమ పాక్షిక విజయమే..!
🔷🔶🔷🔶🔷🔶🔷🔶
వికారాబాద్ జిల్లా పరిగి మండలం,కాడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించిన పట్టా భూములను వదిలేస్తున్నట్లు ప్రభుత్వం MLA ద్వారా అసెంబ్లీలో ప్రకటించడం BC SC ST- JAC పోరాట ఫలితంగా చూస్తున్నాం..! అదే సమయంలో ఇది పాక్షిక విజయం గానే భావిస్తున్నాం. ద సేమ్ టైమ్ దీన్ని సంపూర్ణ విజయంగా భావించడం లేదు. ఎందుకంటే అదే కాడ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో 50 ఏళ్ల నుండి దళితులు, అణగారిన వర్గాలు దున్నుకుంటూ జీవనం సాగిస్తున్న అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరిస్తుందని ప్రకటిస్తుంది. ఈ అసైన్డ్ భూములను కూడా పూర్తిగా ఇండస్ట్రియల్ కారిడార్ నుండి మినహాయించాలి, వదిలేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వం... పట్టా మరియు అసైన్డ్ భూములను ఒక్క అంగుళం కూడా ముట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాం.
#ParigiLands
#Industrialpark
#BCSCST
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం.~ డా.విశారదన్ మహరాజ్
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
నేడు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5 న టీచర్స్ డే - ఉపాధ్యాయుల దినోత్సవం భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనిని BC, SC, ST JAC & DSP పూర్తిగా వ్యతిరేకిస్తుంది, దీనిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యని ప్రజాస్వామ్యం చేయాలనే తలంపులో లేడు. ఆయన విద్య లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండాలనుకున్నాడు. దానికి... ఈ దేశానికి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రాణవాయువు అంటూ ఆయన తన రచన ఐన భారతీయ తత్వశాస్త్రం లో వర్ణ వ్యవస్థను, దానికి మూల సూత్రమైన వేదాలను సమర్థించాడు.90% శూద్రులకు విద్యా - విజ్ఞానం - భూమి -రాజ్యం పై హక్కు లేదని 2 వేల సంవత్సరాలు అవమానించిన వర్ణ వ్యవస్థను సమర్థించిన సర్వే పల్లి రాధాకృష్ణ జయంతి ని ఉపాధ్యాయ దినోత్సవం గా ఎట్లా ప్రకటిస్తారు ..? ఇది ఎంతటి అన్యాయం..?
అందుకే విద్య ప్రజాస్వామ్యం కావాలి,90% శూద్ర ప్రజలకు మరియు స్త్రీలకు అందించాలని వర్ణ వ్యవస్థ పై యుద్ధం చేసిన "మహాత్మ జ్యోతిరావు ఫూలే" జన్మ దినం ఐన ఏప్రిల్ 11న టీచర్స్ డే ( ఉపాధ్యాయుల దినోత్సవం) ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ లో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు గమనిక::
మీరు భౌతిక పరిస్థితుల కోసం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం లో భౌతికంగా పాల్గొనండి. కానీ మీ హృదయం లో మాత్రం... మనం సర్వనాశనం కావాలని కోరుకున్న సర్వేపల్లి జయంతికి మాత్రం స్థానం ఇవ్వకండి.
ఏప్రిల్ 11 నే అనధికారికారంగా , నైతికంగా టీచర్స్ డే ని జరుపుకుందాం. ఇది మన ధర్మం. సర్వేపల్లి జయంతి ని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం అగ్రవర్ణాల ధర్మం.
#Teachersday
#Jyothiraophule
#SarvepallyRadhakrishna
#BCSCST
వెయ్యి రోజుల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గొయ్యి తీసి పాతి పెట్టండి.
🔷🔶🔷🔶🔷🔶🔷
కాంగ్రెస్ ది ప్రభుత్వం కాదు
అది రంగు రంగుల "సినిమా స్టూడియో"
వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అతి పెద్ద మాంత్రిక 'మాయా ప్రపంచం".
