#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రాయలసీమ రైజింగ్ ... స్వర్ణయుగం ప్రారంభమైంది.
రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న గుర్తుకు వచ్చేవారు. వీటితోపాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ కూడా గుర్తుకు వస్తున్నాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
As part of the Annual Brahmotsavams at Appalayagunta, Sri Prasanna Venkateswara Swamy blessed devotees during the sacred Unjal Seva. The divine swing seva symbolized serenity, grace, and the Lord’s boundless compassion.
#ttd#appalayagunta#sriprasannavenkateswara#brahmotsavams
ఈరోజు రేణిగుంట మండలం, ఎలమండ్యం పంచాయతీ పరిధిలోని కొత్తపాళెం గ్రామం వద్ద మన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సమక్షంలో నిర్వహించిన 'కార్యకర్తల సమన్వయ సమావేశం' వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ల నడుమ చారిత్రాత్మక రీతిలో, బ్రహ్మాండంగా విజయవంతమైంది.
'కార్యకర్తలే పార్టీకి అధినేతలు.. వారే ఈ పార్టీకి అసలైన మూలస్తంభాలు' అనే నమ్మకంతో, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మన నియోజకవర్గ గడ్డపై అడుగుపెట్టిన మన యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలకడం జరిగింది. నాడు నా తండ్రి, దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఆప్తులుగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఏ విధంగా ఒకరికొకరు అండగా నిలిచారో.. నేడు అదే స్ఫూర్తితో లోకేష్ అన్న మార్గదర్శకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లడం నాకు దక్కిన గొప్ప గౌరవం.
ఈ అద్భుతమైన సమావేశాన్ని ఒక సైన్యమై కదలివచ్చి విజయవంతం చేసిన నా ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పేరుపేరునా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మన పార్టీ పాలనలో కార్యకర్తలకు ఎల్లప్పుడూ సముచిత స్థానం, తగిన గౌరవం ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.
మన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు మన శ్రీకాళహస్తి నియోజకవర్గానికి విచ్చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా వారు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన మన యువనేతకు ఆలయ అధికారులు, అర్చకులు మరియు మన పార్టీ ప్రముఖ నాయకులతో కలిసి సాదరంగా స్వాగతం పలకడం జరిగింది. అనంతరం వారు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా.. వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని బహూకరించారు. మన రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆ పరమశివుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగింది.
ఈరోజు మన శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటన ముగించుకుని, మన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు యువనేత శ్రీ @naralokesh అన్నతో కలిసి కలియుగ వైకుంఠనాథుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
ఈ పవిత్ర పర్యటనలో నాతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు గారు, మన సహచర శాసనసభ్యులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకోవడం అత్యంత భక్తిపూర్వక అనుభూతిని ఇచ్చింది.
మన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజాబాంధవులందరి ఇళ్లల్లో ఆ ఏడుకొండలవాడి దయతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వర్ధిల్లాలని.. మన కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో మరింత ముందుకు దూసుకుపోవాలని ఆ శ్రీనివాసుని మనసారా ప్రార్థించాను.
మన శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా.. యువనేత, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న నా సంకల్పాన్ని, క్షేత్ర ప్రగతిపై నాకున్న పట్టును బహిరంగ సభలో ప్రశంసించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి శ్రీ అనంత్ అంబానీ గారు మన ఆలయానికి విచ్చేసినప్పుడు.. ఎలాంటి మొహమాటం లేకుండా మన చారిత్రాత్మక శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధిని కోరడం, దానికి వారు సానుకూలంగా స్పందించి రూ. 50 కోట్ల భారీ విరాళం ప్రకటించడం మన శ్రీకాళహస్తి గడ్డకు దక్కిన అరుదైన గౌరవం! లోకేష్ అన్న అన్నట్టు.. మన క్షేత్రాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు, భగవంతుని సేవలో నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషిని ఎల్లప్పుడూ కొనసాగిస్తూనే ఉంటాను.
సంజీవని ప్రాజెక్టు అనేది వేగవంతమైన వైద్యసేవ మాత్రమే కాకుండా జబ్బుల నుండి ముందస్తు రక్షణకు ఆరోగ్యపరీక్షలు, రోగనిర్ధారణ కూడా అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక.
