#3yrsSinceCBNreleased#ChandrababuNaidu#AndhraPradesh
అక్టోబర్ 31, 2023... ప్రజల కోసం పోరాడినందుకు కక్షగట్టి తనపై అక్రమ కేసులు పెడితే... చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉండి మధ్యంతర బెయిలు పై చంద్రబాబుగారు బయటకు వచ్చిన రోజు. నిజం, న్యాయం గెలిచిన రోజు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు జగన్ పై ఆగ్రహించిన ప్రజలే, 2024 ఎన్నికల్లో జగన్ కు శిక్ష వేశారు. చంద్రబాబుగారిని ఆశీర్వదించి పట్టం కట్టారు.
నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో....ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు...విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు...సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే....వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు.
నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను.
Happy Birthday, Brahmani ❤️
Through thick and thin, in calm and chaos, you’ve been my constant. A loving mother to Devaansh, a rockstar CEO by day, you’ve walked every step with me. Forever grateful.
@brahmaninara
Spoke to college students yesterday. My simple advice to Gen-Z, especially young boys:
In life, don’t do anything that you can’t tell your mother about. Let your choices be such that you would never hesitate to tell your mother about them.
A moment of pride for our family and for Andhra Pradesh. Hon’ble CM Shri @ncbn Garu honoured as ‘Business Reformer of the Year’ by @EconomicTimes. Few leaders have shaped India’s reform journey with such clarity, courage and consistency. This award is a tribute to his unwavering focus on reforms, speed and trust in governance.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి పేరు తో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫేక్ ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరుతున్నాం.
#FakeNewsAlert
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల శిక్షణా శిబిరానికి హాజరయ్యాను. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో 'కాఫీ కబుర్లు' కార్యక్రమంలో పాల్గొన్నాను. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ హయాంలో... నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ లో జరిగిన శిక్షణా శిబిరాల విషయాలను ఈ సందర్భంగా నేతలతో పంచుకున్నాను. కోటి మంది పార్టీ క్రియాశీలక సభ్యులతో దేశంలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం సిద్ధాంతాలను ప్రజల వద్దకు మరింతగా తీసుకువెళ్లేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుంది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధానాలు, ప్రభుత్వ ఆలోచనలు, విజయాలు, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలు, కార్యకర్తలకు గౌరవం, అందలం వంటి అంశాలపై వారితో చర్చించాను. వారి అభిప్రాయాలు తెలుసుకున్నాను. గ్రామస్థాయిలో అన్ని పరిస్థితులు, మంచి చెడులు తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం మంచి వేదిక అవుతుంది. కార్యకర్తే అధినేత అనే సిద్దాంతంతో పనిచేసే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలను కలుసుకునే ప్రతి సందర్భం నాకు ప్రత్యేకమే. నేటి ఈ సమావేశం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది.
#CognizantChoosesAP#ChooseSpeedChooseAP
స్పీడ్ అంటే ఇది.. దావోస్ వెళ్లి ఏమి సాధించారు అనే వారికి సమాధానం.
జనవరి 23న దావోస్ లో కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు...జూన్ 25న విశాఖలో పెట్టుబడి పెడుతున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది.. డిసెంబర్ 12న (ఈ రోజు), కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. రుషికొండ ఐటీ పార్క్ హిల్-2పై మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి సీటింగ్ కెపాసిటీతో క్యాంపస్ ప్రారంభం అవుతుంది.
శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. రూ.1,583 కోట్ల పెట్టుబడితో, 8వేల మందికి ఉపాధి లభించనుంది.
మరో పక్క కాగ్నిజెంట్, సత్వా గ్రూప్ తో పాటు విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేయనున్నారు.
#InvestInAP
#ChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#JobCreatorInChiefLokesh
#AndhraPradesh
From beaches to bytes and beyond… Andhra Pradesh warmly welcomes Cognizant, Tech Tammina, Sattva, Imaginnovate, Fluentgrid, Motherson, Quarks, ACN Healthcare, and Nonrel to Visakhapatnam, India’s next global tech hub.
#CognizantChoosesAP#ChooseSpeedChooseAP