ఇందులో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, అంతా శూన్యం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ సినిమా "అగ్రకుల పెద్దలకు మాత్రమే"
"అణగారిన చిన్న కులాలకు ప్రవేశం లేదు."
విద్య వైద్యం ఉపాధి భూమి శాంతి భద్రతలకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదు.
ఇది పేదల పై మరణ శాసనం.
ఇది పెద్దల కు అమృత వర్షం.
@INCTelangana
#Telanagana
#Congress
#BCSCST
రేవంత్ రెడ్డి ది..! రెడ్డి కులానికి న్యాయం
కె.సి.ఆర్ ది దొరలకు న్యాయం
BJP ది సామాజిక అన్యాయం
🔷🔶🔷🔶🔷🔶🔷🔶
రేవంత్ రెడ్డీ..."420" మాటలు బంద్ చేయాలి. అతడి రాజ్యంలో మంత్రులు, MLA లు, ఉన్నతాధికారులు మంత్రాంగం,యంత్రాంగం సర్వం రెడ్డి కులం చేతిలో పెట్టి పైకి నాదే "సామాజిక న్యాయం" అంటున్న మాటలు మా "BC,SC, ST - JAC" ప్రజలలో తీసుకొస్తున్న సామాజిక విప్లవాన్ని...అయోమయానికి గురి చేసే విధంగా,మా పీడిత ప్రజల్ని దారి తప్పించే విధం గా ఉన్నాయి. రేవంత్ రెడ్డి 420 మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
#BCSCST
#SocialJustice
#Telangana
"సామాజిక న్యాయం కనిపించదా KTR..? "
🔷🔶🔷🔶🔷🔶🔷
తెలంగాణ ఉద్యమ స్థాయిలో జల పోరాటం అనీ, నీటి హక్కులకు మించిన మరొక ప్రాధాన్యత భారాసా కు లేదని @KTRBRS అనడాన్ని BC SC ST JAC తీవ్రంగా ఖండిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో యుగయుగాలుగా అణగారిన వర్గాలు అగ్రకులాల కాళ్ళ కింద నలిగిపోయి భూమికి , రాజ్యానికి, విద్య కి సామాజిక గౌరవానికి దూరం ఐపోయి 90% ప్రజలు జీవితాన్నే కోల్పోయారు. అలాంటి పీడిత ప్రజల కోసం భౌగోళిక తెలంగాణ సాధన తర్వాత సామాజిక న్యాయ పోరాటం చేసి వారికి రాజ్యాధికారంలో వాటా, కులాల అణచివేత నుండి విముక్తి పోరాటాలు చేసి సామాజిక న్యాయం చేస్తారని BRS నుండి ఆశిస్తే మళ్లీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ రాజ్యాన్ని భూస్వామ్య తెలంగాణగా పునర్నిర్మించాలనుకుంటున్నారు
KTR.
"సామాజిక న్యాయ ఖడ్గం తో సామాజిక అన్యాయం కోరుకునే వారి తలను దించేస్తాం"
#BCSCST
#Telangana
#BRS
"ఇండియన్ స్టూడెంట్స్ & యంగ్ జనరేషన్"నీట్ ఎగ్జామ్ విషయంలో చేసిన యుద్ధ ఫలితంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయడం పెద్ద విజయంగా భావిస్తున్నాం.
ఈ సంఘటన నడిపిన ఉద్యమాన్ని, దాని నాయకత్వాన్ని అభినందిస్తున్నాం ... అభిజిత్ దీప్కే తో సహా .