#Sanjeevani#AndhraPradesh
వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు, రైతుల కళ్లల్లో ఆనందం, వారి ముఖాల్లో కనిపించిన నమ్మకం నా గుండెను తాకింది. 4.50 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, 20 లక్షల మందికిపైగా తాగునీరు అందించే వెలిగొండకు భూములిచ్చిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మేం తీసుకున్నాం. అందులో భాగంగా 2,351 మంది నిర్వాసితులకు మొదటి దశలో రూ.300 కోట్లు అందించాం. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రానున్న రోజుల్లో న్యాయం చేస్తాం. ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయి. ఈ సీజన్ లోనే ఫేజ్ 1 ద్వారా సాగునీళ్లు ఇస్తాం. కరువు ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తాం.
#VeligondaProject
స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ గారు ఓర్వలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టాం. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు జగన్ గారు? పేదలు బాగుపడితే చూడలేరా?
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ గారు ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ గారు ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ గారు?
@ysjagan
గొడ్డలి పార్టీ నేతలు ఎప్పటికీ మారరు. కుట్రలు చేయడం ఆపరు. వాళ్ళ వలన ప్రజలకు కీడే తప్ప మంచి జరగదు. జరగనివ్వరు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను వాళ్ళు ఐదేళ్ల పాటు ఎంతగా హింసించారో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మళ్ళీ ఈరోజు కుట్రలు చేయడానికి అమరావతికి వెళ్లి ఆ రైతుల కోపాన్ని చూసొచ్చారు.
#RythuluAgainstRowdies
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
It was a privilege to clap the first shot and launch the shoot of #NBK112 in #Amaravati.
This is more than the beginning of a film - it is another step towards making Amaravati a vibrant hub for the creative economy. Under the leadership of Hon'ble CM Shri @ncbn garu, we are committed to creating world-class infrastructure that enables the film industry and creators to thrive in Andhra Pradesh.
My best wishes to Bala Mavayya, the entire cast and crew for a blockbuster success. Looking forward to seeing many more films begin their journey from Andhra Pradesh.
“ఇన్విజిబుల్ గవర్నమెంట్… ఎఫెక్టివ్ గవర్నెన్స్”
రియల్ టైమ్ పాలనతో కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం!
@IndianExpress “ఎక్స్‌ప్రెస్ అడ్డా”లో మంత్రి @naralokesh కీలక వ్యాఖ్యలు
🔹 గతంలో వ్యవస్థల పతనం జరిగింది…
👉 ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు
👉 టీడీపీకి ప్రతీకార రాజకీయాలు కాదు… బాధ్యతాయుత పాలనే లక్ష్యం
🔥 స్పీడ్ + స్టెబిలిటీ + సర్వీస్
ఇదే కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం!
#ExpressAdda #NaraLokesh #AndhraPradesh
వేగం.. స్థిరత్వం.. సేవ.. ఇదే ఏపీ అభివృద్ధి మంత్రం!
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలనే సీఎం చంద్రబాబు గారి విజన్‌తో… ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకువస్తున్నాం.
గూగుల్ డేటా సెంటర్ నుంచి భారీ పెట్టుబడుల వరకు… ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయంటే కారణం నమ్మకం, వేగం, పారదర్శక పాలన.
“నా లక్ష్యం ఒక్కటే… యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి అభివృద్ధి” అంటూ మంత్రి @naralokesh గారు స్పష్టం చేశారు.
అమరావతి ఒక రాజధాని మాత్రమే కాదు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక శక్తి కేంద్రంగా మారాలన్నదే లక్ష్యం.
మాటల్లో కాదు… పనులతో ప్రపంచానికి ఏపీ సామర్థ్యాన్ని చూపించే దిశగా ప్రయాణం.
@republic టీవీ కాంక్లేవ్ లో మంత్రి @naralokesh మనోగతం
#RepublicSummit2026 #NaraLokesh #AndhraPradesh
వైకాపా ఇంకో 3 సీట్లు కోల్పోనుందా?
నలభై శాతం ఓట్లకు 11 వస్తే
ఇక 31 శాతానికి లెక్కిస్తే 8 సీట్లు.
వైకాపా ఆస్థాన పేజీలో.. వేసేది వైకాపా వారే. వారికే కూటమి పాలన ఇంత నచ్చితే.. సామాన్య జనం?
ఇక అంత పర్సంటేజీకి పడిపోతే అసలు ఆ 8 అయినా వస్తాయా?
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్‌ను జయించిన విజేత
స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడే బోన్ క్యాన్సర్ బయటపడింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా ఆరోగ్యం మెరుగు పడలేదు. NBK ఫ్యాన్స్ అసోసియేషన్‌కి చెందిన అనంతపురం జగన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ గారు స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. క్యాన్సర్ జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన స్వప్న, తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
#NandamuriBalakrishna