అదే విధంగా ఈ దేశాన్ని పాలిస్తున్న మనువాద అగ్రవర్ణ రాజ్య పార్టీలైన BJP & కాంగ్రెస్ మొదలగు పార్టీలను కూకటి వేళ్ళతో కూల్చే కాన్షీరాం పని విధానంలో ఉండాలని కోరుతున్నాం. ఆ క్రమంలో BC, SC, ST -JAC & ధర్మ సమాజ్ పార్టీ మీతో కలిసి పని చేస్తుందని ప్రకటిస్తున్నాం.
@abhijeet_dipke
#NEETstudentsProtest
#GenZ
#CJP
#Sonamwangchuck
నిన్న డిల్లీలో విద్యార్థులు నిర్వహించిన "ఛలో పార్లమెంట్ " నిరసన ర్యాలీ పై BJP మోడీ ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసి రక్తం కళ్ళ చూసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం .
పాల్గొన్న 90% మంది విద్యార్థులంతా మా BC SC ST లే. వారిపై ఈ BJP రక్త దాహం ఎన్నాళ్లు..? మా రక్త కన్నీరు ఎన్ని తరాలు..?
#Chalosansad
#Studentsprotest
#BCSCST
#BJP
#SonamWangchuck
#CJP
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యాదవులకు,బహుజనులకు బద్ద వ్యతిరేకమా..? ఈశ్వరమ్మ యాదవ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివచరణ్ రెడ్డి దారుణం గా అవమానించడాన్ని BC SC ST JAC తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది.వెంటనే శివచరణ్ రెడ్డి ఈశ్వరమ్మ కి తెలంగాణలోని యాదవలందరికి బహిరంగ క్షమార్పణలు చెప్పాలని,అదే సమయం లో శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి శాశ్వతం గా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే శివచరణ్ రెడ్డి బయట అడుగు పెట్టనివ్వం అని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు రెడ్డి సంఘాల jac వైఖరి ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@INCIndia@Bmaheshgoud6666
#BCSCST
#TPCC
#Revathreddy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంకన్న మృతదేహానికి అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు చేయాలి.
నిన్న విధినిర్వహణలో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ముద్దోజు వెంకన్న పైకి బొగ్గు లారీ దూసుకొచ్చి మృతి చెందడం తీవ్ర బాధాకరం.ఈ వెంకన్న అట్టడుగు సామాజిక వర్గం నుండి ఎన్నో అణిచివేతల్ని ఎదుర్కొని వచ్చి ఒక అధికారి అయ్యాడు.ప్రభుత్వానికి ఒక సైనికుడిగా పనిచేస్తూ డ్యూటీ లో చనిపోయాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అధికార లాంఛనాలతో దహన క్రియలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ముఖ్యమంత్రి వెంటనే ఆ దిశగా.. చీఫ్ సెక్రటరీ కి ఆదేశాలు ఇవ్వాలి. ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.హైదరాబాదులో ఒక ఇల్లు కోసం 500 గజాల స్థలం ఇవ్వాలి. మృతుడు వెంకన్న భార్యకు గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం వెంటనే ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మరణం పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మెజిస్ట్రేట్ తో ఎంక్వైరీ వేసి విచారించాలి అని పైన పేర్కొన్న అన్ని డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని BC SC ST JAC & DSP డిమాండ్ చేస్తుంది.
@TelanganaCMO@revanth_anumula@Ponnam_INC
#DTOVenkanna
#Telangana
#BCSCST
అఖిల భారతీయ సంత్ రవిదాస్ ధార్మిక అధ్యక్షులు సుఖదేవ్ మహారాజ్ మరణం నాకు, DSP ఉద్యమానికి తీరని లోటు. గురువు గారు దశాబ్దానికి పైగా ఉద్యమానికి దారిదీపం గా ఉన్నారు..గురూజీ మీరు చూపిన రవిదాస్ ఆశయాలను మేము కొనసాగిస్తాం.
#Sukhdevmaharaj#Santravidas#Ravidasia
తెలంగాణ 100% మా BC/SC/ST ల జాగిరే..!
KTR, పవన్ కళ్యాణ్ ల జాగీర్ కాదు
🔷🔶🔷🔶🔷🔶🔷
తెలంగాణ అగ్రకుల దొరల జాగీరు కాదు . ఆంధ్ర అగ్రకులపోల్ల జాగీరు అంత కన్నా కాదు.ఎందుకంటే 90% BC , SC, ST ప్రజలు తమ రక్త,మాంసాలని, స్వేదాన్నీ చిందించి తెలంగాణ సంపదని సృష్టించిన బానిసలు. ఈ 90% బానిసలే తెలంగాణ భూమి పుత్రులు తప్ప తెలంగాణ దొరలు, పటేళ్లు, రెడ్లు భూమి పుత్రులు కారు.
అసలీ తెలంగాణ ఉద్యమం బయలుదేరింది . మూడున్నర కోట్ల మందివున్న.. 90% BC SC ST తెలంగాణా శ్రామిక వాదం, 10% వున్న అగ్రకుల దోపిడీ తెలంగాణ వాదం. ఈ రెండింటి లో..పవన్ కళ్యాణ్,KTR, రేవంత్ రెడ్డి లు ఎటు వైపో ప్రకటించాలి.
ఈ ఉద్యమం ఏకకాలంలో ఇద్దరు శత్రువుల్ని ప్రకటిస్తుంది .
1) తెలంగాణలో 10 శాతం లేని "రెడ్డి, వెలమ, కమ్మ ,కరణం,కాపు" భూస్వామ్య పెట్టుబడిదారులు.
2) ఆంధ్ర "రెడ్డి, కమ్మ,కాపు దొరలైన పెట్టుబడి దారులు.
వీళ్ళని ఓడించడమే తెలంగాణ BC,SC,ST ల అస్తిత్వం.
తెలంగాణ అస్తిత్వం అంటూ...దానికిందకి మళ్ళీ తెలంగాణ దొరలంతా పోగు ఐతారూ..జాగ్రత్త. ఒక ప్రాంత అస్తిత్వం విలువని సృష్టించి దాన్ని గొప్పది అని అగ్రకుల దొరలు అన్నారు అంటే అది అత్యంత ప్రమాదకరమైనది అని అర్థం.
@KTRBRS@PawanKalyan
#Telanagana
#BCSCST
అమాయకులైన అణగారిన కులాల రక్తం చిందిస్తే..ప్రాణాలు..అర్పిస్తే ప్రజాశక్తి ని విడుదల చేస్తే.. "రెడ్డి-వెలమ- కమ్మ భూస్వామ్య,పెట్టుబడి దారుల" నాయకత్వం లోకి తెలంగాణ రాష్ట్రం పోయింది.
ఇంతకన్నా బహుజనులు బలై పోయిన చరిత్ర దేశంలో వుందా..? అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ రోజు నేను బాధ పడుతున్న , దుఃఖ పడుతున్న,నిరసిస్తున్న. దీనికి పరిష్కారం మన బహుజనులంతా ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలి...అందుకోసం జరుగుతున్న యుద్ధం లో అందరం పాల్గొనాలి.
#TelanaganaFormationDay
#BCSCST
బండి భగీరథ దొరకాలంటే అతని తల్లిదండ్రులైన బండి సంజయ్ ని కుటుంబాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో "మర్యాద" చేయాలి
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
పేదవాళ్లు ఎవరైనా ఎక్కడైనా, ఎక్కడైనా తప్పు చేస్తే ఆ నిందితుడు దొరకకపోతే అతడి కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్లో వేసి మర్యాద చేయడం తెలంగాణ పోలీసుల సంప్రదాయం. అప్పుడు ఆటోమేటిగ్గా నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రత్యక్షమైతడు. సేమ్ టు సేమ్ బండి భగీరథ కుటుంబాన్ని కూడా పోలీసులు అదే "మర్యాద" ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేస్తున్నాం.
#POCSO
#BandiBhagirath
#Telangana